తప్పు చేయలేదు... సారీ సారీ ఈసారి తప్పను సరి చేశారు... సోషల్ మీడియాలో అల్లు అర్జున్ స్పీచ్ తర్వాత వినపడుతున్న వ్యాఖ్యలు ఇవే.  ఎందుకంటే... 'పుష్ప 2 ది రూల్' విడుదలకు ముందు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరిగిన వాడి వేడి చర్చ అటువంటిది. ఆ టోటల్ ఎపిసోడ్ అల్లు అర్జున్ చుట్టూ తిరిగింది. ఆ వివరాల్లోకి వెళితే...

రేవంత్ రెడ్డి అన్న గారూ...పూర్తి పేరు స్పష్టంగా పలికిన బన్నీ!'పుష్ప 2 ది రూల్' విడుదలకు ముందు ఓ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి అల్లు అర్జున్ కాస్త తడబడ్డారు. మధ్యలో మంచినీళ్ల బాటిల్ తీసుకుని తాగి ఆ తర్వాత చెప్పారు. తెలంగాణ సీఎం ఎవరో కూడా హీరోకి తెలియదని సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. ఇక ప్రతిపక్ష పార్టీ అయితే నానా హంగామా చేసింది. ఆ కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకు సినిమా విడుదల అయ్యింది.

అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూడాలని అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడం, అక్కడ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, ఆ కేసులో బన్నీని అరెస్టు చేసి ఒక్క రాత్రి పోలీస్ స్టేషన్‌లో‌ ఉంచడం ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు బన్నీని అరెస్టు చేయించారని కేటీఆర్ సహా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) నాయకులు పలువురు పదే పదే చెప్పారు. చట్టం తన పని తాను చేసుకు వెళ్లిందని రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. అవన్నీ పక్కన పెడితే...

Also Read: సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరీ... 'గద్దర్ అవార్డ్స్'లో 'పుష్ప 2' డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

'పుష్ప 2 ది రూల్' సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గద్దర్ పురస్కారం అందుకున్నారు. ఆ అవార్డును రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు. అనంతరం ఇచ్చిన స్పీచ్‌లో 'రేవంత్ రెడ్డి అన్న గారు' అంటూ అల్లు అర్జున్ చెప్పడం ఈవెంట్ అంతటికీ హైలైట్ అని చెప్పాలి. దాంతో ఐకాన్ స్టార్ ఈసారి తప్పు చేయలేదని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

బన్నీ సరిగ్గా చెప్పాడు గాని...బాలకృష్ణ ఒకరి పేరు మర్చిపోయారు!గద్దర్ పురస్కారాల వేడుకలో అల్లు అర్జున్ ఎవరి పేరు మర్చిపోలేదు. వేదికపై ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పేర్లను సరిగ్గా చెప్పారు అయితే ఇదే వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరును మర్చిపోయారు. కాస్త ఆగి ఆయన పేరు చెప్పారు. దాంతో తెలంగాణ డిప్యూటీ సీఎం పేరును బాలయ్య మరిచిపోయారని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?