చర్మం కాంతివంతంగా కనిపించేలా ఉండేందుకు ఫేస్ కి బ్లీచ్ చాలా అవసరం. ఇది మొహం మీద పేరుకుపోయిన మలినాలు, మృత కణాలు తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపుని అందిస్తుంది. స్కిన్ నేచురల్ గా కనిపించేందుకు సహజ సిద్ధమైన పదార్థాలతో బ్లీచ్ చేసి స్క్రబ్ చేసుకుంటే చర్మం మృదుగువా మెరిసిపోతుంది. కిచెన్ లో దొరికే వాటితోనే సింపుల్ గా ఇంట్లోనే నేచురల్ బ్లీచ్ చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన పదార్థాలు..


నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్


తేనె- ఒక టేబుల్ స్పూన్


పెరుగు- ఒక టేబుల్ స్పూన్


కొన్ని చుక్కల బాదం నూనె( ఆప్షనల్)


ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, తేనె, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొన్ని చుక్కల బాదం ఆయిల్ వేసుకుని మరలా బాగా కలుపుకోవాలి. బాదం నూనె చర్మానికి మాయిశ్చరైజర్ మాదిరిగా సహాయం చేస్తుంది. ముందుగా గోరు వెచ్చని నీటితో ఫేస్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. గోరు వెచ్చని నీటితో ముఖానికి రాసుకున్నది మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. మెత్తని టవల్ తీసుకుని మెల్లగా తుడుచుకోవాలి.


స్కిన్ హైడ్రేట్ గా ఉండటం కోసం చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ బ్లీచ్ లో ఉపయోగించే నిమ్మరసం చర్మాన్ని మరింత సున్నితంగా మారుస్తుంది. నిమ్మకాయ ఆధారిత ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ సేపు సూర్యరశ్మికి గురి కాకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది రాసుకున్న తర్వాత ఏదైనా చికాకు, దురదగా అనిపిస్తే వెంటనే ఈ రెమిడీ మానేయాలి. ఇటువంటి చర్మ సంరక్షణ టిప్స్ పాటించే ముందు బ్యూటీషియన్స్  నుంచి సలహా తీసుకోవడం మంచిది. అప్పుడే చర్మం రకానికి తగిన వాటిని వాళ్ళు సిఫార్సు చేస్తారు.


ఇవి మాత్రమే కాదు నారింత తొక్క, పెరుగు, టొమాటో, కీరదోస వంటివి కూడా నేచురల్ బ్లీచ్ కింద ఉపయోగపడతాయి. చాలా మందికి మెడ, మోచేతులు భాగాల్లో నల్లగా మారిపోతుంది. దాన్ని పోగొట్టుకునేందుకు నారింజ తొక్కల బ్లీచ్ చక్కగా పని చేస్తుంది. నారింజ తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకుని దానిలో కొద్దిగా పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దాన్ని నలుపు ఉన్న భాగాల్లో అప్లై చేసుకుని కాసేపు ఉంచుకున్న తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కాఫీ పొడి కూడా నలుపు తగ్గించే పని చక్కగా చేస్తుంది. ఒక టొమాటో తీసుకుని దాన్ని సగానికి కట్ చేసుకోవాలి. దాని మీద కాఫీ పొడి, పంచదార వేసుకుని మొహం, చేతులు, మెడ మీద మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది శరీరం మీద పేరుకుపోయిన ట్యాన్ ని తొలగిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: అమెజాన్ అడవుల్లో ఆ చిన్నారులను 40 రోజులు బతికించిన ఆహారం ఇదే - ఎంత ఆరోగ్యకరమో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial