Ammayi garu Serial Today Episode కోమలి ఇంట్లో అందర్ని తనే రూప అని అందర్ని నమ్మిస్తుంది. ఉదయం ఇంట్లో పూజ చేస్తుంటే రుక్మిణిలా ఉన్న అసలైన రూప కోమలిని ఈడ్చేస్తుంది. కోమలి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. ఇంటికి సంబంధం లేని మనిషి రూప అని వచ్చి పూజ చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటుంది. 

రుక్మిణి తండ్రితో నాయనా మీరో ముఖ్యమంత్రి మీ గురించి మీ ఇష్టాఇష్టాల గురించి మన ఫ్యామిలీ గురించి నెట్‌లో చాలా ఉంటుంది. తనేంటి ఎవరైనా తెలుసుకోవచ్చు అని అంటుంది. తను కూడా ఇలా నెట్‌లో తెలుసుకొని నాటకం ఆడుతుందని రుక్మిణి అంటుంది. అవును సూర్య తను మన రూప కాదు అని అంటుంది. అవునా అమ్మ నువ్వు కూడా ఇలా అంటున్నావా నా మీద ఒట్టేసి చెప్పమ్మా రూప చనిపోయింది అని అంటుంది. విరూపాక్షి షాక్ అయిపోతుంది. రుక్మిణిగా రూప బతికే ఉండటంలో విరూపాక్షి ఒట్టు వేయదు. 

విరూపాక్షి సూర్యప్రతాప్‌తో ఏ తల్లి అయినా తన బిడ్డ స్పర్శ బట్టి చెప్పేస్తుంది. ఈ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా తను మన రూప కాదు అని ఒట్టేసి కోమలి ప్లాన్ తిప్పి కొట్టడంతో కోమలి షాక్ అయిపోతుంది. అమ్మా నన్నే గుర్తు పట్టకపోతే నేను ఇక బతకడం వేస్ట్ అని కోమలి చనిపోతా అంటూ ఓవర్ చేస్తుంది. దాంతో సూర్యప్రతాప్‌ ఆపి నువ్వు  బతకాలి నా కోసం బతకాలి అంటారు.  దాంతో కోమలి బతికుంటాను నాన్న నీ కోసం బతుకుతాను. వీళ్లంతా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారు అది చాలు నాన్న నాకు అని బంటీని రెడీ చేసి స్కూల్‌కి తీసుకెళ్తా అంటుంది. 

రాజు ఆపి నువ్వు వద్దు నేను వెళ్తాను అని అంటే సూర్యప్రతాప్‌ ఆపి తను తీసుకెళ్తా అంటుంది కదా తీసుకెళ్లని అంటాడు. విరూపాక్షి సూర్యతో ఇది మన  కూతురు కాదు బంటీని ఎటు తీసుకెళ్తుందో అని అంటుంది. విరూపాక్షి అని  సూర్యప్రతాప్‌ అంటాడు. దానికి విరూపాక్షి తను నా కూతురి అనే భావన నాకు కలగడం లేదు.. తన భార్య అని రాజుకి అనిపించడం లేదు.. తల్లి అని బంటీ అనుకోవడం లేదు మరి ఎలా అని అడుగుతుంది. దానికి సూర్యప్రతాప్‌ నా కూతురు రూప బతికే ఉందని నేను నమ్ముతున్నా.. ప్రపంచం మొత్తం నా కూతురు చనిపోయింది అని నమ్మినా నేను నమ్మను.. తను నా పక్కనే ఉందనే భావన నా మనసుకి కలుగుతుందని సూర్యప్రతాప్‌ అంటారు. 

రాజు సూర్యప్రతాప్‌తో పెద్దయ్య అమ్మాయి గారు గురించి మీకు తెలిసినట్లు ఎవరికీ తెలీదు కానీ నేను కూడా అమ్మాయి గారిని ప్రేమించాను నేను ప్రేమించిన అమ్మాయి గారి గురించి నాకు తెలీదా పెద్దయ్య తన నడక, నడవడికి ఆఖరికి.. తన శ్వాస కూడా తెలిసిన వాడిని ఈ అమ్మాయిలో నాకు అమ్మాయిగారు కనిపించడం లేదు పెద్దయ్య అని అంటాడు. ఏమైంది రాజు నీకు నువ్వు నా కోసం వెయిట్ చేసుంటే నీకు నేను అమ్మాయిగారిలా కనిపించే దాన్ని కానీ నువ్వు వేరొక అమ్మాయి పక్కన నిల్చొన్నావు అంటే అర్థమవుతుంది అంటుంది. దానికి రాజు నేను వేరొక అమ్మాయి పక్కన నిల్చొన్నాను అంటే ఏ పరిస్థితిలో నిల్చొంటానో మా అమ్మాయి గారికి అర్థమయ్యేది నీకు కాలేదు అంటే తెలుస్తుంది నువ్వు ఎవరో అని అంటాడు. 

సూర్యప్రతాప్‌ కోమలితో నువ్వు రూప అంటే వీళ్లెవరూ నమ్మడం లేదు అందుకు నువ్వు ఒక పని చేయాలి అని ఏం చేయాలి నాన్న అని కోమలి అనగానే నువ్వు డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోవాలని సూర్యప్రతాప్‌ అంటారు. దాంతో కోమలి, విజయాంబిక, దీపక్‌లు బిత్తరపోతారు. రాజు చేయించమని అలా అయితే నమ్ముతా అంటాడు. కోమలి కంగారుగా అలాగే అంటుంది. రాజు డాక్టర్‌ని తీసుకురావడానికి వెళ్తాడు. రూప కోమలి దగ్గరకు వెళ్లి ఏంటి రూప కాని రూప డీఎన్‌ఏ టెస్ట్‌తో నీ బాగోతం బయట పడుతుంది. అప్పుడు నీ రూపం ఈ భూమ్మీద ఉండదు.. ఇప్పుడు నేను వెళ్లి ప్రశాంతంగా పూజ చేసుకుంటా అంటుంది. 

కోమలి గదిలోకి వెళ్లి ఇలా ఇరుక్కున్నానేంటి డీఎన్ఏ టెస్ట్‌లో పక్కా దొరికిపోయాను.. దొరికిపోతే ఏం చేయాలి.. సరి దిద్దుకోలేని తప్పు చేశాను అంటుంది. విజయాంబిక వాళ్లు వస్తే నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు ఇప్పుడేం చేయాలి.. అని కంగారు పడుతుంది. పారిపోదాం అనుకున్నా దారి దొరకడం లేదు  అని అంటుంది. విజయాంబిక కంగారు పడొద్దు అని డీఎన్‌ఏ టెస్ట్ మీకు కొత్త మాకు కాదు డాక్టర్లు మాకు తెలిసిన వాళ్లు కదా. ఆ డాక్టర్ మాచేతిలో ఉంటారు. మేం ఏం చెప్తే అదే రిపోర్ట్స్‌లో వస్తుంది అని కోమలికి చెప్తారు. నువ్వు దొరికి పోతే మేం కూడా దొరికిపోతాం కదా నువ్వు ధైర్యంగానే ఉండు మొత్తం మేం చూసుకుంటాం అని అంటారు. కోమలి రిలాక్స్ అయిపోతుంది. విజయాంబిక దీపక్‌తో డీఎన్ఏ రిపోర్ట్స్ మనకు అనుకూలంగా రావాలి అని అంటుంది. 

సూర్యప్రతాప్‌తో పాటు అందరూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తారు. మనకు అనుకూలంగా ఉన్న డాక్టర్ వస్తాడు కదా దీపక్ ఈ రూప పరిస్థితి ఏంటో అని అనుకుంటారు. దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని విరూపాక్షి అంటే నాకు ఎందుకో అత్తయ్య దీని వెనక ఉందని అనిపిస్తుందని రూప అంటుంది. ఇంతలో రాజు డాక్టర్‌ని తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్‌ని చూసి విజయాంబిక, దీపక్ షాక్ అవుతారు. మన వాడు వస్తాడు అనుకుంటే వీడు ఎవడో వచ్చాడు అని కంగారు పడతారుసూర్యప్రతాప్‌ కూడా మనసులో శ్రీనివాస్ గారు రాలేదు ఏంటి అనుకుంటాడు. రాజుకి విషయం అడిగితే అతను లేరు అతను చెప్పారని ఈయన్ని తీసుకొచ్చానని అంటాడు. విజయాంబిక, దీపక్‌ల కంగారు చూసి నా పని అయిపోయిందని కోమలి అనుకుంటుంది. డాక్టర్ కోమలి, సూర్యప్రతాప్‌ల బ్లడ్ సాంపిల్స్ తీసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.