Brahmamudi Serial Today Episode: సీతారామయ్య దగ్గరకు రేవతిని తీసుకెళ్లిన రాజ్, కావ్యలు ఎమోషనల్ అవుతున్న రేవతిని ఓదారుస్తుంటారు. ఇంతలో అక్కడకు స్వప్న, అప్పు, కళ్యాణ్ వస్తారు. అందరూ మాట్లాడుకుంటుండగా అపర్ణ, స్వరాజ్‌ను పిలుస్తూ వస్తుంది. అపర్ణ రావడం చూసి అందరూ కంగారు పడుతుంటారు. కావ్య, రాజ్, రేవతికి ఉన్న ముసుగు సరిచేస్తుంటారు. ఇందిరాదేవి, అపర్ణకు ఎదురుగా వెళ్తుంది.
ఇందిరాదేవి: అపర్ణ నా ముఖం ఎలా ఉంది. ఇదిగో ఈ చెవి దుద్దులు ఎలా ఉన్నాయి.
అపర్ణ: మీరెందుకు అంత కంగారు పడుతున్నారు.
ఇందిరాదేవి: దొరికిపోతామని..
అపర్ణ: ఏం దొరుకుతారు
కావ్య: అదే అత్తయ్యా పండగ సమయంలో ఏ విషయంలోనైనా తాతయ్య గారికి దొరికిపోతానేమోనని కంగారు పడుతున్నారు
సీతారామయ్య: అవును నేనంటే చిట్టికి చాలా భయం అందుకే తెగ కంగారు పడిపోతుంది
అపర్ణ: ఏంటో ఈరోజు అందరూ విచిత్రంగానే మాట్లాడుతున్నారు. ఆ రాధ అడగడం మర్చిపోయాను.. రాధ మిమ్మల్నే పిలుస్తున్నాను..
రేవతి: ఏంటండి.. చెప్పండి
అపర్ణ: ఆండి ఎందుకు ఆంటీ అనోచ్చు కదా
రాజ్: ఆంటీ అనడం ఇష్ట లేకపోతే అమ్మా అని పిలువు అక్కా నేను ఎలాగూ నిన్ను అక్కా అంటున్నాను కదా
ఇందిరాదేవి: పండగ పనులు పక్కన పెట్టి అందరూ ఇక్కడ మీటింగ్ పెడితే ఎలా
అంటూ ఇందిరాదేవి చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. హాల్లో వెళ్తున్న రుద్రాణిని రేవతి కొడుకు స్వరాజ్ పిలుస్తాడు. రుద్రాణి దగ్గరకు వెళ్తుంది.
రుద్రాణి: ఏంట్రా పిలిచావు..
స్వరాజ్: నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి అర్జెంట్ గా తీసుకురావా
రుద్రాణి: నేను నీకెందుకు జ్యూస్ తీసుకురావాలిరా.. నువ్వేమైన మైసూర్ మహరాజువా..?
స్వరాజ్: నేను ఈ ఇంటికి కాబోయే వారసుణ్ణి
రుద్రాణి: ఫ్రెండ్ అంటే వారసుడు అనుకున్నావా..? ఫ్రెండ్‌వు ఫ్రెండ్ లాగా ఉండు నేనేం నీకు పని మనిషిని కాదు
స్వరాజ్: హలో నేను అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను.. నేనే ఈ ఇంటికి కాబోయే వారసుణ్ని
రుద్రాణి: ( మనసులో) నేనేదో వీడి గురించి ఆరా తీస్తుంటే.. వీడే మొత్తం చెప్తున్నాడు.. వెతకబోయే తీగ కాళ్లకు తగిలినట్టు ఉంది.
అనుకుంటూ అందరినీ పిలుస్తుంది. అందరూ వస్తారు.
రుద్రాణి: ఇన్ని రోజులు మీకు తెలియని నిజం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.
ఇందిరాదేవి: ఏం నిజం చెప్పబోతున్నావు
రుద్రాణి: అసలు వీడు ఎవడో తెలుసా..?
అపర్ణ: నా ఫ్రెండ్ అనగానే.. కాదు వీడు ఈ ఇంటి వారసుడు
అందరూ షాక్ అవుతారు.
అపర్ణ: ఏంటి రుద్రాణి నువ్వు చెప్పేది స్వరాజ్ మన ఇంటి వారసుడు ఏంటి..?
ఇందిరాదేవి: తనే ఈ ఇంటి వారసుడు అని ఎవరు చెప్పారు..?
రుద్రాణి: ఎవరో చెప్పడం ఏంటి అమ్మా.. వీడే చెప్పాడు తనే ఈ ఇంటి వారసుడు అని
రాజ్: ఏంటి అత్తయ్యా మీరు చిన్నపిల్లాడు తెలియక వారసుడు అంటే అదే నిజమని నమ్మేయడమేనా..? కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా…
రుద్రాణి: కామన్ సెన్స్ ఉంది. కాబట్టే కన్‌ఫం చేసుకున్నేంత వరకు మిమ్మల్ని పిలవలేదు. ముందు నేను కూడా చిన్న పిల్లాడు ఏదో తెలియక మట్లాడుతున్నాడని అనుకున్నాను.. కానీ వీడికి అన్ని తెలిసే మాట్లాడుతున్నాడని ఆ తర్వాతే అర్థం అయింది. ఈ ఇంటికి వారసుడు అయ్యే అవకాశం రాజ్, కళ్యాణ్, రాహుల్ లకు పుట్టబోయే పిల్లలకు తప్పా ఇంకొకరికి ఉంటుంది నీకు తెలుసా..? వదిన నువ్వు వద్దని ఇంట్లోంచి వెళ్లగొట్టిన రేవతి కొడుక్కి కూడా ఉంటుంది.
అందరూ షాక్ అవుతారు.
ఇందిరాదేవి: రుద్రాణి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్తం అవుతుందా..? వాళ్ల అమ్మను ఎదురుగా పెట్టుకుని వాడు మన ఇంటి బిడ్డకు పుట్టిన వాడు అంటే ఏం బాగుంటుంది.
రుద్రాణి: ఆ ముసుగులో వచ్చిన ఆవిడ రేవతి కాదని ఏం గ్యారంటీ ఉందమ్మా..?
కావ్య: ఏం మాట్లాడుతున్నారు మీరు.. రేవతి గారు ఇలా ముసుగులో రావడానికి ఆవిడకు ఏం అవసరం..
రుద్రాణి: అయితే ఒక్క నిమిషం ఉండండి తనెవరో ఇప్పుడే బయటపెడతాను.
అంటూ ముసుగు తీసయబోతుంటే అపర్ణ తిట్టి ఆపేస్తుంది. వాళ్ల ఆచారాన్ని నువ్వు పాడు చేస్తావా..? ముందు ఆవిడకు సారీ చెప్పు అంటూ… స్వరాజ్‌ను ఎందుకు వారసుణ్ని అన్నావు అని అడుగుతుంది అపర్ణ. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇల్లు నాది అన్నావు కదా ఇల్లు నాది అయినప్పుడు నేను ఈ ఇంటికి వారసుణ్ని అవుతాను కదా అందుకే చెప్పాను అంటాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ముసుగులో వచ్చింది రేవతి అని ఆ స్వరాజ్ రేవతి కొడుకే అని తెలుసుకుంటుంది. మరోవైపు రుద్రాణి కావ్య, అప్పుల కడుపు పోయేందుకు తీర్థంలో పాయిజన్ కలుపుతుంది. అది స్వరాజ్, కనకం చూస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!