National Herbs and Spices Day 2025 : వంటింట్లోని మసాలాలతో, పెరట్లోని మూలికలతో ఆరోగ్యానికి కలిగే లాభాలు వివరిస్తూ ఇండియాలో ప్రతి ఏడాది జాతీయ సుగంధ ద్రవ్యాల దినోత్సవం చేస్తున్నారు. మసాలాలు, హెర్బ్స్​లోని ఔషద గుణాలు.. వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ వివరించేందుకు ఎన్నో ఏళ్లుగా ఈ స్పెషల్ డేని నిర్వహిస్తున్నారు. ఎప్పటినుంచి మొదలైందో వివరాలు లేనప్పటికీ ప్రతి ఏడాది జూన్ 10వ తేదీన దీనిని జరుపుతున్నారు. 

ప్రకృతి అందించే మూలికలు, సహజమైన పదార్థాలతో ఆరోగ్యానికి కలిగే లాభాలు వివరించడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే మనకి అందుబాటులో ఉండే హెర్బ్, మసాలాలు ఏంటి? వాటిని డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. 

హెర్బ్స్.. వాటి బెనిఫిట్స్

తులసి : తులసి ఆకుల రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, యాంగ్జైటీ లక్షణాలు దూరమవుతాయి. శ్వాస సమస్యలను దూరం చేయడంలో మంచి ప్రయోజనాలు ఇస్తుంది. 

పుదీనా : పుదీనా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. నోటి నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని టీ రూపంలో లేదా నేరుగా, ఇతర వంటకాల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. 

కొత్తిమీర : కొత్తిమీర శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్ షుగర్​ని అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. 

మెంతికూర : మెంతి కూర కూడా బ్లడ షుగర్​ను అదుపులో ఉంచుతుంది. ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించి.. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

కరివేపాకు : జుట్టు పెరుగుదలకు కరివేపాకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 

మసాలలతో కలిగే లాభాలివే.. 

పసుపు : పసుపులో యాంటీఇన్​ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్​ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కీళ్ల సమస్యలను దూరం చేస్తాయి. హెల్తీ స్కిన్​ని అందిస్తూ.. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పసుపులో ఉంటాయి. 

అల్లం : అల్లం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కడుపు తిప్పడం వంటి సమస్యలు తగ్గుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

మిరియాలు : మిరియాల్లో పోషకాలను శరీరానికి అందించే లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వీటిని డైట్​లో చేర్చుకుంటే మంచిది. 

దాల్చిన చెక్క : రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క మంచి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 

లవంగాలు : దంత సమస్యలను దూరం చేయడం, పంటి నొప్పిని తగ్గించడంలో లవంగాలు హెల్ప్ చేస్తాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇన్​ఫెక్షన్లను దరిచేరకుండా చేస్తాయి. 

యాలకులు : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు యాలకులు తినొచ్చు. జీర్ణ సమస్యలను కూడా ఇవి దూరం చేస్తాయి. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. 

హెర్బ్స్, మూలికలను కేవలం ఫ్లేవర్స్ కోసమే కాదు.. ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలు అందించడం కోసం కూడా వీటిని తీసుకోవచ్చు. వీటిని డైట్​లో చేర్చుకునే ముందు వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.