Tooth In Nose | దంతాలు ఎక్కడ పెరుగుతాయి? అనే ఎవరైనా ప్రశ్నిస్తే చాలా సిల్లీగా ఉంటుంది కదూ. కానీ, అదే ప్రశ్న ఈ వ్యక్తిని అడిగితే ఏం చెబుతాడో తెలుసా? నోట్లో మాత్రమే కాదు, ముక్కులో కూడా దంతాలు పెరుగుతాయని చెబుతాడు. అయితే, మీరు అతడిని పిచ్చివాడని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే.. అతడి ముక్కులో నిజంగానే దంతం మొలిచింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా. వైద్యులు కూడా మొదట్లో నమ్మలేదు. ఊపిరి ఆడటం లేదంటే.. ఏదో శ్వాస సంబంధిత సమస్య ఏమో అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ, ఎన్ని మందులు మింగినా లాభం లేకపోవడంతో వైద్యులు ఎక్స్‌రే తీసి.. సమస్య గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు. రిపోర్ట్ చూసిన తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. నోటిలో పెరగాల్సిన దంతం.. అతడి ముక్కులో పెరగడం చూసి షాకయ్యారు. ఈ దంతం నోట్లో మొలిస్తే డెంటిస్ట్ తీసేస్తారు. కానీ, ఇది ముక్కులో మొలిచింది. మరి దీన్ని ఎవరు పీకాలి? అనే గందరగోళం నెలకొంది. మొత్తానికి డెంటిస్టులు, ఐఎన్టీ స్పెషలిస్ట్‌లు, సర్జన్లు కలిసి అతడికి ఆ దంతం నుంచి విముక్తి ప్రసాదించారు. 


‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌’‌లో పేర్కొన్న ఈ అరుదైన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 38 ఏళ్ల వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నాడు. ఓ రోజు తన ముక్కులో ఏదో తెల్లని పదార్థం కనిపించడంతో హడలిపోయాడు. వేలు పెట్టి చూస్తే.. అది గట్టిగా ఉంది. దాని వల్లే తనకు ఊపిరి ఆడటం లేదనే సందేహంతో అతడు వైద్యుడిని సంప్రదించాడు. 


రైనోస్కోపీ తదితర వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. కుడి నాసికా రంధ్రంలో ఎక్టోపిక్ దంతాలు అసాధారణంగా పెరుగుతున్నట్లు తెలుసుకున్నారు. దాని వల్ల ముక్కు రంధ్రాల మధ్య ఉండే పలుచని గోడ పక్కకు జరిగినట్లు తెలుసుకున్నారు. అయితే, దాని వల్ల అతడికి ఎలాంటి గాయం కాలేదు. వైద్య నిపుణులు సాగర్ ఖన్నా, మైఖేల్ టర్నర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ దంతం వల్ల ముక్కు లోపలి భాగంలో 2 సెం.మీ చిల్లులు కనిపించాయి.


Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!


ముక్కులో దంతాన్ని కనుగోగానే ఇంట్రానాసల్ విధానం ద్వారా ఓటోలారింగోలాజిక్ శస్త్రచికిత్సతో పంటిని తొలగించారు. దంతం పొడవు సుమారు 14 మిమీలు ఉన్నట్లు తెలిపారు. సర్జరీ తర్వాత రోగి కోలుకున్నాడని, ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఇప్పుడు అతడు చక్కగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు తెలిపారు.  కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దంతాలు నోట్లో పెరుగుతాయని, చిగుళ్ళ క్రింద దవడ ఎముకల్లో ఉండిపోయినప్పుడు ఇలా పెరుగుతుంటాయని వివరించారు. అయితే, ఇలా ముక్కులో దంతం పెరగడమనేది చాలా అరుదని పేర్కొన్నారు. ఇలాంటి దంతాలను ఎక్టోపిక్ తీత్స్ అంటారన్నారు. ఇలాంటి సమస్య ఎవరిలోనైనా ఏర్పడవచ్చట. 


Also Read: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది