Advantages of Marrying an Older Woman : Gen Zలు ఏ రిలేషన్​షిప్ గోల్స్ సెట్ చేసినా అదో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తోన్న ఓ విషయం ఏమిటంటే.. వయసులో పెద్ద అయిన అమ్మాయిలకు అబ్బాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మరికొందరు ఏజ్​ని కనీసం లెక్క చేయకుండా పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఈ ట్రెండీ లవ్​లో వారు ఎక్కువగా చెప్పేది ఏంటంటే.. Age is Just a Number, All That Matters is Love అంటూ ట్రాక్ నడిపిస్తున్నారు. అసలు వయసులో అబ్బాయికంటే పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా?


వారి ఆలోచన ఇదే


సాధారణంగా జరిగే పెళ్లిల్లో అబ్బాయి వయసు ఎక్కువ.. అమ్మాయి వయసు తక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తారంటే.. అమ్మాయిలకు తక్కువ వయసులోనే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కాబట్టి వయసు తేడా ఉంటే వారిద్దరీ అభిప్రాయాలు ఒకటిగా ఉంటాయని పెద్దలు ఫీల్ అయి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ కథ మారింది. అమ్మాయి వయసులో పెద్ద అయితే ఏంటి.. తను నా కన్నా మెచ్యూర్డ్​గా ఉంటుందనే ధోరణి అబ్బాయిల్లోకి వచ్చేసింది. దీనివల్ల అడ్వాంటేజ్​లున్నాయా? అసలు ఈ తరం యువత దీని గురించి ఎలా ఆలోచిస్తుంది. 


ఇలా మొదలవుతుంది..


ఏమాయ చేశావే మూవీలో "నీ వయసెంత 22, నా వయసు 24.. మా నాన్న అడిగితే తమ్ముడులాంటివడివని చెప్పేస్తా" అంటూ హీరోయిన్ చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి వయసులో పెద్ద అయితే.. "ఓహ్ నేను నీకోసం పుట్టాను అనుకున్నాను.. కానీ నువ్వే నా కోసం ముందు పుట్టేశావా" అంటూ అబ్బాయిలు స్టార్ట్ చేస్తున్నారు. ఇలా కమ్యూనికేషన్​ని పెంచుకుని.. దానిని లవ్​ వరకు.. లవ్ నుంచి పెళ్లివరకు తీసుకువెళ్తున్నారు. 


రోజులు మారాయి..


పైగా అబ్బాయిలు ఇన్నోసెంట్​గా ఉంటే అమ్మాయిలు ఇష్టపడడం.. అలాగే అమ్మాయిలు మెచ్యూర్డ్​గా ఉంటే అబ్బాయిలకు నచ్చడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇవి రివర్స్​లో ఉండేవి. అబ్బాయి మెచ్యూర్డ్​గా ఉండాలి.. అమ్మాయి చైల్డిష్​గా ఉండాలనుకునేవారు. కానీ ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యాయి. ఇంతకీ వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలిగే లాభాలేంటి? 


బెనిఫిట్స్ ఇవే..


వయసులో పెద్ద అమ్మాయిని చేసుకుంటే మెచ్యూర్డ్​గా ఉంటుంది. అలాగే రిలేషన్​షిప్​లో అండర్​స్టాండింగ్స్ బాగుంటాయి. అలాగే తన కెరీర్​ విషయంలో ఆమెకు ఓ క్లారిటీ ఉంటుంది. అలాగే తనకు కావాల్సిన విషయాలపై కూడా తనకి అవగాహన బాగుంటుంది. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం తక్కువ. ఆర్థికంగా కూడా మీకు సపోర్టివ్​గా ఉంటారు. లేదా ఇండిపెండెట్​గా అయినా ఉంటారు. దీనివల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఊహల్లో తేలిపోయే కోరికలు కాకుండా రియాలాస్టిక్​గా ఉంటుంది. అన్నిరకాలు అర్థం చేసుకునే అమ్మాయి మీ లైఫ్​లోకి రావొచ్చు. 


Also Read : రిలేషన్ షిప్​లో 2-2-2 రూల్.. హ హ ఈ రూల్ ఫాలో అయితే బ్రేకప్స్ జరగవేమో


అందరూ ఒకేలా ఉండరు బ్రో


ఇది అందరికీ వర్తిస్తుందనే రూల్ లేదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. అలాగే కొందరి ఇళ్లల్లో ఈ వయసు ఎఫెక్ట్​ ఉంటుంది. అలాగే అబ్బాయిలు కూడా కొన్ని సందర్భాల్లో మీరు తమని ఓవర్​ కేర్ చూపిస్తున్నట్లు భావించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి రిలేషన్ షిప్స్ వర్క్​అవుట్​ అవ్వడానికి ఎన్నో ఫ్యాక్టర్స్​ అనుకూలించాలి. మీ పరిస్థితులు, మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం బట్టి.. వయసు పెద్ద అయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కమ్యూనికేషన్స్, కంపాటబిలిటీ, రెస్పెక్ట్​ కూడా ఈ రిలేషన్స్​లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. 



Also Read : విడిపోవడానికి బదులు విరామం తీసుకోండి.. కానీ కండీషన్స్ అప్లై