పాండమిక్ తర్వాత చాలా మంది ఆరోగ్యవంతమైన జీవన విధానంలో ఉండాలనే అనుకుంటున్నారు. పాండమిక్ ఆరోగ్యం ఎంత భాగ్యమో నేర్పించిందనే చెప్పాలి. చాలా మంది జీవిన విధానంలో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి మార్పుల్లో ఈ మధ్య బాగా ప్రాచూర్యం పొందిన డైట్ మెడిటరేనియన్ డైట్. మధ్యధరా సముద్రానికి సమీప దేశాలైన ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశ వాసులు ఈ డైట్ ను అనుసరిస్తారు. ఈ డైట్ లో ఆలీవ్ నూనెను ప్రధానంగా వాడుతారు. మధ్యధరా సముద్ర పరిసర ప్రాంతాల్లో అనుసరించే ఈ డైట్ విధానం కనుక దీన్నీ మెడిటరేనియన్ డైట్ అని అంటారు.
ఏముంటాయి ఇందులో?
మెడిటరేనియన్ డైట్ లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, రకరకాల లెగ్యూమ్స్, పాస్తా, హోల్ గ్రేయిన్ బ్రెడ్ వంటివన్నీ భాగం. వీటిని నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మాంసాహారంలో భాగంగా చేపలు, ఇతర సీ ఫూడ్, చికెన్, గుడ్లు ఉంటాయి. పాలఉత్పత్తులో పరిమితిలో తీసుకోవాల్సి ఉంటుంది. సలాడ్ల రూపంలో తీసుకోగలిగితే మంచిది. వీటి తయారీకి ఆలీవ్ నూనె వాడాలి. రెడ్ మీట్, స్వీట్లు తీసుకోకూడదు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారట.
పోషకాలెంత?
మెడిటరనియన్ డైట్ లో 40 శాతం వరకు కార్బోహైడ్రేట్లు ఉండాలి, ప్రొటీన్ 20 శాతం, కొవ్వు 40 శాతం వరకు ఉండేలా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా ఈ మోతాదులో పోషకాలు అందేట్టుటా డైట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
మెడిటరేనియన్ డైట్ ఫాలో అయ్యే వారు సహజంగానే చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్త అధ్యయనాలు ఈ డైట్ ఫాలో చేస్తున్న వారిలో ఇన్పెర్టిలిటి సమస్యలు కూడా బాగా తగ్గినట్టు చెబుతున్నాయి. తల్లిదండ్రులుగా మారాలనుకునే దంపతులు ఈ డైట్ ఫాలో చేస్తే బరువు తగ్గడం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు ఇన్ఫెర్టిలిటీ సమస్యలను కూడా అదిగమించవచ్చని అధ్యయనకారులు అంటున్నారు.
స్త్రీపరుషులిద్దరిలో కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ, మెన్సుట్రవల్ సైకిల్ వంటి ఫెర్టిలిటీ అంశాల మీద ప్రభావం చూపుతుంది. మెడిటరేనియన్ డైట్ చేసే వారిలో ఇన్ఫ్లమేషన్ చాలా వరకు అదుపులో ఉంటుంది. ఫలితంగా ఫెర్టిలిటీ కి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడుతాయి.
మెడిటరేనియన్ డైట్ ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ గా ఉంటుంది. అంతేకాదు ఇందులో తృణధాన్యాలు కూడా భాగం. పెరుగు, చీజ్ వంటి పౌష్టికమైన పదార్థఆలు కూడా ఉంటాయి. మోనాష్ యూనివర్సిటి కి చెందిన అధ్యయనకారులు చెప్పేదాన్ని బట్టి తల్లిదండ్రులు కావాలనుకునే జంటకు ఈ రకమైన డైట్ వరప్రదాయిని అని అర్థం అవుతోంది. దీన్ని గురించి నిర్ధారణలు జరగాలంటే మరింత పరిశోధన జరగాల్సి ఉన్నప్పటికీ మెడిటరేనియన్ డైట్ వల్ల ఆరోగ్యం మెరుగు పడడం, బరువు తగ్గడంతోపాటు సంతానసాఫల్య సమస్యలు కూడా అధిగమించేందుకు అవకాశం ఉన్నట్టు మాత్రం చెబుతున్నారు. నష్టం లేనపుడు ఇది పాటించడంలో తప్పేముంది.