కోవిడ్ నుంచి ఇంకా తేరుకున్నామో లేదో మరో మహమ్మారి వచ్చి పడిపోయింది. అది మరీ భయంకరమైన లక్షణాలను కలిగి ఉంది. కేరళతో పాటూ, దిల్లీలో కూడా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో కూడా ఓ యువకుడికి మంకీపాక్స్ సోకిందనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అందరూ ఆ వైరస్ ను తట్టుకునే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. అందుకు తగ్గ ఆహారాన్ని తినడం చాలా అవసరం. మంకీపాక్స్ సోకితేనే వీటిని తినాలని లేదు, సోకకపోయినా  ముందు జాగ్రత్త చర్యగా వీటిని తినడం చాలా మంచిది. 


పుదీనా
పుదీనా ఆకులను వంటల్లో భాగం చేసుకోండి. దీనిలో మెంథాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు, జీర్ణ వ్యవస్థకు సహాయపడే సమ్మేళనాలలో ఒకటి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సైనస్, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. పుదీనా ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 


తులసి ఆకులు
ప్రతి తెలుగింట్లో తులసి ఆకులు ఉంటాయి. తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం. రోజూ ఒక స్పూను తులసి రసాన్ని తాగితే చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచి తలనొప్పి వంటివి తగ్గిస్తాయి. జలుబు, ఫ్లూ చికిత్సలో కూడా తులసిఆకుల రసం ఉపయోగపడుతుంది. 


బిర్యానీ ఆకులు
బిర్యానీ వండినప్పుడో, చికెన్ వండినప్పుడో రెండు ఆకులు పడేసి వండేస్తాం. వాటికి విలువ ఇవ్వం. నిజానికి ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. యుజినాల్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది. దగ్గు, ఫ్లూ, ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అతిసారం, గ్యాస్, వికారం వంటి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. బిర్యానీ ఆకులను ప్రతి వంటలో భాగం చేసుకోండి. లేదా పొడి చేసి కూరల్లో కలుపుకుని తినండి. 


ప్రొటీన్ ఫుడ్
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సోయా, చీజ్, మొలకలు, పెరుగు వంటివాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మంకీపాక్స్ తో బాధపడుతున్న వారికి ప్రొటీన్ రిచ్ ఫుడ్ అధికంగా తినిపించాలి. 


గుడ్లు
రోజుకో గుడ్డు తింటే శరీరానికి ఎంతో బలం. గుడ్లలో సెలీనియం ఉంటుంది. ఇది ఆక్సీకరణ నష్టం, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే పోషకం. కాబట్టి వైరస్, బ్యాక్టిరియాలను తట్టుకోవాలంటే గుడ్లను రోజూ తినాలి. 


బొప్పాయి
బొప్పాయిల విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే నిమ్మ, ఉసిరి, నారింజ, చెర్రీ పండ్లలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వైరల్, బ్యాక్టిరియాలను తట్టుకునే శక్తిని అందిస్తాయి. 


Also read: చికెన్ మసాలా ఫ్రై, చూస్తేనే నోరూరిపోతుంది



Also read: ఇలా స్నానం చేయడం వల్ల అకస్మాత్తుగా గుండె పోటు వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి


Also read: ఈ పాపని చూస్తుంటే ఐన్‌స్టీన్ మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందా? నిజానికి ఈ పాపదో అరుదైన వ్యాధి







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.