వివాహబంధంతో ఒక్కటైన వారి మధ్య ప్రేమ, నమ్మకం చాలా ముఖ్యం. అదే విధంగా లైంగిక జీవితం కూడా చక్కగా ఉండాలి. వీటిల్లో ఏది తక్కువైనా గొడవలు రాక తప్పదు. లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు వయాగ్రా వంటివి వాడే కన్నా సహజంగా ఆహారం ద్వారానే పటుత్వాన్ని పెంచుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే రోజూ కింద చెప్పిన ఆహారాలను తినడమే. విటమిన్ ఇ అనేది సెక్స్ విటమిన్. లైంగిక జీవితానికి ఇది కీలకమైనది. ఇది లోపిస్తే లైంగిక జీవితం అసంతృప్తిగా మిగిలిపోతుంది. అందుకే మీరు కచ్చితంగా తినవలసిన ఆహారాలు ఇవన్నీ.  


జీడిపప్పు: జీడిపప్పులో ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు, సెలీనియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవి  మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఇవన్నీ మీ లైంగిక చర్య ఎక్కువ సేపు జరిగే శక్తిని అందిస్తాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ లిబిడోను పెంచుతుంది.


వాల్‌నట్‌లు: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్, అర్జినైన్ వంటి "ఫీల్-గుడ్ కెమికల్స్"ను పెంచుతాయి. అర్జినైన్ అనేది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి పనికొచ్చే అమైనో ఆమ్లం. అంగస్తంభన కాకుండా నైట్రిక్ ఆక్సైడ్  ఉపయోగపడుతుంది. ఇది మీ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


పైన్ నట్స్: జింక్ లోడ్ చేయబడిన పైన్ గింజలు లైంగిక శక్తిని, లిబిడో స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పైన్ గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది, ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ ఆరోగ్యకరమైన వీర్య కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. మెరుగైన లైంగిక జీవితాన్ని అందిస్తుంది. కాబట్టి, మీ లైంగిక శక్తిని పెంచుకోవడానికి పైన్ గింజలను మీ ఆహారంలో చేర్చుకోండి.


వేరుశెనగలు: పురుషులకు లిబిడో పెంచే ఆహారాల్లో వేరుశెనగ ఒకటి. వేరుశెనగల్లో ఎల్-అర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలించడం ద్వారా లైంగిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్త నాళాలు ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి సహాయపడతాయి. కాబట్టి ఇది అంగస్తంభనను నివారించడంలో ముందుటుంది. 


బాదంపప్పులు: బాదంపప్పులు జింక్, సెలీనియం, విటమిన్ ఇతో కూడిన సూపర్-హెల్తీ  ఫుడ్. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అంగస్తంభన రాకుండా అడ్డుకుంటుంది. 


గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. పురుషుల ప్రోస్టేట్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జింక్  మహిళల్లో సెక్స్ డ్రైవ్‌కు చాలా సహాయపడుతుంది. అదనంగా,గుమ్మడికాయ గింజలను తినడం వల్ల అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 


Also read: కోడిమాంసాన్ని కడగకుండానే వండాలా? పచ్చి చికెన్‌ను చేతులతో తాకితే ప్రమాదమా?


Also read: ఆ టిష్యూ పేపర్ కొనాలంటే మీ ఏడాది జీతం ఇవ్వాల్సిందే, అది ఎందుకంత ఖరీదు?







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.