Non Alcoholic Fatty Liver Causes and Prevention Tips : మందు ఎక్కువగా, రెగ్యులర్‌గా తీసుకునేవారిలో కాలేయ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాలేయంలో కొవ్వు కూడా ఏర్పడుతుంది. అయితే ఆల్కహాల్ అలవాటు లేనివారికి కూడా ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని అలవాట్లు కాలేయంలో కొవ్వును పెంచుతాయట. దీనివల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం లేదా ఫ్యాట్ పెరిగిపోయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయట. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.
లైఫ్‌స్టైల్..
సరైన జీవనశైలి ఫాలో అవ్వకపోవడం, ఒబెసిటీ సమస్యల వల్ల శరీరంలో విసెరల్ ఫ్యాట్ పెరుగుతుంది. దీనివల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఈ తరహా సమస్యలు యువతలో కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు జెనిటిక్స్ వల్ల కూడా ఒబెసిటీ సమస్యతో ఇబ్బంది పడతారు. వారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికీ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నా.. మిగిలినవారికి వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఆహారం
నోరూరించే బర్గర్స్, పిజ్జాలు, స్ట్రీట్ ఫుడ్, డోనట్స్, కేక్స్ వంటి వాటిని ఎక్కువగా తింటారు. వీటిలో షుగర్స్, స్వీట్స్, ప్రాసెస్ చేసిన కార్బ్స్, సీడ్ ఆయిల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తాయి.
దీర్ఘకాలిక సమస్యలు
మధుమేహం, బీపీ వంటివి మెటబాలీజం తగ్గిస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్సీ పవర్‌ని తగ్గిస్తాయి. వీటివల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. ఇవి కూడా ఫ్యాటీ లివర్‌కి కారణమవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేసుకోవాలన్నా.. పూర్తి ఆరోగ్యం కోసం అయినా లైఫ్స్టైల్లో కచ్చితంగా మార్పులు చేయాలి. వీలైనంత వరకు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చేయండి. వారానికి కనీసం 150 నిమిషాలు వర్క్అవుట్స్ లేదా వ్యాయామాలు చేయండి. కార్డియో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొవ్వు త్వరగా తగ్గడంతో పాటు బరువు కంట్రోల్ అవుతుంది. బరువును వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి.
వ్యాయామంతో పాటు డైట్లో కూడా మార్పులు చేయాలి. బయటి ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. డైట్లో పప్పులు, లీన్ ప్రోటీన్స్, పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి. షుగర్ డ్రింక్స్ తగ్గించాలి. రిఫైండ్ కార్బ్స్ అంటే బ్రెడ్ వంటివాటికి దూరంగా ఉండాలి. ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది.
రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకోవడం.. దీర్ఘకాలిక సమస్యలకు వైద్యులు ఇచ్చే మందులు ఉపయోగించడం చేయాలి. సరైన నిద్ర కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి.. వీలైనంత వరకు 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.