మీరు గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ‘Worst Person You Know’ అని కొట్టండి. తప్పకుండా మీకు ఇతడి ఫొటోనే వస్తుంది. వాస్తవానికి అతడు ఎవరికీ కీడు చేయలేదు. కనీసం క్రిమినల్ కూడా కాదు. అతడు ఒక సాధారణ ఉద్యోగి. కానీ, గూగుల్ మాత్రం అతడిని ‘మీకు తెలిసిన చెత్త వ్యక్తి’ అని అంటూ అతడి ఫొటోను చూపిస్తోంది. అయితే, అతడి పర్శనల్ ఫొటో గూగుల్‌కు ఎలా చిక్కింది? అతడిని చెత్త వ్యక్తి అని చూపించడానికి కారణం ఏమిటనేగా మీ సందేహం? అయితే.. ఏం జరిగిందో చూడండి.
ఉదాహరణకు.. మీరు ఓ రోజు ఉదయాన్నే పేపరు చదువుతున్నారు. అందులో మీ ఫొటో వచ్చింది. దాని కింద మీరు ఒక వరస్ట్ పర్శన్ అనే క్యాప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. స్పెయిన్‌లోని కాటలోనియాకు చెందిన జోసెప్ మరియా గార్సియా అనే 42 ఏళ్ల వ్యక్తికి కూడా అదే జరిగింది. ఓ రోజు ఉదయం గార్సియా బావ ఫోన్ చేశాడు. గూగుల్‌లో ‘Worst Person You Know’ అని టైమ్ చేయమన్నాడు. అతడు చెప్పినట్లే చేశాడు. అంతే.. స్క్రీన్ మీద గార్సియా ఫొటో ప్రత్యక్షమైంది. ‘‘నేను అంత చెత్తపని ఏం చేశా?’’ అని ఆశ్చర్యపోయాడు. అయినా, ఈ ఫొటో నేనెప్పుడు తీయించుకున్నా? అని ఆలోచించాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది.. ఔను, ఓ రోజు తన బావ తన కెమేరా లైట్ చెక్ చేయడం కోసం తీసిన ఫొటో అది. ఫొటో బాగుంది కదా అని తెలుసుకున్నాడు. వెంటనే తన బావకు ఫోన్ చేసి.. ఎందుకలా తనను చెత్త వ్యక్తిగా గూగుల్ చూపిస్తోందని అడిగాడు. దీంతో అతడు అసలు విషయం చెప్పాడు. ఆ ఫొటో బాగా రావడంతో 2014లో Getty Imagesకి అప్‌లోడ్ చేశానని తెలిపాడు. అప్పుడు గార్సియాకు ఆ విషయం గుర్తుకొచ్చింది.
గార్సియా బావ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఎనిమిదేళ్ల కిందట అతడు ఒక అమెరికన్ రచయిత కోసం కొన్ని ఫోటోలు తీయడానికి బార్సిలోనా వెళ్లాడు. అక్కడ గార్సియాను ఫోటో కోసం పోజులివ్వమని అడిగాడు. ఫొటో నచ్చడంతో దాన్ని ‘గెట్టి ఇమేజెస్ స్టాక్ ఫోటో కేటలాగ్’కు అప్‌లోడ్ చేశాడు. అయితే, 2018లో ఓ వార్త కోసం అతడి ఫొటోను ఉపయోగించారు. ఈ విషయాన్ని అతడి బావ గార్సియాకు చెప్పాడు. అయితే, అతడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఆ వార్త వల్ల అతడి ఫొటో వైరల్‌గా మారింది. Google అల్గారిథమ్ వల్ల అది ‘Worst Person You Know’ అనే కీవర్డ్‌తో ట్రెండవ్వడం మొదలైంది. దీంతో అతడు గ్లోబల్ ఇంటర్నెట్ మీమ్‌గా మారిపోయాడు. అతడికి కాస్త నాజీ లుక్ ఉండటం, కన్నింగ్‌లా చూడటంతో చాలామంది ప్రతికూల వార్తలకు అతడి ఫొటోను ఉపయోగించి విలన్‌గా మార్చేశారు. అయితే, ఈ ఫొటో గురించి తొలుత వారి ఊరిలో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం వల్ల ఇప్పుడు చాలామంది అతడిని గుర్తుపడుతున్నారు. దీంతో అతడి బావ గెట్టీ నుంచి ఆ ఫొటోను తీయించాడు. కానీ, గూగుల్ మాత్రం ఇంకా ట్రెండవ్వుతూనే ఉంది. జూన్ 30 వరకు ఈ ఫొటో గూగుల్ సెర్చ్‌లో వచ్చింది. ఇప్పుడు అది గూగుల్ ఇమేజెస్‌లో మాత్రమే కనిపిస్తోంది.
Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?