Onam 10 Days Significance : 'ఓనం' అనేది కేరళలో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ ఫెస్టివల్లో పంట, సాంస్కృతికత ప్రధానంగా ఉంటుంది. సాంప్రదాయాలు ప్రతిబింబించేలా.. సంస్కృతులను చాటి చెప్పేలా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఓనంను ప్రత్యేకంగా పది రోజులు జరుపుకుంటారు. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ.. కేరళ వారసత్వాన్ని హైలైట్ చేసే ఈ పండుగలో పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ పాలుపంచుకుంటారు. అందమైన రంగోలిలు పూలతో డెకరేట్ చేయడం నుంచి.. పడవ పోటీల వరకు ఒక్కో రోజు ఒక్కో వేడుకలా చేసుకుంటారు. అయితే ఈ పదిరోజులకు ఉండే పేర్లు ఏంటి? వాటిని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిరోజు - అథం (Atham)
ఓనం పండుగ 'అథం'తో ప్రారంభమవుతుంది. మొదటిరోజున ఇళ్లు శుభ్రం చేసుకుని.. రంగురంగుల రంగోలిలను వేస్తారు. పూలతో వాటిని అందంగా మెరుగులుదిద్దుతారు. ఈ ప్రాసెస్‌ను 'పూకలం' అంటారు. పండుగ ప్రారంభానికి ఇది చిహ్నంగా ఉంటుంది. తర్వాత రోజుల్లో కూడా వీటిని కొనసాగిస్తారు.