రోనా వైరస్ వల్ల ఇల్లే సమస్తం అయ్యింది. బడి, ఆఫీసు, రెస్టారెంటు, సినిమా హాళ్లు అన్నీ ఇల్లే. జనం ఇంటికి బాగా అలవాటై పోయారు. సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఇంటి నుంచి బయటకు కదలడం లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. దీంతో అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. అందుకే, ‘‘ఇప్పుడు అన్నీ చక్కబడ్డాయి. ఇక ఆఫీసులకు బయల్దేరండి’’ అంటే ఎవరికీ నచ్చటం లేదట. ఆఫీసుకు వెళ్లే పరిస్థితే వస్తే ఉద్యోగాలు వదిలెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. తాజా స్టడీలో ఈ షాకింగ్ విషయాలు తెలిశాయి. ముఖ్యంగా 80 మధ్య నుంచి 90 దశకంలో పుట్టిన ‘మిలీనియల్స్’ జనరేషన్.. ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారట.


‘ఎంప్లాయిమెంట్ హీరో’ అనే ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తేటతెల్లం అయ్యాయని అంటున్నారు. ఈ సర్వే నిర్వాహకులు ఇక ఆఫీస్ వర్క్ అనే మాట పాతకాలం నాటిదని అనుకోవాలి అంటున్నారు. పద్దెనిమిది నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్కులు ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్ చాలా సౌకర్యంగా ఉందనే అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. వీరందరూ ఇది వరకు కూడా కనీసం వారంలో ఒకరోజు వర్క్ ఫ్రం హోమ్ చేసిన వారే కావడం గమనార్హం.


ఎందుకు వర్క్ ఫ్రం హోమ్ ఎంచుచుకుంటున్నారు? అనే ప్రశ్నకు ప్రొడక్టివిటి పెరిగిందని 22 శాతం మంది చెబితే, వర్క్ క్వాలిటీ పెరిగిందని మరో 20 శాతం మంది చెప్పారు. ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరుకుతోంది. ప్రయాణ బడలిక కూడా ఉండడం లేదు అని పేరు చెప్పడం ఇష్టం లేని ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. 


‘‘ఈ మధ్యే నేను తండ్రినయ్యాను. పిల్లాడిని పెంచేందుకు మా ఆవిడకు సహాయం చేసే అవకాశం దొరుకుతోంది. నా పనంతా కూడా లాప్ టాప్, ఫోన్, పనంతా ఇంటర్నెట్ కనెక్షన్ తో అయిపోతున్నప్పుడు నేను ఆపీసులో ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి?’’ అనేది మరో యువ ఉద్యోగి వాదన. నచ్చిన పని పూర్తి చేసుకునే అవకాశం ఉండడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటోందని అతడు తెలిపాడు.


ఇదంతా గమనించిన సంస్థలు కూడా తమ ఉద్యోగుల పనితీరు, ఆరోగ్యం అన్నీ మెరుగవుతున్నపుడు ఎందుకు ఇదే కొనసాగించకూడదు అని ఆలోచిస్తున్నాయి. సంస్థల నిర్వాహకుల్లో 30 శాతం మంది ఉద్యోగులు సంతోషం కోసం వర్క్ ఫ్రం హోమ్ కొనసాగిస్తున్నామని తెలిపారు. 23 శాతం సంస్థలు.. ఉద్యోగులు అభ్యర్థన చెప్పడం వల్లే కొనసాగిస్తున్నామని అంటున్నారు. 22 శాతం సంస్థల నిర్వాహకులు ప్రొడక్టివిటి పెంచేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్టు చెబుతున్నారు.


అయితే ఈ రిమోట్ వర్కింగ్ అందరికి నచ్చకపోవచ్చు. కొంత మంది ఆఫీసుల్లో ఉండే సోషల్ ఇంటారాక్షన్ ను మిస్ అవుతున్నామని, ఇంటి నుంచి పనిచెయ్యడం ఒంటరిగా అనిపిస్తోందని, కొలిగ్స్ తో కమ్యూనికేట్ చెయ్యడంలో ఇబ్బందులు ఉంటున్నాయని, అందువల్ల టాస్క్ కంప్లీట్ చెయ్యడంలో టైం వేస్ట్ అవుతోందని, రోజు వారీ కబుర్లు, సరదా మీటింగ్ చాట్ లు వంటివి కొంత రిక్రియేషన్ ఇస్తాయని ఇవి కూడా అవసరమే అని కూడా అంటున్నారు కొందరు. 25 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు వారు ఇంటి నుంచి పనిచెయ్యటానికి ఆసక్తి చూపిస్తున్నారని మెల్బోర్న్ యూనివర్సిటి అధ్యయనాలు చెబుతున్నాయి. 


ఈ సర్వే ఫ్రొఫెసర్ గివేలిమ్ ఆధ్యర్యంలో జరిగింది. మొత్తానికి పాండమిక్ ఉద్యోగులు, సంస్థల ఆలోచనా విధానాన్ని మార్చేశాయి. ఇంటి నుంచి పని చేయడం సర్వసాధరణ విషయం అయిపోయింది. ఇది ఆఫీసుల నిర్వహణ, సౌకర్యాల కల్పన వంటి అనేకానేక అంశాల మీద భారీ ప్రభావాన్ని చూపుతోందని లిమ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆఫీసుల నిర్వహణ మీద ఖర్చు తగ్గి పనితీరు మెరుగు పడితే అంతకు మించి కావల్సిందేముందనేది ఉద్యోగాలు ఇచ్చేవారి అభిప్రాయం. మరి, దీనిపై మీరు ఏమంటారు. 


Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!


Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే