2025 Best Affordable Electric Scooters In India: భారతదేశంలో మండిపోతున్న డీజిల్-పెట్రోల్ ధరలు ఇటు జనం జేబును, అటు పర్యావరణాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒకే పనితో స్వామి కార్యం & స్వకార్యం నెరవేరినట్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే జేబుపై భారం తగ్గుతుంది & పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా.. ఆఫీస్‌కు వెళ్లిరావడం లేదా ఇతర పనుల కోసం రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాళ్లకు ఇవి చవకైన & స్మార్ట్ ఆప్షన్‌గా మారాయి. ఇంకా, ఎలక్ట్రిక్ స్కూటర్లు స్టైలిష్ రైడ్‌ను కూడా ఇస్తున్నాయి.
ప్రస్తుతం, మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు - Bajaj Chetak, TVS iQube & Ather 450X. ఇవి కామన్ మ్యాన్ బడ్జెట్‌లో ఉండటమే కాకుండా మెట్రోలో ప్రయాణించడం కంటే తక్కువ ఖర్చుతో రైడ్ ఇస్తాయి. అంటే, మీ డబ్బును ఆదా చేస్తాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, ఈ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లు & అద్భుతమైన రేంజ్‌తో ఈ ప్రసిద్ధ మోడళ్లను ప్రవేశపెట్టాయి.
1. బజాజ్ చేతక్బజాజ్ చేతక్ ఒక రెట్రో-లుకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్. బలమైన నిర్మాణ నాణ్యత & ప్రీమియం డిజైన్‌తో ఇది పాపులర్ అయింది. దీనిలో 4 వేరియంట్‌లు ఉన్నాయి - బజాజ్ చేతక్ 2903, బజాజ్ చేతక్ 3501, బజాజ్ చేతక్ 3502 & బజాజ్ చేతక్ 3503. బజాజ్ చేతక్ 2903 ధర రూ. 98,498, బజాజ్ చేతక్ 3502 ధర రూ. 1.22 లక్షలు & బజాజ్ చేతక్ 3503 ధర రూ. 1.02 లక్షలు. 2903 వేరియంట్ 2.9 kWh బ్యాటరీతో 123 కి.మీ. ప్రయాణిస్తుంది. 3501/3502 వేరియంట్‌లు 3.5 kWh బ్యాటరీతో 153 కి.మీ. రైడింగ్ రేంజ్ ఇస్తాయి. ఈ స్కూటర్‌లో టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, మ్యూజిక్ & కాల్ నోటిఫికేషన్స్, రివర్స్ మోడ్, జియో-ఫెన్సింగ్ & 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి స్మార్ట్ ఫీచర్‌లు ఉన్నాయి.
2. టీవీఎస్ ఐక్యూబ్ TVS iQube ను మధ్య తరగతి కస్టమర్ల మొదటి ఎంపికగా చూస్తున్నారు. దీని ధర రూ. 1.09 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ iQube, iQube S & iQube ST వేరియంట్లలో లభిస్తుంది. iQube పరిధి 94 KM, iQube S పరిధి 145 KM & iQube ST పరిధి 212 KM. ఈ టూవీలర్‌లో 7-అంగుళాల TFT టచ్ స్క్రీన్, జాయ్‌స్టిక్ నావిగేషన్, రివర్స్ మోడ్, USB ఛార్జింగ్, LED లైటింగ్ & జియో-ఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుదూర రోజువారీ వినియోగానికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
3. ఏథర్ 450Xయువ రైడర్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450X. దీని రెండు వేరియంట్లు - 2.9 kWh & 3.7 kWh. వాటి ధరలు వరుసగా రూ. 1.49 లక్షలు & రూ. 1.59 లక్షలు. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ స్కూటర్ 126 KM రేంజ్ & 3.7 kWh బ్యాటరీ ప్యాక్ స్కూటర్ 161 KM రేంజ్ ఇవ్వగలదు. 7-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్ & OTA అప్‌డేట్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. టెక్నాలజీ పరంగా అప్‌డేటెడ్‌గా ఉండాలనుకునే వాళ్లకు ఇది సరైన ఎంపిక.
ఈ మూడు స్కూటర్లు వాటి విభాగాలలో గొప్ప పనితీరును, శక్తిమంతమైన లక్షణాలు & తక్కువ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోజూ ప్రయాణించేవాళ్లకు స్మార్ట్ & రిలయబుల్ పార్ట్‌నర్ అవుతాయి.