పెరుగు పుల్లగా ఉంటే అసలు తినరు. వాసన మాత్రమే కాదు రుచి కూడా మారిపోతుంది. దీంతో దాన్ని పడేస్తారు. కానీ పులిసిన పెరుగుతో రకరకాల పదార్థాలు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటాయి. సాధారణంగానే పెరుగుని అన్ని రకాల సబ్జీలు, కూరలు, పండ్లతో జత చేసుకుని తింటారు. గట్ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ప్రొబయోటిక్స్ తో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం చల్లగా ఉంది జీర్ణక్రియకి తోడ్పడుతుంది. అయితే పెరుగు వెంటనే తినాలి ఎక్కువ గంటలు బయట వాతావరణానికి ఉంటే అది పుల్లగా మారిపోతుంది. ఇది తినడం చాలా కష్టం. కానీ ఈ పద్ధతుల్లో కూడా పులిసిన పెరుగు తినొచ్చు.
చీలా
చీలా ఆరోగ్యకరమైన పదార్థం. ఉదయాన్నే అల్పాహారంగా చీలా తీసుకుంటే చాలా మంచిది. శనగ పిండి, జోవర్, సూజి, రాగి, రాజ్ గిరా, ఓట్స్ వంటి వివిధ రకాల పిండిని ఉపయోగించి చీలా తయారు చేస్తారు. చీల పిండి చేయడానికి నీటిని కాకుండా పుల్లని పెరుగు వాడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు పుల్లని పెరుగుతో చేసిన చీలా మెత్తగా ఉంటుంది.
చాచ్ లేదా మజ్జిగ
మజ్జిగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఒడిసాలో దీన్ని చాచ్ లేదా గోల్ అంటారు. పుల్లని పెరుగుతో మజ్జిగ చేసుకుంటే బాగుంటుంది. వేయించిన జీలకర్ర పొడి, పుదీనా ఆకులు, రాతి ఉప్పు, కొత్తిమీర వంటి పదార్థాలు మజ్జిగలో చేర్చుకుంటే మంచిది. ఇవి జోడించడం వల్ల మజ్జిగ మంచి రుచి రావడమే కాదు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.
ధోక్లా
గుజరాత్ వంటకం ధోక్లా. నార్త్ ఇండియన్స్ కి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఇది. అల్పాహారంగా దీన్ని తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ధోక్లా పిండి మృదువుగా చక్కని రుచి రావాలంటే పుల్లని పెరుగు ఉపయోగించాలి. ఆవాలు, కరివేపాకు, తియ్యటి నీటిని గార్నిషింగ్ గా వేయడం వల్ల ఈ వంటకం పూర్తవుతుంది.
కది సొర్
పెరుగుతో చేసే మరొక వంటకం కది సొర్. నార్త్ ఇండియాలో రాజ్మా చావల్ ఎంత పాపులర్ అయిందో కదీ చావల్ కూడా అంతే పాపులర్. కదీ పకోరా, పాలక్ కదీ, ఆలూ కదీ చాలా ఫేమస్. నోరూరించే వంటకాలు ఇవి. కదీని పెరుగుతో పాటు బేసన్ లేదా మూంగ్ పప్పు ఉపయోగించి తయారుచేస్తారు. కదీని తయారు చేయడానికి పెరుగుని ప్రత్యేకంగా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి కావాలని పుల్లగా చేస్తారు.
కర్ద్ రైస్
దక్షిణ భారతదేశంలో అత్యధికులు మెచ్చే బ్రేక్ ఫాస్ట్ కర్డ్ రైస్. వేసవిలో తప్పనిసరిగా తింటారు. కర్డ్ రైస్ చేయడానికి పుల్లని పెరుగుని ఉపయోగించడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, అల్లం, జీడిపప్పు వేసి తయారు చేస్తారు. పెరుగు అన్నాన్ని చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర ఆకులతో అలకరించుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.
ఫేస్ ప్యాక్
పుల్లని పెరుగు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొడి చర్మానికి పెరుగు మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. మీ రెగ్యులర్ ఫేస్ ప్యాక్ లో 2 స్పూన్ల పుల్లటి పెరుగు మిక్స్ చేయాలి. బేసన్ ఫేస్ ఫ్యాక్, గంధపు ఫేస్ ప్యాక్, పసుపు, కాఫీ ప్యాక్ తో పెరుగు కలిపి పెట్టుకోవచ్చు. ఇది రాసుకున్న తర్వాత 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు కలిపిన ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు