Indian Ayurveda : పురాతన వైద్య విజ్ఞానమైన ఆయుర్వేదాన్ని భారతీయ సంస్థలు ఇప్పుడు ప్రామాణికంగా మార్చేశాయి. ఒకప్పుడు ఇంటి వైద్యం, పెరటి వైద్యం ఇని పెదవి విరిచిన ఆయుర్వేదమే.. ఇప్పుడు అనేక రోగాలకు పేటెంట్లను పొందుతోంది. పతంజలి, డాబర్, హిమాలయ వంటి భారతీయ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థలు ప్రాచీన ఆయుర్వేదాన్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. అనేక సైంటిఫిక్ జర్నల్స్ ఇప్పుడు ఆయుర్వేద పరిశోధనల ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీనిపై ఇతర చాలా సంస్థల్లో పరిశోధనలు పెరిగాయి. పతంజలి సంస్థ "తమ కిడ్నీ మెడిసిన్ Renogrit పై పరిశోధన గ్లోబల్ సైంటిఫిక్ జర్నల్స్‌లో టాప్ -100 లో ఒకటిగా నిలిచిందని" ప్రకటించింది.
దేశంలోని ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థలు తమ ఉత్పత్తులను ఇప్పుడు కేవలం ఉత్పాదన చేయడం మాత్రమే కాదు.. వాటిని ఆధార సహిత చికిత్సలుగా రుజువు చేస్తున్నాయి. డయాబెటీస్, ఆర్థరైటిస్, మానసిక ఒత్తిడి వంటి దీర్ఘ కాలిక జబ్బులకు వీళ్లు సహజ చికిత్సలను ప్రత్యామ్నాయాలుగా మలిచారు. ఆయుర్వేదంలోని సమగ్రత… మనస్సు, శరీరం ఆత్మలను సమతుల్యం చేస్తూ... ఆధునిక వైద్యానికి ఉన్న ఈ పరిమితులను అధిగమించగలుగుతుంది.
అత్యున్నత స్థాయికి సహజచికిత్సల పరిశోధనలు
గడచిన కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో జరుగుతున్న పరిశోధనలు ఆధునిక వైద్యం పరిష్కరించలేని అనేక రోగాలకు ప్రత్యామ్నాయ వైద్యాన్ని అందించగలుగుతున్నాయి. ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యంతో మేళవించడం ద్వారా పతంజలి ఈ విషయంలో కొత్త శిఖరాలను అధిరోహించింది. తన కిడ్నీ మెడిసిన్ రెనోగ్రిట్ Renogrit పై పరిశోధన ప్రపంచంలో అత్యుత్తమ 100 పరిశోధనల్లో ఒకటిగా గ్లోబల్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ -2024 పేర్కొందని పతంజలి ప్రకటించింది. అంతే కాదు.. ఆయుర్వేద ఉత్పత్తుల్లో నాణ్యతను సమర్థతను పెంచేందుకు దాదాపు 500మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాలల్లో పనిచేస్తున్నారని కూడా ఆ సంస్థ చెబుతోంది.
తమ ఉత్పత్తుల్లోని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన ప్రజలు వాటిని ఇతరులకు సిఫారసు చేస్తుండటంతో వాటి నాణ్యత, సమర్థతపై అందరికీ నమ్మకం వస్తుదని పతంజలి సంస్థ చెబుతోంది. “ఆవనూనేను వెలికితీసే పురాతనమైన Kolhu ప్రక్రియ క్యాన్సర్ ను నిరోధించడంలోనూ.. చికిత్సలోనూ సహాయకారిగా ఉంటుంది. ఇది ప్రాచీన విజ్ఞానానికి ఆధునిక గుర్తింపు” అని పతంజలి చెప్పింది. తమ ఉత్పత్తులు దాదాపు 7౦దేశాల్లోనూ.. 4700 కు పైగా రీటైల్ అవుట్‌లెట్లలోనూ లభ్యమవుతున్నాయని చెప్పారు. పలు బహుళజాతి సంస్థల FMCG ప్రొడక్టులకు తమ స్వదేశీ ఉత్పత్తులు గట్టి పోటీ ఇస్తున్నాయని పతంజలి చెప్పింది. పెద్ద పెద్ద సోర్స్‌లో తమ ఉత్పత్తులను నిల్వ చేసుకుంటున్నారని కూడా పతంజలి చెబుతోంది.
కొన్నేళ్ల కిందటితో పోల్చితే ఆయుర్వేద ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు ఆయుర్వేద ప్రొడక్టులను సిఫారసు చేస్తున్నారు. ఒకప్పుడు కొద్దిపాటి ఆయుర్వేద మందుల దుకాణాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పతంజలి లాంటి రీటైల్ అవుట్‌లెట్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థల గ్రోత్ పెరుగుతూనే ఉంది. చాలా సంస్థలు వందల రకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. తమ ఉత్పాదక సామర్ఖ్యాన్ని కూడా పెంచుకుంటున్నాయి. ఎక్కువుగా ఇవి వ్యవసాయం ఆధారిత సహజ ఉత్పత్తులు కావడం వల్ల స్థానికంగా ఉండే రైతులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటోంది.