ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం సర్వసాధారణం. అన్నం మిగిలిపోతే మరుసటి చద్దన్నంలా తినడమో లేక పడేయడమో చేస్తుంటారు చాలా మంది. లేదా అన్నం పోపు పెట్టుకుని తింటారు. మిగిలిపోయిన అన్నంతో కేవలం ఇంతే చేయగలమా? కాదు, ఎన్నో వంటకాలు చేయచ్చు. 

అన్నం ఇడ్లీఇడ్లీని మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వను ముందుగానే నానబెట్టుకోవాలి. తరువాత మిగిలిపోయిన అన్నా్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో నానబెట్టుకున్న రవ్వ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి రుబ్బు వేసుకోవాలి. పావుగంట తరువాత వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. 

దోశెలుమిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశెలను వేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలుఅన్నం - ఒక కప్పుపెరుగు - ఒక కప్పువరిపిండి - అరకప్పుగోధుమపిండి - పావుకప్పుఉప్పు - రుచికి సరిపడినంత

తయారీ: అన్నం, పెరుగు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అందులో వరిపిండి, గోధుమపిండి పావుకప్పు, ఉప్పు వేసి బాగా కలపాలి. మరీ మందంగా కాకుండా పలుచగా కలుపుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి పలుచగా దోశెల్లా వేసుకోవాలి. 

Also Read: ఇతడో మంచి దొంగ, ఏమీ ఎత్తుకుపోలేదు సరికదా తిరిగి ఇచ్చి వెళ్లాడు

.........................

పునుగులుఅన్నంతో వేసే పునుగులు చాలా టేస్టీ ఉంటాయి. కావాల్సిన పదార్థాలుఅన్నం - రెండు కప్పులుశెనగ పిండి - ఒక కప్కపుఅల్లం పేస్టు - ఒక స్పూనుపచ్చిమిర్చి - రెండుకొత్తిమీర తరుగు - రెండు స్పూన్లుజీలకర్ర - ఒక స్పూనుకారం - ఒక స్పూనుఉప్పు - రుచికి సరిపడానూనె - డీప్ ఫ్రైకు సరిపడానీళ్లు -తగినన్ని

తయారీమిక్సీలో మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో శెనగపిండి, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. నూనె బాగా వేడెక్కాక రుబ్బుని పునుగుల్లా వేసుకోవాలి. టొమాటో చట్నీతో తింటే మంచి రుచిగా ఉంటాయి. 

................................

వడియాలుకావాల్సిన పదార్థాలుఅన్నం - ఒక కప్పుజీలకర్ర - ఒక స్పూనుఎండు మిర్చి - రెండుఉప్పు - సరిపడినంత 

తయారీ విధానంఅన్నాన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. జీలకర్ర, ఎండు మిర్చి, ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఆ పొడిని అన్నం రుబ్బులో కలపాలి. పల్చని కవర్ మీద వడియాల్లా పెట్టుకోవాలి. ఇవి చాలా రోజులు  నిల్వ ఉంటాయి. నూనెలో వేయించుకుని తింటే బావుంటాయి. 

Also Read: మధుమేహం ఉన్నా అరటి పండు తినొచ్చు, కానీ ఈ జాగ్రత్తలతో..