Tips for For Faster Weight Loss : ఈరోజుల్లో బరువు తగ్గడం అనేది చాలామందికి ఉండే ఫిట్​నెస్ గోల్స్​లో ఒకటి. మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా ఎక్కువమంది వెయిట్ లాస్ అయ్యేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్​కి వెళ్లడం నుంచి డైట్​లో మార్పులు చేయడం, 10 వేల స్టెప్ కౌంట్ వరకు ఎన్నో అంశాలు ఫాలో అవుతారు. అయితే ఇలా బరువు తగ్గడానికి వర్క్​అవుట్స్ అనేవి ఉదయం చేస్తే మంచిదా? లేదా ఈవెనింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారా?

Continues below advertisement

చాలామంది ఉదయం లేదా సాయంత్రం జిమ్‌కు వెళ్తారు. లేదా ఇంట్లోనే వ్యాయామం చేస్తారు. తమ అవసరాలను బట్టి ఈ టైమింగ్స్ మారుతాయి. అయితే బరువు తగ్గాలనుకుంటే ఏ సమయంలో వ్యాయామం చేస్తే మంచిది? ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? బరువు తగ్గడానికి ఏది బెస్టో చూసేద్దాం. 

రెట్టింపు వేగంతో బరువు తగ్గాలంటే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. దీనివల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం రెట్టింపు వేగంతో జరుగుతుంది.

Continues below advertisement

గుండె ఆరోగ్యానికి కూడా..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేయడం శరీరానికి చాలా మంచిది. ఇది రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే శక్తిని పెంచి.. రోజంతా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఉదయం వ్యాయామం చేయడం వల్ల హృదయ స్పందన రేటు, రక్త ప్రసరణ పెరుగుతాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచుతుంది.

సాయంత్రం జిమ్ చేస్తే..

రోజంతా పనిచేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే సాయంత్రం వ్యాయామం చేసేటప్పుడు కడుపు కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కొవ్వు తగ్గుతుంది. అలాగే శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఈవెనింగ్ వ్యాయామం చేసేటప్పుడు వార్మప్ తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే డే అంతా యాక్టివ్గా ఉంటారు కాబట్టి శరీరం చురుకుగా ఉంటుంది. సో వార్మప్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు.

రెండింటిలో ఏది బెస్ట్..

బరువు తగ్గడానికి ఉదయం, సాయంత్రం.. రెండు పూటలు మంచివే అని చెప్తున్నారు నిపుణులు. అయితే ఉదయం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మీ సమయం, మీ ఓపిక, షెడ్యూల్ బట్టి జిమ్ సెషన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం చేసినా.. సాయంత్రం చేసినా.. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా కచ్చితంగా తగ్గుతారు. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.