Men's Shaving Tips : ఉదయం ఆఫీసుకు వెళ్లే హడావుడిలో చాలామంది షేవింగ్‌ను త్వరగా ముగించేయాల్సిన పనిగా భావిస్తుంటారు. కానీ సరైన విధంగా షేవ్ చేసుకోకపోతే చర్మం ఎర్రబడటం, మంట, దురద, చిన్న చిన్న గడ్డలు రావడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి దీనికోసం కాస్త సమయాన్ని కేటాయించాలని అంటున్నారు నిపుణలు. కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్ తర్వాత కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు. 

Continues below advertisement

షేవింగ్‌కు ముందు ఫేస్ క్లీనింగ్

నేరుగా రేజర్ తీసుకుని షేవింగ్ మొదలుపెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. కాబట్టి ముందుగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలని.. దీనివల్ల చర్మంపై ఉన్న మురికి, అదనపు నూనె తొలగిపోయి.. గడ్డంపై వెంట్రుకలు కొంత మెత్తబడతాయని.. దీనివల్ల షేవింగ్ సులభంగా మారుతుందని చెప్తున్నారు.

Also Read :  మగవారు తరచూ నిర్లక్ష్యం చేసే 10 లక్షణాలు ఇవే.. ఆలస్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు

Continues below advertisement

షేవింగ్ క్రీమ్ 

అందరికీ ఒకే రకం షేవింగ్ క్రీమ్ సరిపోదు. కాబట్టి మీ చర్మానికి తగ్గట్లు షేవింగ్ క్రీమ్ ఎంచుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు సున్నితమైన ఫార్ములా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. షేవింగ్ క్రీమ్ లేదా జెల్ రేజర్‌కు, చర్మానికి మధ్య రక్షణ పొరలా పనిచేసి రాపిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

షేవింగ్ బ్రష్ 

షేవింగ్ బ్రష్‌తో క్రీమ్‌ను ముఖానికి సమానంగా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా గడ్డం వెంట్రుకలు దట్టంగా ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బ్రష్ అందరూ వాడాల్సిన అవసరం కూడా లేదు. చేతులతో కూడా షేవింగ్ క్రీమ్‌ను బాగా అప్లై చేసుకోవచ్చు.

Also Read : మగవారు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన 5 హైజీన్ టిప్స్.. ఫాలో అయితే మంచిది

వెంట్రుకలు పెరిగే దిశ

షేవింగ్ సమయంలో చాలామంది చేసే పొరపాటు వెంట్రుకలకు వ్యతిరేక దిశలో రేజర్‌ను ఉపయోగిస్తారు. ఇలా చేస్తే చాలా క్లోజ్ షేవ్ వచ్చినట్లు అనిపించినా కొందరిలో రేజర్ బర్న్ లేదా ఇన్‌గ్రోన్ హెయిర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది షేవింగ్ తర్వాత చిన్న గడ్డలు రావడానికి కారణం అవుతుంది. అందుకే వెంట్రుకలు పెరిగే దిశలో షేవ్ చేయడం మంచిది.

సేఫ్టీ రేజర్‌

సాధారణంగా మల్టీ-బ్లేడ్ రేజర్లతో పోలిస్తే కొందరికి సేఫ్టీ రేజర్ బాగా సూట్ కావచ్చు. ఇది కాస్త ప్రాక్టీస్ అవసరమైన పద్ధతి. సరైన టెక్నిక్ తెలియకుండా ఉపయోగిస్తే కోసుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తొందరపడకుండా నిధానంగా ఉపయోగించాలి.

Also Read : మగవారు ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ టిప్స్.. ముడతలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎలక్ట్రిక్ షేవర్

బయటకు వెళ్లడానికి ఎక్కువ సమయం లేనప్పుడు ఎలక్ట్రిక్ షేవర్ ఉపయోగకరంగా ఉంటుంది. రేజర్‌తో చేసే షేవింగ్‌లా చాలా క్లోజ్ షేవ్ రాకపోయినా.. త్వరగా నీట్ లుక్ పొందేందుకు ఇది మంచి ఆప్షన్.

షేవింగ్ తర్వాత 

షేవింగ్ పూర్తయిందంటే పని అయిపోయినట్లు ఫీల్ అవ్వకుండా.. ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత సున్నితమైన మాయిశ్చరైజర్ లేదా ఆఫ్టర్‌షేవ్ బామ్ ఉపయోగించవచ్చు. ఇది చర్మం పొడిబారకుండా, అసౌకర్యం తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. బయట ఎక్కువసేపు ఉండేవారు సన్ ప్రొటెక్షన్ ఉపయోగించడం కూడా మంచిదే.

Also Read : మగవారు 30ల్లో ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ ఇవే.. హెల్తీ లైఫ్​ కోసం ఈ మార్పులు చేయాలట