National Doctors Day 2025 : వైద్యులను గౌరవిస్తూ వారి అందించే సేవలను గుర్తిస్తూ.. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులుగా వారు సమాజానికి అందించే సేవలను గుర్తిస్తూ.. భారతదేశంలో జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం చేస్తున్నారు. అసలు డాక్టర్స్ డే ఎలా ప్రారంభమైంది? దాని చరిత్ర, ప్రాముఖ్యతలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యాన్ని వృత్తిగా కాకుండా.. దానినో బాధ్యతగా తీసుకుంటూ.. ప్రజలకు సేవలు అందిస్తోన్న వైద్యులను గుర్తిస్తూ.. వారికి థ్యాంక్యూ చెప్పేందుకు ఈ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. ఎందరి ప్రాణాలనో కాపాడుతున్న వారందరి సేవలు గుర్తించడమే లక్ష్యంగా దీనిని చేస్తున్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవ చరిత్ర
ఇండియాలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని 1991 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం, వర్దంతి సందర్భంగా.. జూలై 1వ తేదీన ఈ డాక్టర్స్ డే నిర్వహిస్తున్నారు. వైద్య, ప్రజా సేవ రంగంలో ఆయన చేసిన కృషికి గౌరవిస్తూ.. వైద్యుల దినోత్సవం చేయడమే కాకుండా.. భారతరత్న కూడా ఇచ్చి భారతప్రభుత్వం గౌరవించించిది.
ఎలా సెలబ్రేట్ చేస్తారంటే..
ఈ స్పెషల్ డే రోజున పలు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ పలు కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తాయి. అలాగే హెల్త్‌కేర్ అవగాహన సదస్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేయడం, ఎడ్యూకేషనల్ సెషన్స్ నిర్వహించే.. వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు. సీరియస్ మెడికల్ కండీషన్స్‌పై వైద్యుల దినోత్సవం రోజు వైద్యులు అవగాహన కల్పించేలా వీటిని నిర్వహిస్తారు.
ఇలా విష్ చేయండి..
వైద్యుల అంకితభావం, కృషిని గుర్తించి.. వారికి కృతజ్ఞతను చెప్పేందుకు ఉత్తమమైన మార్గాలలో నేషనల్ డాక్టర్స్ డే ఒకటి. కాబట్టి మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా.. మీ ప్రాణాన్ని నిలబెట్టిన డాక్టర్‌కు మీ హృదయపూర్వక సందేశాలు పంపి.. లేదా వారికి మీ మాటాల్లో ఓ కాల్ లేదా వాయిస్ నోట్ పంపి విషెష్ చేయండి. లేదా మీరు గిఫ్ట్ రూపంలో కూడా మీ గ్రాటిట్యూడ్‌ని వ్యక్తం చేయవచ్చు.