Naga Chaitanya Diet and Fitness Tips : అక్కినేని ఫ్యామిలీ ఫిట్నెస్ విషయంలో అస్సలు కాంప్రిమైజ్ కాదు. నాగార్జునను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 65 ఏళ్లలోనూ ఆయన ఫిట్నెస్, లుక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. డైట్, ఫిట్‌నెస్‌లో ఎప్పుడూ కాంప్రిమైజ్ కారు కాబట్టే ఈ వయసులోనూ అంత ఫిట్‌గా ఉన్నారు. తండ్రిని ఇన్స్ప్రేషన్గా తీసుకుని నాగచైతన్య కూడా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొన్ని విషయాల్లో చై అస్సలు మిస్టేక్ చేయడట. అంతేకాదు ఫిట్‌గా ఉండేందుకు చై ఫాలో అయ్యే టిప్స్, చేయని మిస్టేక్స్, డైట్‌కి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిట్నెస్ టిప్స్
ఫిట్నెస్ అనేది నాగచైతన్య దృష్టిలో రోటీన్. అంటే నీళ్లు తాగడం, అన్నం తినడం ఎలాగో.. శరీరానికి వ్యాయామం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అని తెలిపాడు. జిమ్ అంటే ఏదో వ్యాయామం చేయడం, ఫిజికల్‌గా కష్టపడటం అనుకుంటారు కానీ.. నా వరకు మాత్రం అది నన్ను సమస్యలనుంచి దూరం చేసే ఓ ఆయుధం అని తెలిపాడు చై. యోగా, మెడిటేషన్‌తో మైండ్ రిలాక్స్ అవుతుందని అందరూ చెప్తారు.. కానీ నాకు మాత్రం జిమ్, వర్క్అవుట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. నెగిటివ్ థాట్స్ నుంచి డైవర్ట్ చేస్తాయని తెలిపాడు. జిమ్ అనేది ఫిజికల్‌గా కంటే, మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేస్తుందని తెలిపారు. కచ్చితంగా రోజూ కనీసం గంట జిమ్ చేయడం చైకి అలవాటు. లుక్‌ని బట్టి వర్క్ అవుట్స్ మారుస్తూ ఉంటాడట.
ఏమి తింటారంటే..
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అరలీటర్ నీళ్లు కచ్చితంగా తాగుతాడట. బ్రేక్‌ఫాస్ట్‌గా ఎగ్స్, పీనట్ బటర్, టోస్ట్, ఫిల్టర్ కాఫీ తీసుకుంటారట. మధ్యాహ్నం అయితే లంచ్‌లో ప్రోటీన్ 120 గ్రాములు తీసుకుంటారు. ఈ ప్రోటీన్‌లో భాగంగా చికెన్ లేదా ఫిష్ తీసుకుంటారట. కార్బ్స్ కోసం 80 గ్రాముల అన్నం లేదా క్వినోవా తీసుకుంటారట. ఫైబర్ 100 గ్రాములు తీసుకుంటారట. ఇలా పోర్షన్ కంట్రోల్ చేసి తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయంటున్నారు. సినిమా, లుక్స్‌ని బట్టి ఈ డైట్ మారుతూ ఉంటుందట.
ఆ మిస్టేక్ చేయడట
ఫిట్‌నెస్‌లో జిమ్ 30 శాతం పాత్ర పోషిస్తే.. డైట్ 70 శాతం మేజర్ రోల్ ప్లే చేస్తుందని చై తెలిపాడు. అందుకే డైట్ విషయంలో అస్సలు కాంప్రిమైజ్ కానంటూ చెప్పాడు చైతన్య. వారంలో ఓ పూట మాత్రమే చీట్ డే ఉంటుంది. అప్పుడు మాత్రమే తనకి నచ్చిన ఫుడ్స్ తీసుకుంటాడట. కానీ వారంలో తనకి నచ్చిన ఏ ఫుడ్ పెట్టినా దాని జోలికి కూడా వెళ్లడట. ఆదివారం మాత్రమే.. అది కూడా మధ్యాహ్నం మాత్రమే చీట్ డేగా తీసుకుంటారట.
సప్లిమెంట్స్
ఫిట్నెస్, హెల్త్ జర్నీలో భాగంగా సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాడట చైతన్య. దానిలో భాగంగా మల్టీవిటమిన్స్, మెగ్నీషియం, షిఫ్ ఆయిల్స్, ప్రోటీన్ తీసుకుంటారట. అయితే ప్రోటీన్ విషయానికొస్తే.. దానిని పౌడర్, బార్స్‌లా కాకుండా ఎగ్ వైట్స్‌తో రిప్లేస్ చేస్తూ ఉంటారట. అలాగే అశ్వగంథ కూడా తన రోటీన్లో తీసుకుంటాడట చైతన్య.
Also Read : శోభిత ధూళిపాల స్కిన్ కేర్ రోటీన్.. ఆ ఒక్కటి లేకుంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నా లాభం లేదంటోన్న బ్యూటీ