ప్రేమతో పెంచుకొనే పెంపుడు జంతువుకు చిన్న దెబ్బ తగిలినా మనసు అల్లాడిపోతాం. మళ్లీ అది కోలుకొనే వరకు నిద్ర కూడా పట్టదు. అలాంటిది.. అతడు ఏకంగా ఆ పందిని ముక్కలు చేసుకుని తినేశాడు. చివర్లో దాని ఫొటో వద్ద దీపం వెలిగించి మరీ నివాళులు అర్పించాడు. అతడు అలా ఎందుకు చేశాడో తెలిస్తే మీరు తప్పకుండా అతడిని తిట్టిపోస్తారు. అసలు విషయం తెలిసిన తర్వాత మెచ్చుకుంటారు.
జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి కొత్తగా ఓ యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ సాధించాలనేది అతడి టార్గెట్. ఈ సందర్భంగా అతడికి ఓ ఐడియా వచ్చింది. ఓ పందిని పెంచుతూ ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టాలని అనుకున్నాడు. అయితే, పందుల పెంపకం తరహా వీడియోలు ఎవరు చూస్తారని అనుకున్నాడో ఏమో.. వెంటనే తన ఆలోచన మార్చుకున్నాడు. తన చానెల్‌కు ‘ఈటింగ్ పిగ్ ఆఫ్టర్ 100 డేస్’ అని పేరు పెట్టాడు. ఆ పేరు ఎందుకు పెట్టాడో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వంద రోజులు ఒక పందిని పెంచి.. దాన్ని కోసుకు తినేయడం ఈ చానెల్ కాన్సెప్ట్.
అతడు ఆ చానెల్ అలా ప్రారంభించాడో లేదో.. వంద రోజుల్లో 1.24 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఆ పందిని అతడు నిజంగానే చంపుతాడా లేదా అనే క్యూరియాసిటీతో కొందరు, యజమానే తన పెంపుడు పందిని చంపాలనుకోవడం కొత్తగా ఉందని మరికొందరు.. వంద రోజులపాటు అతడి వీడియోలు చూశారు. అయితే, అతడు ఆ పంది పిల్లను వధించేందుకు తీసుకొచ్చినట్లుగా చూడలేదు. ఇంట్లో పెంచుకొనే పంది పిల్లలాగే ఎంతో ప్రేమగా లాలించి పెంచాడు. దానికి ఆహారం తినిపించడం, కడగడం, దాని పక్కనే నిద్రపోవడం వంటివి చేశాడు. బహుశా జంతు ప్రేమికులు కూడా అంత ప్రేమగా చూసుకోరేమో అనిపించేలా అతడు ఆ పందిపిల్లను పోషించాడు. అంత ప్రేమగా దాన్ని పోషిస్తున్న అతడు నిజంగానే ఆ పంది పిల్లను చంపేస్తాడా అనే సందేహం చాలామందిలో కలిగింది. అలా వంద రోజులు గడిచాయి. అతడు ఏం చేస్తాడా అని అంతా ఎదురుచూశారు.
ఎట్టకేలకు వీక్షకులు ఎదురుచూస్తున్న వీడియో రానే వచ్చింది. ఆ వీడియోలో అతడు బోనులో ఉన్న పంది పిల్లను బయటకు తీశాడు. ఆ తర్వాత ఎక్కడికో తీసుకెళ్లాడు. అనంతరం ఓ కార్డ్‌బోర్డు బాక్సుతో తిరిగి రావడం కనిపించింది. అందులో అందు ఆ పంది పిల్ల మృతదేహాం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ చనిపోయిన పందిని చూపించకుండా వీడియోను బ్లర్ చేశాడు. బయట ఓ గ్రిల్ పెట్టి.. ఆ పంది మాంసాన్ని కాల్చేందుకు సిద్ధమవుతున్నట్లు చూపించాడు. ఆ తర్వాత అతడు పంది పిల్లను స్మరిస్తూ.. దాన్ని ఉంచిన బోను వద్ద కొవ్వొత్తిని వెలిగించి నివాళి అర్పించాడు. అయితే, ఈ వీడియో చాలామంది వీక్షకులకు కోపం తెప్పించింది. జంతు హింస మహాపాపం అంటూ అతడిని తిట్టిపోశారు. అంత ప్రేమగా పెంచిన పందిని ఎలా చంపేస్తావంటూ అతడిని బూతులు తిట్టారు.
మొదటి రోజు(వీడియో):
మరి, అతడు నిజంగానే పందిని చంపాడే అనే సందేహం చాలామందిలో కలిగింది. ఎందుకంటే అతడు 100 రోజుల తర్వాత మళ్లీ పంది వీడియోను పోస్టు చేశాడు. అది కూడా ముందు అతడు పెంచిన పందిలాగానే ఉంది. దీంతో అతడు 100వ రోజు ఆ పందిని చంపలేదని, కేవలం అతడు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఆ వీడియోను పోస్ట్ చేశాడని భావించారు. ఈ విషయాన్ని మాత్రం ఆ యూట్యూబర్ స్పష్టం చేయలేదు. అతడు ఆ పందిని చంపలేదని భావించిన వ్యూవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక వేళ ఇతడు ఆ పందిని చంపినా ఎంతో ప్రేమగా వ్యవహరించాడని, మాంస విక్రేతలు ఇంతకంటే దారుణంగా.. హింసించి మరీ పందులను చంపుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.
100వ రోజు (వీడియో):
100వ రోజు పందిని చంపి తింటున్నట్లు పోస్టు చేసిన వీడియోను సుమారు 3.4 లక్షల మందికి పైగా వీక్షించారు. జంతువుల దయనీయ స్థితిని తెలియజేయడం కోసమే అతడు ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, చాలామందికి మాత్రం అతడిపై అనుమానం ఉంది. అతడు నిజంగానే 100వ రోజు ఆ పంది పిల్లను చంపేసి పాత వీడియోలను చూపిస్తున్నాడని అంటున్నారు. విమర్శలు రావడంతో అతడు ఇలా కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, చాలామంది మాత్రం అతడు ఆ పందిని చంపలేదనే నమ్మకంతో ఉన్నారు. ఆ పంది మళ్లీ సజీవంగా చూసినందుకు సంతోషంగా ఉందంటూ ఆ యూట్యూబర్‌ను మెచ్చుకుంటున్నారు.
Also Read: మనుషులపై జంతువులకు లైంగిక కోరికలు? ఆ డాల్ఫిన్ ఆమెతో ఏం చేసింది?
Also Read: 12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్ర.. ఏ రోగం లేకుండా భలే బతికేస్తున్నాడు, అదెలా సాధ్యం?
Also Read: విమానం మధ్య సీట్లోని ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలో తెలుసా?