Madhavan About Intermittent fasting: నటీనటులు అన్న తర్వాత సినిమాకు తగినట్టుగా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. దానికోసం వారు ఎంతో కష్టపడాలి. ఒక్కొక్క సినిమా కోసం చాలా బరువు పెరగాల్సిన పరిస్థితి వస్తే.. కొన్నిసార్లు అంతకు రెండు రెట్లు బరువు తగ్గాల్సి ఉంటుంది. తాజాగా సీనియర్ హీరో మాధవన్ కూడా అదే చేశాడు. బరువు తగ్గడం కోసం చాలామంది ఏవేవో ఎక్సర్సైజ్‌లు చేస్తూ ఉంటారు. కానీ మాధవన్ మాత్రం అవేమీ చేయకుండానే బరువు తగ్గాడు. అదంతా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్లే సాధ్యమయ్యిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తన ట్విటర్‌లో షేర్ చేశాడు.


‘రాకెట్రీ’ కోసం..


కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు మాధవన్. మధ్యమధ్యలో పలు చిత్రాల్లో నటించినా కూడా అవేవి తనకు ఊహించనంత సక్సెస్‌ను అందించలేకపోయాయి. దీంతో తానే దర్శకుడిగా ‘రాకెట్రీ’ అనే బయోపిక్‌ను తెరకెక్కించడం మొదలుపెట్టాడు. ఆ సినిమాకు తాను దర్శకుడిగా మాత్రమే కాకుండా లీడ్ రోల్ కూడా తననే చేసి అందరినీ మెప్పించాడు. ఇక ‘రాకెట్రీ’లో యంగ్ కుర్రాడిగా, ముసలివాడిగా.. తన పాత్ర కనిపిస్తుంది. దానికోసం బరువు పెరగడం, తగ్గడం లాంటివి చేశాడు. తాజాగా అలా బరువు పెరగడం కోసం తను రన్నింగ్, ఎక్సర్సైజ్ లాంటివి ఏమీ చేయలేదని, అయినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల 21 రోజుల్లో బరువు చాలా తగ్గిపోయానని ఫోటోలు చూపించాడు.


ఇవన్నీ చేయాల్సిందే..


‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. తినే ఆహారాన్ని కనీసం 45 నుంచి 60 సార్లు నమలాలి. అంటే నీళ్లను తాగుతూ ఆహారాన్ని మింగాలి. సాయంత్రం 6.45 నిమిషాలకు చివరిగా ఆహారాన్ని తినాలి. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత కేవలం వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి, పచ్చిది తినకూడదు. ఉదయాన్నే చాలా దూరం నడవాలి. అర్థరాత్రి ముందే గాఢంగా నిద్రపోవాలి. నిద్రపోయే 90 నిమిషాల ముందు వరకు అసలు ఫోన్లు, టీవీలు లాంటివి చూడకూడదు. చాలా లిక్విడ్స్ తీసుకోవాలి. చాలా పచ్చటి కూరలు, ఈజీగా జీర్ణం అయ్యే, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తినాలి. ఇవన్నీ చేస్తే అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. ఆల్ ది బెస్ట్’ అంటూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి స్పష్టంగా తెలిపాడు మాధవన్.






పక్కా టిప్స్..


ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి, దాని ప్రయోజనాల గురించి చెప్పారు. ఇప్పుడు అందులో మాధవన్ కూడా యాడ్ అయ్యారు. బరువు తగ్గడం కోసం తను చెప్పిన టిప్స్ అన్నీ కరెక్ట్‌గా పాటించడం మంచి మార్గమని అంటున్నారు మాధవన్. ఆయన చివరిగా ‘సైతాన్’ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. కేవలం హిందీలో మాత్రమే విడుదలయినా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా క్లీన్ హిట్‌ను సాధించింది.



Also Read: ‘మురారీ’ మళ్లీ వస్తున్నాడు, రీరిలీజ్‌కు కృష్ణవంశీ నిర్ణయం - 18 నిమిషాల సీన్స్ కట్?