Tips for Maintaining Liver Health : శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపి.. పూర్తి ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలేయం కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఆహారం ద్వారా తీసుకున్న పోషకాలను, మెడిసన్స్‌ను శరీరానికి అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. హార్మోనల్ సమస్యలను దూరం చేస్తుంది. మెటబాలీజాన్ని రెగ్యులేట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇలాంటి లివర్ని హెల్తీగా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సహజంగా లివర్ డీటాక్స్ కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
లెమన్ వాటర్
మీ ఉదయాన్ని లెమన్ వాటర్‌తో స్టార్ట్ చేయండి. గోరువెచ్చని నీటిలో తాజాగా పిండిన నిమ్మరసం కలిపి పరగడుపునే తాగండి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. లివర్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది.
ఆహారం..
కాలేయాన్ని శుభ్రం చేసుకునేందుకు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్‌ని డైట్లో చేర్చుకోవాలి. ఆకుకూరలు, వెల్లుల్లి, బీట్రూట్, పసుపు వంటి వాటిని డైట్లో చేర్చుకోవాలి. ఆరెంజ్, ద్రాక్షలు వంటి వాటిలో విటమిన్ సి ఉంటాయి. ఇవి కూడా లివర్ హెల్త్‌కి మంచివి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. లివర్ని డిటాక్స్ చేసి.. మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
ఫాస్టింగ్..
వారంలో ఏదొక రోజు మీరు ఫాస్టింగ్ చేయండి. లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా ఉపవాసం చేయడం వల్ల లివర్ డిటాక్స్ అవ్వడంపై ఫోకస్ పెడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. లివర్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది.
వ్యాయామం
ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా లివర్ హెల్త్ మెరుగవుతుంది. నడక, యోగా, సైక్లింగ్ వంటివి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి లివర్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. సహజంగా కాలేయాన్ని డిటాక్స్ చేస్తాయి. ఒత్తిడి కూడా లివర్‌పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. యోగా, మెడిటేషన్ వంటివి చేయొచ్చు.
హైడ్రేషన్
హైడ్రేషన్ అనేది లివర్ హెల్త్‌ని పూర్తిగా మెరుగుపరుస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగండి. దీనివల్ల లివర్ ఫిల్టర్ అవుతుంది. టాక్సిన్లను బయటకు పంపుతుంది. మెటబాలీజంని పెంచి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దూరంగా ఉండండి..
ప్రాసెస్ చేసిన ఫుడ్‌ని పూర్తిగా మానేస్తే మంచిది. లేదా లిమిట్‌గా తీసుకోవాలి. ప్రిజెర్వేటివ్స్ ఉండే ఫుడ్‌కి, కెమికల్స్‌కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌ని తగ్గించడం లేదా మానేయడం జరగాలి.
ఇవన్నీ కాలేయాన్ని సహజంగా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. వైద్యుల సహాయంతో లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరచుకునేందుకు సప్లిమెంట్స్ కూడా డైట్లో తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.