Quick Mango Sweet Recipes : మీకు మామిడిపండ్లంటో ఇష్టమా? అయితే మీరు తప్పకుండా మ్యాంగో రవ్వ హల్వాను ట్రై చేయాల్సింది. హల్వా అంటే చాలా కష్టపడాలని అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. చాలా సింపుల్‌గా దీనిని తయారు చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కొత్తగా మ్యాంగో స్పెషల్ స్వీట్స్ తయారు చేయాలనుకున్నప్పుడు దీనిని మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
నెయ్యి - పావు కప్పు
రవ్వ - 1 కప్పు
పాలు - 2 కప్పులు
పంచదార - అరకప్పు
మామిడి గుజ్జు- అరకప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ - పావుకప్పు
తయారీ విధానం
ముందుగా మామిడి పండ్లను బాగా కడిగి.. వాటిపై తొక్కను తీసి.. ముక్కలుగా కోసుకోవాలి. లేదా బాగా పండిన మామిడి పండ్ల నుంచి గుజ్జును తీసి.. మిక్సీలో వేసుకుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వను వేసుకోవాలి.
రవ్వ, నెయ్యి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఉండలు రాకుండా.. అడుగున మాడు పట్టకుండా చిన్న మంటపై ఫ్రై చేసుకోవాలి. రవ్వలోకి నెయ్యి ఇంకిపోయి.. కాస్త వేగిన తర్వాత దానిలో పాలు వేసుకోవాలి. పాలు రవ్వకు బాగా పట్టేలా చిన్న మంటపై ఉడికిస్తూ.. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పంచదార కూడా వేసుకుని కలుపుకోవాలి.
పంచదార వేసి ఓసారి కలిపి దానిలో యాలకుల పొడి వేసి కలపాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దానిని పాలల్లో కలిపి నానబెట్టి.. ఈ సమయంలో వేసుకోవచ్చు. ఇది మంచి రుచితో పాటు రంగును కూడా ఇస్తుంది. పంచదార కరిగి రవ్వలో కలిసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మ్యాంగో పల్ప్‌ని వేయాలి. రవ్వతో మామిడి పండు గుజ్జు బాగా కలిసేలా చిన్న మంటపై కలుపుతూ ఉండాలి.
రవ్వలో మ్యాంగో పల్ప్ చేరిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాగా కలిపి స్టౌవ్ ఆపేసుకోవాలి. అంతే టేస్టీ స్వీట్ రెసిపీ మ్యాంగో రవ్వ హల్వా రెడీ. దీనిని మ్యాంగో ఫ్లేవర్స్‌ని ఇష్టపడేవారు.. స్వీట్‌ని ఇష్టంగా తినేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మ్యాంగో పల్ప్ సిద్ధంగా ఉన్నప్పుడు మీరు దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. గెస్ట్‌లు వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా దీనిని ట్రై చేసేయండి.