Pawan Kalyan Lose Weight For OG : కుంభమేళాలో పవన్ కళ్యాణ్​ని చూసి.. పర్సనాలిటీ మారిపోయిందని.. పొట్ట పెరిగిందని.. ఈయన హీరోగా ఏమి చేస్తారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా వచ్చాయి. అయితే కట్ చేస్తే.. నాలుగు నెలలు తిరిగే సరికి పవన్​ కళ్యాణ్ మరోసారి తన లుక్​తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అయితే ఈ సారి ట్రోల్స్ కాదండోయ్.. అన్నా.. ఏంటి అన్నా ఆ లుక్​.. ఈ ఫిట్​నెస్ ఏంటి అన్నా అంటూ పోస్ట్​లు వేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్.. దానిపైనే ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాస్త బరువు పెరిగారు. మధ్యలో హరిహరవీరమల్లు, ఓజీ షూటింగ్స్​లో పాల్గొన్నారు కానీ.. బరువు విషయంలో పెద్దగా మార్పులు జరగలేదు. అయితే ఫిబ్రవరి 18వ తేదీన కుంభమేళాకు వెళ్లి స్నానమాచరించిన ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో పవన్ కాస్త లావుగా కనిపించారు. 

సెలూన్ ఓపెనింగ్​కి షార్ట్​లో

ఈ మధ్యకాలంలో కుర్తా, పైజామాల్లో ఎక్కువ​గా కనిపించిన పీకే.. రీసెంట్​గా జూన్ 8వ తేదీన సెలూన్ షాప్ ఓపెనింగ్​​కి ఎవరూ ఊహించని విధంగా షార్ట్, టీ షర్ట్​లో వెళ్లారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ లుక్​లో పవన్ పూర్తి ఫిట్​గా కనిపించారు. ఇంతకీ తన లుక్​ని ఎలా మార్చుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే ఫిట్​నెస్ రొటీన్ ఇప్పుడు చూసేద్దాం. 

పవన్ ఫిట్​నెస్ సీక్రెట్స్.. 

పవన్ కళ్యాణ్ మార్షల్స్ చేస్తారనే విషయం అందరికీ తెలుసు. అలాగే బూట్ క్యాంప్స్ ఎక్కువగా చేస్తారట. ఇది ఆయన ఫిట్​నెస్​లో భాగమని నటుడు గగన్ విహారి తెలిపారు. అలాగే ఆయనకు పది నుంచి 12 గంటల వర్క్​ అవుట్ చేయగలిగే స్టామినా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. షూట్​కి ముందు ఆయన బూట్ క్యాంప్స్ ఎక్కువగా చేస్తారట. దీనిని చేయడం కష్టం కానీ.. పవన్ చాలా ఈజీగా చేస్తారని తెలిపారు. ఫిట్​నెస్​లో భాగంగా డైట్​లో కూడా మార్పులు ఉంటాయి. అలాగే ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఒక పూట భోజనమే తింటానని.. ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటానని తెలిపారు. 

గుర్తించుకోవాల్సిన విషయమేంటి అంటే నటులు షూట్​లేని సమయంలో ఎలా ఉన్నా.. షూట్ ప్రారంభమయ్యే సరికి తమ లుక్​ని చాలా ఈజీగా మార్చుకుంటారని గగన్ విహారి తెలిపారు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ వ్యాయామాలు చేస్తారు. దీనివల్ల వారు తమ క్యారెక్టర్​కి తగ్గట్లు మారిపోతారు. అలాగే ప్రస్తుతం ఓజీ కోసం తన లుక్​ని మార్చుకునే పనిలో పవన్ ఉన్నారు. దాని రిజల్ట్ రీసెంట్ ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే అభిమానుల్లో ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లుక్​తో అవి మరింత రెట్టింపు అయ్యాయి.