గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 09 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 09 Episode)
బాలు తన భార్యమీనాతో కలసి అత్తారింటికి వెళతాడు. సుమతి ఇద్దరికీ విశెష్ చెబుతుంది.బావా నీ షర్ట్ చాలా బావుందని చెబుతుంది. ఇంట్లో అందరకీ నచ్చింది..ఎక్కడ కొన్నారని అడుగుతాడు బాలు. శివ కొని తీసుకొచ్చాడని చెప్పగానే...బాలు షాక్ అయి చూస్తాడు. వాడు కొన్న షర్టా ఇది అని అరుస్తుండగా శివ వస్తాడు. ఏం నేను కొనిస్తే ఏమవుతుందని అడుగుతాడు శివ. మీరు కొన్నారు అనగానే పూలమ్మి కష్టపడి సంపాదించి ఉంటారని అనుకున్నా అందుకే సంతోషంగా వేసుకున్నాను..కానీ జనాలను పీడించి సంపాదించిన సొమ్ముతో కొన్న షర్ట్ నాకు అవసరం లేదంటాడు. అదేం రోడ్డుపై కొన్నది కాదు..బ్రాండెండ్ ది అని మరో పంచ్ వేస్తాడు శివ. నువ్వు ఎలా సంపాదించావో తెలుసుకదా అంటాడు. అయితే ఇంకా నీ వంటిపై ఎందుకుందని శివ అనగానే..బాలు షర్ట్ విప్పేసి కోపంగా బయటకు వెళ్లిపోతాడు. పార్వతమ్మ, సుమతి బతిమలాడినా ఆగడు. మీనా కూడా ఆ వెనకే వెళ్లాల్సి వస్తుంది.
మౌనిక కోసం ప్రసాదం తీసుకెళ్లిన ప్రభావతిని సంజయ్ విమర్శిస్తాడు..అక్కడి నుంచి వచ్చేస్తుంది ప్రభావతి. ఆ తర్వాత కోపంగా ఇంటికి వచ్చిన బాలుని చూసి షాక్ అవుతారంతా. షర్ట్ లేకుండా వచ్చాడేంటని ప్రభావతి అడిగితే..షర్ట్ వేసుకోనిది నేనా
మా బావగారు కోటీశ్వరులు కదా మా పెళ్లిరోజుకి పది సూట్లు పెడతారు కదా అందుకే ఉన్న షర్ట్ ఊడబీక్కుని వచ్చాను అంటాడు. తొక్కతీసేసిన అరటిపండులా తిరిగి వచ్చావేంటిరా అని మనోజ్ అంటాడు. షర్ట్ లేకుండా పబ్లిక్ లో తిరిగితే న్యూసెన్స్ కేసు కింద పోలీసులు లోపలేస్తారని అంటాడు మనోజ్. సమాధానం చెప్పకపోతే అమ్మ కడుపు ఉబ్బిపోతుందని రవి సెటైర్ వేస్తాడు. షర్ట్ పై టీ పడింది..మీనా ఉతికి ఆరేస్తే ఎవడో ఎత్తుకుపోయాడని చెబుతాడు. నేను నమ్మను అని ప్రభావతి అంటుంది. గుడిముందు అడుక్కునేవాడిని చూసి జాలిపడి ఇచ్చాను అంటాడు బాలు. అస్తమానం గుడిముందు అడుక్కునేవాడిని గుర్తుచేస్తున్నావేంట్రా అని సుశీలమ్మ అడిగితే..ప్రభావతి మాట దాటవేస్తుంది. అక్కడేదో జరిగింది నాకు ఇప్పుడే తెలియాలని ప్రభావతి అనగానే.. జరిగింది చెప్పాను నచ్చితే నమ్మండి లేదంటే మీకు నచ్చింది రాసుకోండి అనేసి వెళ్లిపోతాడు బాలు. నిజం చెప్పవే కడుపు ఉబ్బిపోతోందని ప్రభావతి అనగానే..జీలకర్రవేసి మరిగించి ఇస్తానని చెప్పి మీనా వెళ్లిపోతుంది. కామాక్షి ఆంటీని పిలవనా రెండు గుద్దిపంపిస్తుందని శ్రుతి అంటుంది. ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోతారు.. ఆ తర్వాత రోహిణిని పంపించి అసలు విషయం కనుక్కోమంటుంది ప్రభావతి.
మీ ఇంట్లో ఏమైందని రోహిణి అడుగుతుంది..ఏదైనా గొడవ అయిందా..నువ్వే వెళ్లేటప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు లేదు ఏం జరిగిందో నిజం చెప్పు అంటుంది రోహిణి. నీకు అంత ఆనందం ఏముందని మీనా అడుగుతుంది. నేను బాధపడుతున్నానని నీకు చెప్పానా? మీ నాన్న డబ్బులు పంపించినప్పుడు పొంతనలేకుండా మాట్లాడుతుంటే బాలు క్వశ్చన్ చేశాడని మీకు కాలింది..అవి మీ సొంత విషయాలు అయినప్పుడు ఇవి నా సొంత విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండే మంచిదని వార్నింగ్ ఇస్తుంది మీనా. ఆ మాటలు విని ప్రభావతి షాక్ అవుతుంది.
ఇంతలో సుశీలమ్మ వచ్చి కూడా సేమ్ ప్రశ్న అడుగుతుంది. సంజయ్ మౌనిక ఇద్దరూ వచ్చారు కదా అని అందుకే త్వరగా వచ్చేశాం అంటుంది. నిజం చెప్పమ్మా అని సుశీలమ్మ అడిగితే.. బావ-బామ్మర్దుల మధ్య ఏం జరిగిందో తెలియడం లేదు..చొక్కా వాడు కొన్నాడని తెలియగానే చొక్కా విప్పి పడేసి వచ్చేశారని మీనా చెప్పి బాధపడుతుంది.చిన్నప్పటి నుంచి బాలు తత్వమే అంత..వాడి మనసు గాయపడితే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేడని చెప్పి మీనాకు అర్థమయ్యేలా చెబుతుంది. ముళ్లకంపలా ఉండేవాడు ఎంతబాగా మారాడో నేను చూశాను..తొందర్లోనే బావా బామ్మర్దుల మధ్య సమస్యపోయి సంతోషంగా ఉంటారని సుశీలమ్మ హామీ ఇస్తుంది. నువ్వు బాధపడకని ఓదార్చుతుంది.
బాలు దగ్గరకు వెళ్లిన సుశీలమ్మ నాకు అంతా తెలుసు అని క్లాస్ వేస్తుంది. మొహానికి నవ్వు అలంకారం అయితే కోపం వికారంగా మార్చేస్తుందని చెబుతుంది. కోపం, ఉక్రోషం, చిరాకు ఏదైనా కానీ మానెయ్ అంటుంది. శివని చూస్తే ఎందుకు కోపం అని అడిగితే చెప్పరు..నేనెలా అర్థం చేసుకోవాలని బాధపడుతుంది మీనా. పెళ్లిరోజు ఇద్దరూ కలసి ఆనందంగా ఉండాలి..నీ తల్లి నిన్ను ప్రేమించకపోయినా ఈ బంగారుతల్లి నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటుందని చెబుతుంది. మా పెళ్లే గొడవలతో మొదలైంది నాకు అలవాటైపోయిందని మీనా బాధపడుతుంది. ఇప్పుడు ఏమైందని ఎందుకు బాధపడుతున్నావ్..వాడేదో మాట్లాడాడు నేను సమాధానం చెప్పాను అక్కడే అయిపోయిందని అంటాడు. నాకు కోపం లేదని నువ్వు నమ్మాలంటే చొక్కా వేసుకోవాలా అని వేసుకుంటాడు.. నవ్వేస్తుంది మీనా.