తీయగా.. ఎంతో రుచిగా ఉండే బొప్పాయిని ఎవరు తినకుండా వదిలేయలేరు. కానీ కొంతమంది అస్సలు బొప్పాయి పండు జోలికే వెళ్లరు. వేడి ఎక్కువగా ఉంటుందని తమ రోజు వారి డైట్‌లో బొప్పాయిని చాలా తక్కువగా చేర్చుతుంటారు. అస్సలు బొప్పాయిని తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు ఆ పండును అస్సలు నిర్లక్ష్యం చేయలేరు. తప్పకుండా మీ రోజువారి డైట్‌లో బొప్పాయిని చేర్చుకుంటారు. 


నారింజ పండు కంటె ఎక్కువ విటమిన్-సిని కలిగి బొప్పాయి పండులోనే ఉంటుంది. అందుకే, ఈ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆహార నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఎన్నో పోషకాలను తనలో దాచుకున్న బొప్పాయి పండు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, అసిడిటీ, లివర్ శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటికి పంపడం వంటి సమస్యలతో పోరాడుతుంది.


మీరు ప్రతిరోజు బొప్పాయి తినడానికి పది కారణాలు


కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: బొప్పాయి పండు బోలెడన్ని ఫైబర్‌లు, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అంతే కాదు బొప్పాయిలో ఉండే విటమిన్ 'సి' గుండె సంబంధిత జబ్బులను తగ్గించడంలోను సహాయపడతాయి.


బరువును తగ్గించుకోవచ్చు: కిలో బోప్పాయి పండు 43 క్యాలరీలను కలిగి ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్  ఫుడ్ అవుతుంది. ఎందుకంటే బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ పండును తినవచ్చు. బొప్పాయి మలబద్దకానికి కూడా మంచి మందుల పని చేస్తుంది.


రోగ నిరోధకతను పెంచుతుంది: రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-C అధికంగా కలిగి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు శరీరానికి హాని కలిగించే వాటినుంచి కణాలను కాపాడుతుంది.


మధుమేహాన్ని తగ్గిస్తుంది: మధుమేహం ఉన్నవారు ఏ పండును తినాలో ఏది తినకూడదో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి బొప్పాయి పండు మంచి ఎంపిక. ఎందుకంటే బొప్పాయి చక్కెర శాతాన్ని తక్కువగా కలిగి ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అంతేకాదు బొప్పాయి పండు ‘టైపు-2 డయాబెటీస్’ను తగ్గించడంలో సహాయపడుతుందని తాజా అద్యయనాల ద్వారా తేలింది.


కంటిని కాపాడుతుంది: బొప్పాయి విటమిన్ ఎ, బీటా కెరోటిన్, జియాక్సంతిన్, సైప్టోక్సంతిన్, లుటిన్ వంటి విటమిన్లను, ఫ్లేవనాయిడ్లు ను కలిగి ఉండటం వల్ల వయస్సు పెరగటం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే జియాక్సంతిన్, లుటిన్ లు గ్లాకోమా, కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధులను నివారించడంలోను సహాయపడతాయి.


జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:  బొప్పాయి జీర్ణ శక్తికి సంబంధించిన ఫైబర్ లను అధికంగా కలిగి ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపైన్  ఎంజైమ్ కడుపుకు సంబంధించిన అజీర్తి, GERD, గుండెలో మంట వంటి రుగ్మతలను తగ్గిస్తుంది.


కీళ్ళనొప్పుల నుంచి రక్షణ కల్పిస్తుంది: బొప్పాయి కీళ్ళనొప్పుల వల్ల వచ్చే వాపును తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంజైమ్లు, విటమిన్-C కీళ్ళల్లో కలిగే నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.


కాన్సర్ ను నివారిస్తుంది: బొప్పాయిలో ఉండే, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్లు శరీరానికి కాన్సర్ కణాలతో పోరాడే శక్తిని అందిస్తాయి.


జుట్టుకు పోషణ అందిస్తుంది: బొప్పాయిలో ఉండే మినరల్లు, విటమిన్లు, ఎంజేమ్స్ జుట్టు పెరుగుదలలో సహాయ పడతాయి. జుట్టుకు నిగారింపును కూడా అందిస్తాయి.


ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది: బొప్పాయిలో ఉండే విటమిన్-C ఒత్తిడిని కలిగించే హార్మోన్ ల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. రక్తపోటుతో బాధపడేవారు తమ డైట్ లో బొప్పాయిని చేర్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.


Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి