Makar Sankranti 2025 Recipes : సంక్రాంతి అంటే పిండివంటలు. వాటి ఘుమఘుమలు. కానీ కొందరు వివిధ కారణాలతో పిండివంటలకు దూరంగా ఉంటారు. డైట్​లంటూ, హెల్తీ ఫుడ్​ అంటూ ఫాలో అయ్యేవారు పూర్తిగా ఫెస్టివ్​ వైబ్​కి దూరంగా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని స్నాక్స్​ని హెల్తీగా కూడా చేసుకుని సంక్రాంతి ఫీల్​ని పొందొచ్చు. ఇంతకీ ఏ స్నాక్స్​ని హెల్తీగా వండుకోవచ్చో.. చిన్న చిన్న టిప్స్​తో టేస్టీ, హెల్తీ రెసిపీలు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 


పాయసం


కావాల్సిన పదార్థాలు



  • సేమ్యాలు

  • బాదం మిల్క్

  • ఖర్జూరాలు

  • బెల్లం

  • డ్రై ఫ్రూట్స్


సంక్రాంతి సమయంలో పాయసం కచ్చితంగా ఉండాలి. అయితే మీరు హెల్తీగా దీనిని చేసుకోవాలనుకుంటే ఈ హెల్తీ రెసిపీని ఫాలో అవ్వొచ్చు. సాధారణంగా పాయసం కోసం సేమ్యాను నెయ్యిలో వేయిస్తారు. కానీ హెల్తీగా తినాలనుకున్నప్పుడు వీట్ సేమ్యాను తీసుకుని నార్మల్​గా ఫ్రై చేసుకోవాలి. రెగ్యూలర్ పాలకు బదులుగా బాదం మిల్క్​ని ఉపయోగిస్తే మంచిది. బాదం మిల్క్​ని ఉడికించుకుని దానిలో వేయించుకున్న సేమ్యాలు వేసుకోవాలి. దానితో పాటు రెండు ఖర్జూరాలు క్రష్ చేసి వేయాలి. కొంచెం బెల్లం వేసుకుని ఉడికించుకుంటే చాలు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్​తో దానిని గార్నిష్ చేసుకోవాలి. అంటే టేస్టీ, హెల్తీ పాయసం రెడీ. 


నువ్వుల లడ్డూ 


కావాల్సిన పదార్థాలు



  • నువ్వులు

  • పాలు

  • కుంకుమ పువ్వు

  • బెల్లం


నువ్వుల లడ్డూ కూడా క్రంచీగా, మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని ఎలా చేయాలంటే నువ్వులను పాన్​లో తీసుకుని కాస్త నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేడిపాలల్లో కుంకుమ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్​లో బెల్లం వేసి కరిగించుకోవాలి. పాకం వచ్చిన తర్వాత నువ్వులు వేసి, పాలల్లో నానబెట్టిన కుంకుమ వేసి బాగా కలపాలి. స్టౌవ్ ఆపేసి.. వాటిని బాల్స్​గా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ. 


Also Read : మకర సంక్రాంతి 2025 తేది.. ఈ పండుగ చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే 


పల్లీ చిక్కి


కావాల్సిన పదార్థాలు



  • వేరుశనగలు

  • బెల్లం

  • యాలకుల పొడి


పల్లీలను ఫ్రై చేసుకోవాలి. వాటిపై తొక్కను తీసేయాలి. ఇప్పుడు పాన్​లో బెల్లం వేసి.. తీగపాకం వచ్చేవరకు కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఈ సిరప్​లో పల్లీలు వేసుకోవాలి. దానిలో యాలకులపొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలిపి.. బటర్ రాసిన ప్లేట్​పై వేసి.. ఫ్లాట్​గా ఒత్తుకోవాలి. మీకు నచ్చినషేప్​లో గాట్లు పెట్టి.. చల్లారనివ్వాలి. అంతే టేస్టీ, క్రంచీ, హెల్తీ పల్లీ చిక్కి రెడీ. 


ఈ తరహా చిన్న చిన్న స్నాక్స్​ మీ క్రేవింగ్స్​ని కంట్రోల్ చేసి.. ఫెస్టివల్ వైబ్​ని మిస్​ కాకుండా హెల్ప్ చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ హెల్తీ స్నాక్స్​ని సంక్రాంతి పండుగ సమయంలో ట్రై చేసేయండి. 



Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్​గా ఉంటాయి