New Study on Cancer Detection : క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఓ మంచి వార్త వచ్చింది. క్యాన్సర్ పేషెంట్లకు మేలు చేసే విధంగా శాస్త్రవేత్తలు ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎలాంటి ఇంజెక్షన్లు వేయాల్సిన అవసరం లేకుండా.. ఎటువంటి రేడియేషన్ కూడా అవసరం లేకుండా క్యాన్సర్ పేషెంట్లకు హెల్ప్ చేసే ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వల్ల క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడటమే కాకుండా.. క్యాన్సర్ చికిత్సలో మంచి ఫలితాలు చూడొచ్చు.

ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు

బ్రిటన్​లోని రాయల్ మార్స్డెన్ NHS ఫౌండేషన్ ట్రస్ట్, లండన్​లోని క్యాన్సర్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఒక కొత్త సాంకేతికతను కనుగొన్నారు. ఈ సాంకేతికతలో భాగంగా.. క్యాన్సర్ రోగుల మొత్తం శరీరాన్ని MRI ద్వారా స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ ద్వారా MRD అంటే మైలోమా అవశేషాలను కూడా గుర్తిస్తారు. మిగిలిన పరీక్షలన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ క్యాన్సర్ గుర్తించడానికి ఇది సాధ్యమవుతుందిన వారు పరిశోధనలో కనుగొన్నారు.

పరిశోధనలో ఏమి జరిగిందంటే..

పరిశోధనలో 70 మంది మైలోమా రోగులను చేర్చారు. వీరికి స్టెమ్ సెల్ మార్పిడి చేశారు. మార్పిడికి ముందు, తరువాత అందరికీ MRI స్కాన్ చేశారు. పరిశోధనలో.. ప్రతి ముగ్గురిలో ఒక రోగికి చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ స్వల్పంగా ఉన్నట్లు తేలింది. దీనిని కేవలం ఈ స్కాన్ ద్వారానే గుర్తించారు. అంతేకాకుండా ఈ వ్యాధి స్కాన్​లో కనిపించిన రోగుల మొత్తం మనుగడ రేటు కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు..

MRI సాంకేతికత ఎందుకు ప్రత్యేకమైనదంటే

ఈ స్కానింగ్ టెక్నిక్ రేడియేషన్ రహితమైనది. దీనిలో భాగంగా ఎలాంటి ఇంజెక్షన్లు లేదా సూది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే.. ఇది పూర్తిగా సురక్షితం. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు పర్యవేక్షణలో ఉంచబడే రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రాయల్ మార్స్డెన్ కథ ఏమిటి?

ఈ క్యాన్సర్ స్కాన్​లో పద్ధతి ద్వారా  57 ఏళ్ల క్యాన్సర్​ రోగిని గుర్తించారు. అతని పేరు రాయల్ మార్స్డెన్. అతను మాట్లాడుతూ.. ఈ స్కానింగ్ కారణంగా క్యాన్సర్ సకాలంలో గుర్తించి.. చికిత్స త్వరగా ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ సాంకేతికత తన ప్రాణాలను కాపాడటమే కాకుండా.. మళ్లీ ఫైటర్ జెట్లను నడపడానికి, ఆపరేషనల్ డ్యూటీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చిందని ఆయన అన్నారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

ప్రొఫెసర్ క్రిస్టినా మెసియు మాట్లాడుతూ.. ఈ స్కానింగ్ టెక్నిక్ చికిత్సకు ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. సాంప్రదాయ పరీక్షలలో మిస్ అయ్యే క్యాన్సర్​ను ఇది గుర్తిస్తుందని అన్నారు. అదే సమయంలో ప్రొఫెసర్ మార్టిన్ కైజర్ దీనిని "గోల్డ్ స్టాండర్డ్ ప్రిసిషన్ ఇమేజింగ్" అని పిలిచారు. ఇది మైలోమా చికిత్సకు కొత్త దిశను ఇస్తుందని తెలిపారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.