శరీర పనితీరు సక్రమంగా ఉండాలంటే ముఖ్యమైన 6 పోషకాలు ఖచ్చితంగా కావాలి. వాటిని ఆహార పదార్థాల ద్వారా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పోషకాలు శరీరంలో స్వయంగా తయారు చేయలేవు. కాబట్టి ఆహారం ద్వారా వాటిని మనం పొందాలి. రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చెయ్యడంలో అల్పాహారం ఎంతగా ప్రభావం చేస్తుందో అలాగే మధ్యాహ్నం మనం తీసుకునే భోజనం కూడా అంతే ముఖ్యం. పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందుకే వీలైనంత వరకు మీ లంచ్ బాక్స్ లో ఈ పదార్థాలతో చేసిన వంటకాలు ఉండే విధంగా చూసుకోండి.
మొక్కజొన్న
పాలు దేశాలలో ప్రధానమైన ఆహారం. ఎంతో రుచికరమైనది, పోషకాలతో సమృద్ధిగా ఉండే పదార్థం. మొక్కజొన్నలో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మధ్యాహ్న భోజనంలో మొక్కజొన్నతో చేసిన వంటకాలు ఉండేలా చూసుకోవాలి. మొక్కజొన్న ఉడికించి దానిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. లేదంటే మొక్కజొన్న గింజలతో సరికొత్త వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు. మీడియం మొక్క జొన్నలో సుమారు 19 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3.3 గ్రాముల ప్రోటీన్‌తో పాటు 6.9 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. మీ మధ్యాహ్న భోజనంలో పించి పదార్థాలు చేర్చుకోవడానికి అద్భుతమైన తృణధాన్యం ఇది.
కోడి గుడ్లు
రోజుకో గుడ్డు తినమని వైద్యులు తప్పనిసరిగా సూచిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. హార్మోన్ల పనితీరు దగ్గర నుంచి జుట్టు, కండరాలు, చర్మ సంరక్షణ వరకు కావలసిన అన్ని ప్రోటీన్స్ ఇది అందిస్తుంది. శరీరం సరిగా పని చెయ్యడానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. గుడ్డులోని తెల్ల సొన లేదా గుడ్డు మొత్తం ఉడికించినది తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందిస్తుంది. గుడ్డులోని తెల్లసొన ఉడకబెట్టినప్పుడు 4 గ్రాముల ప్రోటీన్, మొత్తం గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వాటిని కలపండి తీసుకోవడం వల్ల భోజనంలో 10 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నట్టే.
దోసకాయ
పేగులను శుభ్రం చెయ్యడంలో దోసకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పైబర్ ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ (AND) ప్రకారం పెద్దవాళ్ళుకి రోజుకి 2000 కేలరీల ఆహారం అవసరం. అందులో ఖచ్చితంగా 25-38 గ్రాముల మధ్య ఫైబర్‌ని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. దోసకాయలో అధిక నీటి శాతం ఉంటుంది. అంటే కాదు పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బాదంపప్పు
బాదం పప్పులో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు సమృద్ధిగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాల్లో ఇది కూడా ఒకటి. ఇతర పోషకాలతో పోల్చుకుంటే కొవ్వులు కూడా సమతుల్యంగా ఉండాలి. రోజుకి మనం తీసుకునే 2000 కేలరీల ఆహారంలో కొవ్వు 67 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. మోతాదుకు మించి కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అందుకే శరీరానికి అవసరమైన కొవ్వు, కేలరీలను అందించేందుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకోవడం ఉత్తమం.
పండ్లు
భయంకరమైన వ్యాధులణు దూరం చెయ్యడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు, ఖనిజాలు ప్రతిరోజు తీసుకోవడం చాలా అవసరం. అందుకే పోషకాలను తీసుకోవడానికి రోజు ఆహారంతో పాటు పండ్లు కూడా ఇతనడం అలవాటు చేసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: చట్నీ పొడి ఇలా చేసి పెట్టుకోండి, నెల రోజుల పాటూ ప్రత్యేకంగా టిఫిన్లకు చట్నీ చేసుకోనక్కర్లేదు
Also read: అయిదు రోజులు ట్రిప్‌కెళ్లాడు, వచ్చాక చూస్తే ఒకేసారి మంకీపాక్స్, కోవిడ్, హెచ్ఐవీ పాజిటివ్