Sankranthi 2025 Specials Ariselu Recipe : పండుగ పిండివంటల్లో అరిసెలు కూడా క్రేజే వేరు. సంక్రాంతి అరిసెలు లేకుండా చేస్తే అది ఇన్​కంప్లీటే అవుతుంది. అలాంటి అరిసెలను పండగకు ముందే సిద్ధం చేసుకుని.. పండుగ సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ టేస్టీ అరిసెలను బెల్లంతో ఎలా చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలు ఏంటో? తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా వస్తాయో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

బియ్యం - 1 కేజి

బెల్లం - ముప్పావు కేజి

తెల్ల నువ్వులు - అర కప్పు

యాలకుల పొడి - 2 స్పూన్లు

నెయ్యి - ఆరు స్పూన్లు 

తయారీ విధానం

బియ్యాన్ని రాత్రి కడిగి నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే కడిగి.. జల్లెడలో వేసుకోవాలి. నీరు అంతా పోయేవరకు అరగంట ఉంచి.. పిండిని ఆడించుకోవాలి. ఈ పిండిని ఆడించుకున్న వెంటనే అరిసెలు చేయడం మొదలు పెట్టేయాలి. ఎందుకంటే పిండి ఆరిపోతే అరిసెలు మంచిగా రావు. అరిసెలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిండి ఆరకముందే ప్రాసెస్​ను స్టార్ట్ చేయాలి. 

పిండిని ఆడించుకునేలోపు బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. మంచి బెల్లాన్ని గడ్డలుగా లేకుండా.. తురుముకోవాలి. పిండి ఆడించి తెచ్చిన వెంటనే బెల్లాన్ని పాకం పట్టేయాలి. బెల్లం పాకం పట్టేందుకు స్టౌవ్ వెలిగించి.. దానిపై పెద్ద మందపాటి కడాయిని పెట్టాలి. దానిలో బెల్లం వేసి ఓ గ్లాస్​ నీళ్లు వేయాలి. సన్నన్ని మంటపై బెల్లాన్ని కరగనివ్వాలి. ఈ అరిసెలు చేయడానికి కచ్చితంగా ఇద్దరు వ్యక్తులు ఉండాలని గుర్తించుకోండి. 

Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్​గా ఉంటాయి

బెల్లం కరిగి పాకం అయిన తర్వాత నీటిని తీసుకుని దానిలో సిరప్ వేయాలి. అది గడ్డకట్టే విధంగా మారితే పాకం సిద్ధమైనట్లే. ఇలా సిద్ధమైన పాకాన్ని ఒకరు గరిటతో తిప్పుతుంటే.. మరకొరు బియ్యం పిండిని దానిలో వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడా ఆగకుండా పిండిని కలుపుతూ ఉండలు లేకుండా బెల్లంలో కలిసేలా కలుపుకోవాలి. ఈ క్రమంలో యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసేవరకు కలిపి.. గట్టిగా అయ్యేవరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో రెండు చెంచాల నెయ్యి వేసుకుని పిండిని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.  

పిండి చల్లారిన తర్వాత ముద్దగా మారుతుంది. దానిని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. వేగిన తర్వాత.. పిండిని కొద్దిగా తీసుకుని అరిసెలుగా ఒత్తుకోవాలి. వాటిని నూనెలో వేసి.. సన్నని మంటపై రెండువైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల అరిసెలు లోపల కూడా బాగా ఉడుకుతాయి ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.

Also Read : సంక్రాంతి 2025కి ఈ ముగ్గులు ట్రై చేయండి.. పండక్కి ఈజీగా వేయగలిగే రంగోలి డిజైన్స్ ఇవే