Health Benefits with Childs Pose : మానసిక, శారీరక ప్రయోజనాల కోసం చాలామంది యోగాను చేస్తారు. కొందరు మాత్రం యోగా చేసేందుకు తమ శరీరం సహకరించదని ఫీల్ అవుతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరేనా? అయితే మీరు కచ్చితంగా బాలాసనం ట్రై చేయండి. దీనిని ఎవరైనా చాలా సింపుల్​గా చేయవచ్చు. మీకు యోగా చేయడం అలవాటు లేకపోయినా సరే మీరు దీనిని చేయవచ్చు. ఇది చేసేందుకు, చూసేందుకు సింపుల్​గా ఉన్నా.. శరీరానికి, ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడంలో మాత్రం అల్టిమేట్​గా పనిచేస్తుంది. 


ఈ బాలాసనంనే చైల్డ్ పోజ్ అంటారు. అంటే చిన్న పిల్లలు ఏవిధంగా అయితే బోర్లాపడుకుని ఉంటారో.. దానిని పోలి ఉండే పోజ్​ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇది మీకు విశ్రాంతినిస్తుంది. వివిధ కండరాలను సున్నితంగా.. మంచి రీతిలో ప్రభావితం చేస్తుంది. కేవలం కండరాలను బలోపేతం చేయడమే కాదు.. శరీరానికి విశ్రాంతినివ్వడంలో బాగా హెల్ప్ చేస్తుంది. వెనుక భాగంలోని పెద్ద కండరాలను విస్తరించేలా చేసి.. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్నెముకను సున్నితంగా సాగదీస్తుంది. మీరు వెన్నెముక సమస్యలతో ఇబ్బందు పడుతుంటే కచ్చితంగా దీనిని ట్రై చేయవచ్చు. ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం కండరాలకే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. 


ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.. ఒత్తిడి తగ్గుతుంది


ఈ ఆసనం ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఎందుకంటే ఈ ఆసనం కోసం మీరు శరీరాన్ని సున్నితంగా స్ట్రెచ్ చేస్తారు. మీరు ముందుకు బెండ్ అయినప్పుడు మీ వెన్నెముక, తొడలు, తుంటి, చీలమండలు స్ట్రెస్​ నుంచి రిలీఫ్ అవుతాయి. ఒత్తిడి నుంచి విడుదలైన కండరాలు ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. రెగ్యూలర్​గా చేస్తే ఫలితాలు మీరే చూస్తారు. ఇది ఆందోళన, అలసట లక్షణాలు తగ్గిస్తుంది. 


మెరుగైన రక్తప్రసరణకై.. 


బాలాసన మీలో రక్త ప్రసరణను పెంచుతుంది. ముఖ్యంగా తలలో మెరుగైన ప్రసరణ మొత్తం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది. మాసికంగా ప్రశాంతంగా ఉంటారు. మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. 


జీర్ణసమస్యలు దూరం..


చైల్డ్ పోజ్ జీర్ణక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ భంగిమలో ఉన్నప్పుడు కడుపు తేలికపాటి కుదింపు పొంది జీర్ణ అవయవాలను ప్రేరేపిస్తుంది. మరింత సమర్థవంతమైన జీర్ణక్రియను అందిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 


ఊపిరితిత్తులకు మంచిది..


మెరుగైన ఊపిరితిత్తుల పనితీరు కోసం, ఛాతీ నొప్పి నివారణ కోసం మీరు ఈ ఆసనం వేయొచ్చు. ఈ భంగిమలో మీరు తీసుకునే డీప్​ బ్రీత్​లు ఊపిరితిత్తులపై మంచి ఫలితాలు ఇచ్చి పనితీరును మెరుగుపరుస్తాయి. శ్వాసకోస సమస్యలున్నవారు దీనిని కచ్చితంగా ట్రై చేయవచ్చు. 


గుండె ఆరోగ్యానికై.. 


ఈ ఆసనం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా హృదయ స్పందన రేటును తగ్గించడంలో, రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మొత్తం హృదయనాళ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. 


మధుమేహం కంట్రోల్​


ఒత్తిడిని తగ్గించడంలో బాలాసనం హెల్ప్ చేస్తుందని అందరికీ తెలుసు. ఇది మధుమేహంలో కీలకమైన అంశం. ఎందుకంటే ఒత్తిడి తగ్గితే రక్తంలోని గ్లూకోజ్​ స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి. ఇది శరీరంలో చక్కెర కంట్రోల్​ చేసి.. మధుమేహమున్నవారికి హెల్ప్ చేస్తుంది. 


ఈ సింపుల్ ఆసనాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. కేవలం శారీరక శ్రేయస్సుకోసమే కాకుండా మానసిక ప్రయోజనాల కోసం దీనిని చేయవచ్చు. దీనిని వేసేందుకు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి.. ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రపోయే ముందు ఓ రెండు నిముషాలు దీనిని ట్రై చేయండి. ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. 


Also Read : పొరపాటున ఆ టాబ్లెట్స్​ను వయాగ్రాతో కలిపి తీసుకుంటే కన్ఫార్మ్ చావేనట