Miss World Crown Winners from India : హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది నందిని గుప్తా. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో యాక్టివ్​గా పాల్గొంటూ భారత్​ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 72వ మిస్​ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరిగా ఈ భామ టైటిల్ గెలుచుకుంటుందని కొందరు ఆశిస్తున్నారు.  

నందిని గుప్తా ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిస్తే.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని.. టైటిల్ గెలిచిన 7వ భామగా నిలుస్తుంది. అవును ఇప్పటివరకు జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆరుగురు ఈ టైటిల్​ను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ప్రపంచ సుందరిగా గెలిచిన అందగత్తెలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

ప్రపంచ సుందరి టైటిల్ గెలిచిన ఇండియన్ బ్యూటీలు.. 

ప్రపంచ సుందరిగా ఇప్పటివరకు గెలిచిన ఆరుగురు (Miss World Crown Winners from India) అందగత్తెల్లో రీటా ఫరియా మొదటి వ్యక్తి. 

రీటా ఫరియా

మిస్ వరల్డ్ పోటీల్లో 1966లో ఇండియా మొదటిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ కాంపిటేషన్​లో భారత్​ను రిప్రెజెంట్ చేస్తూ రీటా ఫరియా ప్రపంచ సుందరిగా నిలిచింది. మెడికల్ స్టూడెంట్ అయిన రీటా మోడలింగ్​ వైపు కెరీర్​ను మలచుకుంది. ఇండియాకు మొట్ట మొదటి మిస్ వరల్డ్ టైటిల్​ను అందించింది.

ఐశ్వర్య రాయ్

ప్రపంచ సుందరి అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు ఐశ్వర్య. ఈ భామ 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాను రిప్రెజెంట్ చేస్తూ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ ఫ్యాషన్ ప్రపంచం ఆమెకు హీరోయిన్​గా మంచి కెరీర్​ను అందించింది. తమిళ, హిందీ సినిమాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఐశ్వర్య క్రేజ్​ అభిమానుల్లో ఏ మాత్రం తగ్గలేదు. 

డయానా హెడెన్

డయానా హెడెన్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ సుందరి టైటిల్​ను గెలుచుకుంది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న 3వ కంటెస్టెంట్ డయానా. హైదరాబాద్​కు చెందిన ఈ భామ లండన్​లో డిగ్రీ చేసి.. మోడలింగ్ వైపు కెరీర్​ను మార్చుకుంది. 

యాక్తా ముఖి

ముంబైకు చెందిన యుక్తా ముఖి మిస్ వరల్డ్​గా టైటిల్​ను గెలుచుకున్న నాల్గొవ భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొని భారత్​ను రిప్రెజెంట్ చేస్తూ టైటిల్ గెలుచుకుంది. 

ప్రియాంక చోప్రా

మిస్ వరల్డ్ టైటిల్​ను హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా దక్కించుకుంది. ఈ భామ 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ప్రపంచ సుందరిగా మారిన తర్వాత బాలీవుడ్​లో అవకాశాలు వచ్చాయి. అనంతరం ఆమె హాలీవుడ్​లో కూడా కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకెళ్లింది.  

మానుషి చిల్లర్

దాదాపు 17 సంవత్సరాల తర్వాత 2017లో మానుషి చిల్లర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ భామ మోడలింగ్​లో కెరీర్​ను ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుంది ఈ భామ.

మానుషి చిల్లర్ తర్వాత ఇప్పటివరకు భారత్​కు చెందిన ఏ అమ్మాయి మిస్ వరల్డ్​ కాలేకపోయారు. మిస్ వరల్డ్ 2024 పోటీల్లో ఇండియాను రిప్రజెంట్ చేసిన సినీ శెట్టి.. అతి కొద్ది స్థానాల్లో విజయానికి దూరమైంది. ఇప్పుడు ప్రపంచ సుందరి 2025 పోటీల్లో నందిని గుప్తా వైపే అందరి చూపు ఉంది. ఆమె గెలవాలి ప్రతి భారతీయులు కోరుకుంటున్నారు.