సాధారణంగా అంత్యక్రియల్లో శవ పేటికలను వాడతారు. కొందరు వస్త్రాల్లో చుట్టబెట్టి ఖననం చేస్తారు. అయితే, ఆ కుటుంబికులు మాత్రం వారి ఆత్మీయుడి భౌతిక కాయాన్ని ట్రక్కుతో సహా పూడ్చిపెట్టేశారు. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే, మీరు మెక్సికోలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. 


చనిపోతూ ఎవరూ ఆస్తులను తమ వెంట తీసుకుపోలేరని అంటారు. అయితే, మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్‌‌కు చెందిన డాన్ అడాన్ అరానా మాత్రం తనతోపాటు తన ట్రక్కును కూడా తీసుకెళ్లాడు. అరానా‌కు కొన్నాళ్ల కిందట.. కొడుకు ఓ ట్రక్కును కానుకగా ఇచ్చాడు. అయితే అనారోగ్య కారణాలతో అరానా ఆ ట్రక్కును ఒక్కసారి కూడా నడపలేకపోయాడు. దీంతో తాను చనిపోయిన తర్వాత ఆ ట్రక్కును కూడా తనతో పూడ్చిపెట్టాలని కోరాడు. ఈ వింత కోరిక విని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇదేం కోరిక.. అంత ఖరీదైన ట్రక్కుతో సహా సమాధి చేయాలా అని అడిగారు. ఇందుకు అతడు స్పందిస్తూ.. మరణానంతర జీవితంలో దాన్ని నడుపుతానని తెలిపాడు. 


మెక్సికోలో ఆఖరి క్షణాలను గడిపే వ్యక్తుల కోరికలను గౌరవిస్తారు. దీంతో అరానా కోరికను కుటుంబ సభ్యులు కాదనలేకపోయారు. అతడి మరణం తర్వాత శ్మశానంలో భారీ గొయ్యితీసి ట్రక్కుతో సహా శవపేటికను పూడ్చిపెట్టారు. అయితే, కారుతోపాటు శవాన్ని పూడ్చిపెట్టేందుకు కుటుంబికులు అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల దక్షిణాఫ్రికా రాజకీయవేత్త తిశేకేదే బఫ్టన్ పిట్సో‌ను కూడా ఈ విధంగానే పూడ్చిపెట్టారు. అతడికి ఎంతో ఇష్టమైన మెర్సిడెస్ లిమోసిన్‌ (Mercedes Limousine)లో కూర్చోబెట్టి అంత్యక్రియలు జరిపారు. అతడి శవాన్ని కారు ముందు సీటులో కూర్చోబెట్టి మరీ పూడ్చిపెట్టారు. క్రేన్‌తో పనిలేకుండా ఎనిమిది అడుగుల లోతైన గొయ్యి తవ్వారు. అనంతరం ఉపరితలం మీద నుంచి ఏటవాలుగా గోతిలోకి మార్గం చేసి కారును సమాధిలోకి తోసి పాతిపెట్టారు. 


Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..



Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి