Kidney Damaging Habits : శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే మన రోజువారీ జీవనశైలిలో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు. చాలామంది తెలియకుండానే చేసే అలవాట్లు భవిష్యత్తులో కిడ్నీ సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం కోసం ఈ అలవాట్లను వెంటనే మార్చుకోవడం మంచిదని చెప్తున్నారు. అవేంటంటే..

Continues below advertisement

తగినంత నీరు తాగకపోవడం..

రోజంతా సరిపడా నీరు తాగకపోతే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు పంపలేవు. దీంతో టాక్సిన్లు శరీరంలో పేరుకుపోయి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ సమస్య కిడ్నీలను మరింత ప్రభావితం చేస్తుంది.

ఉప్పు ఎక్కువగా తినడం..

చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగి కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ డ్యామేజ్‌కు కారణమవుతుంది.

Continues below advertisement

పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం

చిన్న నొప్పికైనా తరచూ పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలకు మంచిది కాదు. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఎక్కువకాలం మందులు తీసుకుంటే కిడ్నీల్లో రక్తప్రసరణ తగ్గి సమస్యలు రావచ్చు.

స్వీట్స్ తినడం

సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. డయాబెటిస్ కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు.

మూత్రాన్ని ఆపుకోవడం

పని ఒత్తిడి లేదా ఇతర కారణాలతో చాలామంది యూరిన్‌ను ఎక్కువసేపు ఆపుకుంటారు. ఇలా చేయడం వల్ల మూత్రాశయం, కిడ్నీలపై ఒత్తిడి పెరిగి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రను నిర్లక్ష్యం చేస్తే..

తగినంత నిద్ర లేకపోతే శరీర అవయవాల పనితీరు ప్రభావితమవుతుంది. కిడ్నీలు కూడా రాత్రివేళల్లో శరీరాన్ని రిపేర్ చేసే ప్రక్రియలో భాగమవుతాయి. కాబట్టి సరిగ్గా నిద్రపోకపోతే కిడ్నీల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. 

వ్యాయామం లేకపోవడం

ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఊబకాయం, బీపీ, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి.

ప్రోటీన్ తీసుకోవడం

జిమ్ చేసే చాలామంది అధికంగా ప్రోటీన్ తీసుకుంటుంటారు. అయితే అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీలను బలహీనపరుస్తాయి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..

కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే రోజుకు తగినంత నీరు తాగాలి. ఉప్పు, షుగర్ కంట్రోల్ చేయాలి. రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ.. వైద్యులు సూచించిన మందులు వేసుకుంటూ బీపీ, షుగర్‌ అదుపులో ఉంచుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. ఈ రోజువారీ మార్పులతో కిడ్నీలను చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయి. 

కిడ్నీల ఆరోగ్యం గురించిన మరిన్ని విషయాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.