Biggest Makeup Trends 2023 : ఇన్‌స్టా, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయ్యే కొద్ది.. స్క్రీన్‌మీద అందంగా కనిపించాలనే కోరికతో చాలా మంది మేకప్‌ను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాటిలో ప్రో అవ్వడమే కాకుండా.. కొత్తకొత్త పద్ధతులు, ట్రెండ్స్ ట్రై చేసి.. అందరికంటే భిన్నంగా, అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. రోజుకో కొత్త రంగు మార్చితేనే కదా.. లుక్స్, కంటెంట్ డిఫరెంట్‌గా అనిపించేది. అయితే 2023లో ఇలా మేకప్‌లో జరిగినా మార్పులు.. టాప్‌గా నిలిచిన మేకప్ ట్రెండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంవత్సరంలో కాస్మెటిక్ ప్రభావం ఇన్ఫ్లూయన్సర్స్పై, వారి వల్ల అభిమానులపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా ముఖానికి వేసుకునే మేకప్, సర్జరీలు, ట్రీట్మెంట్స్పై చాలా అవగాహన వచ్చేసింది. ఇది కేవలం సౌందర్యంపైన మాత్రమే ప్రభావం చూపలేదు. వ్యక్తిత్వం, సృజనాత్మకత, అలంకరణ కళాత్మకత వంటి వాటిపై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే 2023లో బాగా ప్రాచూర్యం పొందిన ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
గోల్డెన్ అవర్ గ్లామ్
సాధారణంగా ఫోటోలు, వీడియోల కోసం గోల్డెన్ అవర్ కోసం వెయిట్ చేస్తారు. అయితే ఈ బ్యూటీ ట్రెండ్ గోల్డెన్ అవర్ సమయంలో చర్మానికి వచ్చే మెరుపుతో ప్రేరణ పొందింది. ఇది మీకు వార్మ్ టోనింగ్ ఇచ్చి.. మీ స్కిన్ మెరిసేలా చేస్తుంది. అయితే ఈ లుక్ కావాలానుకుంటే సాధారణంగా మనం ఉపయోగించే బ్లష్, బేస్ తెలుపు, పింక్ టోన్లకు బాయ్ చెప్పాలి. గోల్డెన్ అవర్ గ్లామ్ కోసం వార్మ టోన్ హైలైటర్ యూజ్ చేస్తారు. పేరుకు తగ్గట్లుగా మారేందుకు ఎక్కువ హైలైట్, బ్రోంజర్ ఉపయోగిస్తారు.
మెటాలిక్ షేడ్స్
కొంచెం మెరుపు, మెటాలిక్ మేకప్ లుక్‌తో ఏ రూపానికైనా తక్షణమే లుక్ వస్తుంది. ప్రతి రెప్పపాటుతో కాంతిని ఆకర్షించే, మెరిసే ఐషాడోల నుంచి.. దృష్టిని ఆకర్షించే, మిరిమిట్లుగొలిపే మెటాలిక్ లిప్‌స్టిక్‌ల వరకు ఉండే ఈ ట్రెండ్.. అన్నీ సీజన్లలోనూ హైలైట్‌గా నిలిచింది.
మెటాలిక్ సిల్వర్, గోల్డెన్ బ్లష్, లావెండర్ లేదా కూల్ బ్లూస్‌లో షేడ్స్‌ను మిక్స్ చేసి ఈ మేకప్ లుక్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఫెస్టివల్ టైమ్‌లో మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది.
బోల్డ్ ఐ బ్రోస్
ఈ మధ్య కాలంలో కనుబొమ్మల మీద చాలా మంది దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు మేకప్‌తో వాటిని సెట్ చేసుకుంటే.. ఇప్పుడు కాస్మోటిక్ ట్రీట్మెంట్స్తో వాటిని తీర్చిదిద్దుతున్నారు. ఇది బోల్డ్, చక్కటి ఆహార్యాన్ని అందిస్తుంది. బోల్డ్ ఐ బ్రోస్ని సహజమైన ఆకృతిలో.. మొఖానికి తగినట్లు ఇస్తూ కూడా మేకప్ లుక్‌ని సెట్ చేసుకుంటున్నారు. అందుకే ఇది బాగా ట్రైండ్ అయింది. ఇన్‌ఫ్లూయన్సర్స్, సెలబ్రెటీల వల్ల ఇది సాధారణ ప్రజలలోకి కూడా బాగా వెళ్లిందనే చెప్పుకోవాలి.
బోల్డ్ బ్లష్
బ్లష్ అనేది ముఖంపై పింక్ గ్లోని ఇస్తుంది. ఇది ముఖానికి శక్తివంతమైన, గొప్పరంగును అందిస్తాయి. ఈ లుక్ కావాలనుకునేవారు కచ్చితంగా తమ రంగుకు సరిపోలే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే మీ ముఖం చాలా ఎబ్బెట్టుగా మారిపోతుంది. మీరు సాధారణంగా వేసుకునే బ్లష్ కంటే కాస్త ఎక్కువగా మీరు బ్లష్ చేసుకోవచ్చు. మీరు బోల్డ్ బష్ చేసుకోవడం వల్ల కలిగే మరో బెనిఫిట్ ఏంటంటే.. మీరు సన్‌బర్న్ కాకుండా బీచ్ గ్లోని పొందవచ్చు.
ఫుడ్ థీమ్ మేకప్
తీసుకునే ఆహారం నుంచి ప్రేరణ పొంది ఫుడ్ థీమ్ మేకప్‌ను ట్రెండ్‌లోకి తీసుకొచ్చారు. ఇది కూడా గ్లామర్ ప్రపంచంలో బాగానే ట్రెండ్ అవుతుంది. మొదట్లో ఈ మేకప్ ఔత్సాహికులకు కాస్త కష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. తమ సౌందర్య ఎంపికల ద్వారా తమకు నచ్చిన ఫుడ్స్‌పై ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కనుబొమ్మలు, పెదవుల నుంచి పండ్ల నుంచి ప్రేరణ పొంది.. ఎస్ప్రెస్సో షాట్ల పేరుతో మేకప్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ మీ మేకప్ దినచర్యలో కాస్త సృజనాత్మకతను జోడిస్తుందనే చెప్పవచ్చు.
Also Read : ఇంట్లోనే పార్లల్లాంటి వాక్సింగ్.. స్మూత్ స్కిన్ కోసం ఇలా చేయండి