Morning Jogging Benefits : మార్నింగ్ జాగింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు పలు బెనిపిట్స్ పొందవచ్చని చెప్తున్నారు నిపుణులు. మెటబాలీజం పెంచి బరువు తగ్గించడంలో హెల్ప్ చేయడంతో పాటు.. మానసికంగా కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. మరి జాగింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గుండె ఆరోగ్యానికై.. 

రెగ్యులర్​గా జాగింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే దీనిని రోజూ చేయాలని చెప్తున్నారు. జాగింగ్ చేయడం వల్ల హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది. దానివల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడి.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

మానసిక ఆరోగ్యం

జాగింగ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి బ్రెయిన్​కి సంబంధించి ఫీల్ గుడ్ కెమికల్స్. ఇవి విడుదల కావడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గి డిప్రెషన్ దూరమవుతుంది. అలాగే పనిపై ఫోకస్ పెరిగి.. మెంటల్ క్లారిటీ ఉంటుంది. 

బరువు తగ్గడానికై.. 

ఉదయాన్నే జాగింగ్ చేయడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు తగ్గుతాయి. మీరు కూర్చొన్నా కూడా కేలరీలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడం సులభం అవుతుంది. ఫ్యాట్ కరిగిపోతుంది. 

నిద్ర 

ఉదయాన్నే రెగ్యులర్​గా వ్యాయామం చేయడం లేదా జాగింగ్ చేయడం వల్ల రాత్రి నిద్ర మెరుగవుతుంది. శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వగలుగుతారు. నిద్ర నాణ్యత కూడా మీ పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

కండర బలం

జాగింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. ఫ్లెక్సీబులిటీ పెరుగుతుంది. బోన్ డెన్సిటీ కూడా మెరుగవుతుంది. అలాగే కండరాలకు, బోన్స్​కి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. 

ఊపిరితిత్తులకై.. 

జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. లంగ్స్​ని స్ట్రాంగ్​గా చేసి.. హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. 

తీసుకోవాల్సి జాగ్రత్తలు

జాగింగ్ చేసేప్పుడు ఎలాంటి గాయాలు కాకుండా ఉండాలంటే.. ముందుగా వార్మ్​అప్ చేయాలి. స్ట్రెచ్​లు చేసినప్పుడు కండరాలు పట్టేయకుండా జాగింగ్ చేసేప్పుడు కాస్త ఫ్రీ అవుతుంది. అంతేకాకుండా జాగింగ్ చేసేముందు కాస్త నీరు తాగితే మంచిది. హైడ్రేషన్ చాలా ముఖ్యం. రన్నింగ్ షూలు కూడా మంచివి ఎంచుకోవాలి. అలాగే పార్క్ వంటి ప్రదేశాల్లో చేస్తే మంచిది. తక్కువ దూరం గోల్స్ పెట్టుకుని.. క్రమంగా వాటిని పెంచుకుంటూ జాగింగ్ చేస్తే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.