Summer Skin Care for Men : మగవారు స్కిన్ విషయంలో పెద్ద జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల స్కిన్ డార్క్ అవ్వడం, త్వరగా ముడతలు రావడం జరుగుతాయి. అందుకే ఆడవారే కాదు.. మగవారు కూడా ఓ స్కిన్​ కేర్​ రొటీన్​ని సెట్​ చేసుకుంటే మీ స్కిన్ హెల్తీగా ఉండడంతో పాటు.. మంచి గ్లోని ఇస్తుంది. త్వరగా ముడతలు రాకుండా, యవ్వనంగా కనిపించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే మంచి లుక్​ కోసం ఎలాంటి స్కిన్​ కేర్ తీసుకోవాలి? రోజు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? వారానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెలకోసారి ఏమి చేస్తే స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో చూసేద్దాం. 

రోజుకోసారి.. 

క్లెన్సింగ్ అనేది స్కిన్​ కేర్​లో అత్యంత ముఖ్యమైన పార్ట్​ ఇది. కచ్చితంగా రోజుకు రెండుసార్లు సాఫ్ట్ ఫేస్ వాష్​తో లేదా క్లెన్సర్​తో  ఉదయం, సాయంత్రం రెండుసార్లు ముఖాన్ని కడగాలి. ముఖాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకునేందుకు ముఖానికి కచ్చితంగా మాయిశ్చరైజర్​ని అప్లై చేయాలి. తేలికపాటి మాయిశ్చరైజర్​ని ఎంచుకుంటే మంచిది. 

బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. SPF 30 ఉండేవి ఎంచుకుంటే మంచిది. ఇది స్కిన్​కి సన్​ నుంచి ప్రొటెక్షన్​ ఇస్తుంది. స్కిన్ డ్యామేజ్​ కాకుండా కాపాడుతుంది. లిప్​ బామ్​ని కూడా ఉపయోగించాలి. చాలామంది దీనిని ఉపయోగించరు. కానీ మగవారు కూడా లిప్​బామ్​ని ఉపయోగిస్తే పొడిబారకుండా, మాయిశ్చరైజ్​గా పెదాలు ఉంటాయి. గెడ్డాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. బియర్డ్ ఆయిల్, బ్లామ్ వాడితే లుక్​ బాగుంటాది. 

వారానికోసారి.. 

వారానికోసారి స్కిన్​ని స్క్రబ్​ చేయాలి. ఇది చర్మంపై మృత కణాలు తొలిగిస్తుంది. అలాగే స్కిన్​కి జెంటల్​గా​ స్క్రబ్ చేయండి. అలాగే వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఫేస్ మాస్క్ వాడితే మంచిది. ఇవి చర్మాన్ని డీప్ క్లెన్సింగ్ చేసి.. పోషణను అందిస్తాయి. షేవింగ్ చేసిన తర్వాత స్కిన్ ఇరిటేషన్​ను తగ్గించుకునేందుకు మాయిశ్చరైజర్​ అప్లై చేయాలి. మీది ఆయిల్ స్కిన్​ అయితే ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, క్లే మాస్క్ ఉపయోగిస్తే మంచిది. 

నెలకోసారి.. 

నెలకోసారి డీప్ క్లెన్సింగ్ చేయాలి. లైట్ ఫేషియల్ లేదా మాయిశ్చరైజింగ్ ట్రీట్​మెంట్ తీసుకోవాలి. గడ్డాన్ని పెంచుకునే అలవాటు ఉంటే దాని లుక్​ మెరుగుపరిచేలా ట్రిమ్ చేసుకోవాలి. స్కిన్ పొడిబారిపోయి, డార్క్ స్పాట్స్​తో ఉంటే స్కిన్​ కేర్ ప్రొడక్ట్స్ మార్చుకోవాలి. నిపుణుల సహాయం తీసుకుంటే స్కిన్​ సమస్యలు రాకుండా ఉంటాయి. పైగా వారు మీ చర్మానికి సరిపడే ప్రొడెక్ట్స్​ని సజెస్ట్ చేస్తారు.   

అలాగే హైడ్రేషన్ అనేది చర్మ సంరక్షణలో మేజర్ రోల్ పోషిస్తుంది. కాబట్టి హైడ్రేటెడ్​గా ఉండేందుకు నీటిని తీసుకుంటూ ఉండండి. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. హెల్తీ ఫుడ్ హెల్తీ స్కిన్​ని అందిస్తుంది. కాబట్టి ఆయిల్​ ఫుడ్​కి, ప్రాసెస్​ చేసిన ఫుడ్​కి వీలైనంత దూరంగా ఉండండి. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తే.. మీ స్కిన్​ ఆటోమెటిక్​గా గ్లో అవుతుందని గుర్తించుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ లుక్​ని ప్రొవైడ్ చేస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.