Marriage Certificate Importance : పెళ్లి చేసుకున్నవారందరూ.. తమ వివాహాన్ని నమోదు చేసుకునేవాలని చెప్తూ.. మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవాలని చెప్తోంది సుప్రీంకోర్టు. ఈ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ ద్వారా​ మీ వివాహాం చట్టబద్ధం అవ్వడమే కాకుండా.. కీలకమైన పత్రాల దరఖాస్తు సమయంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు జంటను అర్హులను చేస్తుంది. అందుకే పెళ్లి చేసుకున్నవారు కచ్చితంగా తమ మ్యారేజ్ సర్టిఫికేట్​ కోసం కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక కార్యాలయానికి వెళ్తే.. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ ద్వారా మీ మ్యారేజ్​ను రిజిస్టర్ చేసి.. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. 


సుప్రీం కోర్టు తీర్పు మేరకు..


వివాహ ధృవీకరణ పత్రం అనేది.. జంట వివాహం అయిన తర్వాత.. వారికి జారీ చేసే చట్టపరమైన మొదటి సర్టిఫికెట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ వారి వైవాహిక బంధానికి అధికారిక రుజువుగా పనిచేస్తుంది. వివాహ నమోదు అనే చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత జంట ఈ పెళ్లి లైసెన్స్​ను అందుకుంటారు. ఇదే వారి పెళ్లిని సూచించే అధికారిక పత్రం అవుతుంది. 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అందరూ ఈ మ్యారేజ్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని రెండు పద్ధతుల ద్వారా నమోదు చేసుకోవచ్చు. 


ఆన్​లైన్​లో చేసుకోవాలంటే.. 


మ్యారేజ్ సర్టిఫికెట్​ను ఆన్​లైన్​లో తీసుకోవాలంటే.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లాలి. అక్కడ వివాహ రిజిస్ట్రేషన్ ఫారమ్ ఉంటుంది. అక్కడ అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి. పూర్తి చేసిన దానిని ఆన్​లైన్​లో సబ్​మీట్ చేయాలి. అనంతరం రిజిస్ట్రార్ ఆఫీస్​కి వెళ్తే వారు అపాయింట్​మెంట్ షెడ్యూల్ చేసి.. వివిధ ఫార్మాలటీలు కంప్లీట్​ చేసి.. మీకు దానిని అందిస్తారు. లేదంటే మీరు నేరుగా ఆఫీస్​కి వెళ్లి.. అక్కడి అధికారులతో ఆఫ్​లైన్​లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 


ఈ సర్టిఫికేట్ ఎందుకు ముఖ్యమంటే.. 


టాక్స్ పే చేసే సమయంలో ఈ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. ఉమ్మడి టాక్స్​ను సబ్​మీట్ చేయడం ద్వారా కొంత పన్నురాయితీ పొందవచ్చు. టాక్స్ ప్రయోజనాలు పొందడానికి ఇది చాలా అవసరం. వీసాకోసం దరఖాస్తు చేసే సమయంలో దీనిని కచ్చితంగా అడుగుతారు. ఇతర దేశాలలో సెటిల్ అయినవారికి ఇది అవసరం. డిపెండెంట్ వీసాలు లేదా జీవిత భాగస్వామి వీసాల కోసం ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. మ్యూచువల్​గా బ్యాంక్ ఎకౌంట్స్ ఉపయోగించాలనుకుంటే.. మీ పార్టనర్​ని జాయింట్ అకౌంట్ హోల్డర్​గా పెట్టేందుకు ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. 



పెన్షన్, ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కోసం దీనిని అడుగుతారు. ఇది లేకుండా జంట ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కష్టం. పాలీసీ చేయడంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆస్తులు కొనాలనుకున్నప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఈఎస్​ఐ, విద్యా, వైద్య ప్రయోజనాల కోసం ఇది హెల్ప్ అవుతుంది. పిల్లల అడ్మిషన్లు, ఇతర ముఖ్యమైన ప్రయోజనాల కోసం మ్యారేజ్ సర్టిఫికేట్​ అందరూ తీసుకోవాలని తెలిపింది సుప్రీం కోర్టు. మరి ఇంకెందుకు ఆలస్యం.. రీసెంట్​గా పెళ్లి చేసుకున్నవారు ఎవరైనా.. పెళ్లి చేసుకుని.. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోనివారు కూడా వెంటనే ఈ ప్రయోజనాలు పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకోండి. 


Also Read : టీబీ వ్యాధిని కంట్రోల్ చేసే ఇమ్యునోథెరపీలు.. చికిత్సలో ఇవే గేమ్ ఛేంజర్