Best Ways To Increase Sperm Count: పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేయాలంటే స్పెర్మ్ కౌంట్ చాలా ముఖ్యం. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే మహిళల గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుత జీవన శైలి, ఉరుకుల పరుగుల టెన్షన్ జీవితం, పొల్యూషన్, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోకపోవడం, ధూమపానం, మద్యపానం లాంటి పలు కారణాలతో పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోంది. స్పెర్మ్ కౌంట్ అనేది మిల్లీ లీటర్ వీర్యంలో సుమారు 15 మిలియన్ల నుంచి 200 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే సంతానోత్పత్తిలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ ను పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
1. వెయిట్ మెయింటెనెన్స్
అధిక బరువు, తక్కువ బరువు.. రెండూ స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఎక్కువ బరువున్నా, తక్కువ బరువున్నా స్పెర్మ్ కౌంట్ తగ్గి, సంతానోత్పత్తి మీద ఎఫెక్ట్ పడుతుంది. వీలైనంత వరకు ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయాలి.
2. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి
స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో పాటు పలు రకాల పోషక పదార్థాలను తినాలి. బెర్రీస్, సీడ్స్ లాంటి యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ స్పెర్మ్ పెరుగుదలకు కారణం అవుతాయి.
3. తప్పని సరిగా వ్యాయామం చేయడం
ప్రతి రోజూ సుమారు గంట పాటు వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్ గా తయారవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శరీరం హెల్దీగా ఉంటే స్పెర్మ్ కౌంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.
4. స్మోకింగ్ మానేయాలి
స్మెర్మ్ కౌంట్ తగ్గడం, వీర్య కణాల చలనానికి స్మోకింగ్ అడ్డంకిగా మారుతుంది. దూమపానం మానేయడం వల్ల స్మెర్మ్ కౌంట్ పెరిగి సంతానోత్పత్తి సామర్థ్యం బలోపేతం అవుతుంది.
5. ఆల్కహాల్ కంట్రోల్ చేయాలి
ఆల్కాహాల్ అధికంగా తీసుకోవడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. స్పెర్మ్ ఉత్పత్తి దెబ్బతింటుంది. ఆల్కాహాల్ వీలైనంత వరకు తగ్గించడం లేదంటే మానేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది.
6. స్ట్రెస్ తగ్గించుకోవాలి
స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణం స్ట్రెస్. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా లేదంటే ధ్యానం చేయడం మంచిది.
7. హీట్ కంట్రోల్
శరీరంలో ఉత్పత్తి అయ్యే అధిక వేడి కారణంగా స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. వృషణాల దగ్గర సరైన ఉష్ణోగ్రతను మేనేజ్ చేయడానికి వేన్నీళ్ల స్నానం, ఆవిరి స్నానం చేయకపోవడం మంచిది. బిగుతుగా ఉండే లోదుస్తులను వేసుకోకపోవడం మంచిది.
8. చక్కటి నిద్ర
స్పెర్మ్ ఉత్పత్తి పెరగాలంటే చక్కగా నిద్రపోవాలి. రోజుకు సుమారు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. సరిపడ నిద్ర హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహించి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కారణం అవుతుంది.
9. సప్లిమెంట్లను తీసుకోవాలి
స్పెర్మ్ కౌంట్ పెంచడానికి జింక్, సెలీనియం, విటమిన్ D లాంటి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది. వైద్యుల సలహా మేరకు ఈ వీటిని ఉపయోగించాలి.
10. హాని కారకాలను దూరంగా ఉండాలి
పరుగు మందులు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు సేంద్రియ ఆహారాలను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!