Interesting Facts About the Leviathan Snake : ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎన్నో వింతలు జరుగుతున్నాయి. నమ్మలేని విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. వాటిలో మెక్సికోలో ఓర్స్ ఫిష్ బయటకొచ్చింది. తాబేళ్లు కూడా షీ షోర్కి వచ్చాయి. లెవియాథన్ పాము కూడా ఇంకా బతికే ఉంది. ఇవన్నీ యుగాంతాన్ని సూచించే సంకేతాలే అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. 800 అడుగులు.. సారీ సారీ 800 కిలోమీటర్లు ఉండే ఈ పాము బయటకొస్తే ప్రపంచ ప్రళయం తప్పదట. అసలు దీనివెనకున్నా బ్యాక్ ఎండ్ స్టోరి ఏంటో తెలుసా? ఫిక్షనలా? రియలా? చూసేద్దాం.
లెవియాథన్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు
లెవియాథన్ పాము గురించి ఇప్పుడొస్తున్న కథనాలు పక్కన పెడితే.. దీని గురించిన ప్రస్తావన ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. కొన్ని వందలు కాదండోయ్.. కొన్ని వేల ఏళ్ల వెనుక కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. పలు మత గ్రంథాలు.. లెవియాథన్ పాముని వివిధ రకాలుగా వర్ణించాయి. ఈ పాము గురించి కొందరు బుక్స్ కూడా రాసి ప్రచురించారు. వాటి ప్రకారం లెవిథన్ సైజ్ చాలా పెద్దది.
కొన్ని మత గ్రంధాల ప్రకారం ఇది లెవియాథన్ 800 అడుగులు ఉంటుందట. సైజ్‌లో ఇంత భారీగా ఉండే ఈ సముద్రపు జీవికి.. పొరలు పైన ఉంటాయట. ఇవి ఇనుము పొరల్లా ఉండి.. దానికి రక్షణ కవచంగా పనిచేస్తాయట. అలాగే దాని పళ్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయటే.. ఒక పెద్ద షిప్‌ని కరిస్తే ముక్కలు ముక్కలు అయిపోతుందట. అది గర్జిస్తే నోటి నుంచి ఫైర్ వస్తుందట. ఇవన్నీ ప్రపంచాన్ని నాశనం చేసేందుకు దానికి హెల్ప్ చేస్తాయట. అలాంటి ఈ పాము సముద్రానికి అట్టడుగు భాగంలో ఉందని కథలుగా చెప్తున్నారు.
అప్పుడే బయటకు వస్తుందట..
ఈ కథలను మెసపటోమియన్, క్రిస్టియన్స్, జూయిష్ వంటి పలు మత గ్రంథాలను నమ్మే ప్రజలు సమర్థిస్తున్నారు. అయితే వేటిలో దీని ప్రస్తావన వచ్చినా.. చివర్లో చెప్పింది ఏంటంటే.. అది బయటకు వస్తే మాత్రం భూకంపం, ప్రళయం వస్తుందని చెప్తున్నారు. ప్రపంచంలో తప్పులు ఎక్కువైనప్పుడు, విచక్షణ కోల్పోయి ప్రజలు బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ లెవియాథన్ బయటకు వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి సంకేతాలనే ఉన్నాయని.. లెవియాథన్ బయటకు వస్తే దాని చుట్టూ సముద్ర జంతువులు ఉండవని.. అందుకే సముద్రం నుంచి వివిధ జంతువులు బయటకు వచ్చేస్తున్నాయని అంటున్నారు. అలాగే దీనిని స్కాషియో ప్లేట్స్కి రిలేట్ చేసి చెప్తున్నారు.
స్కాషియా ప్లేట్స్ (Scotia Plates)
ఈ లెవియాథన్ పాముకి స్కాషియా ప్లేట్స్కి లింక్ పెడుతూ కొందరు భయపడుతున్నారు. అసలు దానికి దీనికి లింక్ ఏంటంటే.. భూమి అనేది అనేక ప్లేట్స్ నిర్మితం. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వీటి గురించి చాలామంది స్టడీ కూడా చేశారు. అయితే ఈ స్కాషియా ప్లేట్ గురించి అంతగా రీసెర్చ్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ కూడా తక్కువ. తక్కువ ప్లేస్ ఉందేమో.. అందుకే తెలియట్లేదేమో అనుకుంటే పొరపాటే. ఇది దాదాపు 800 కిలోమీటర్లు ఉంటుంది. అయినా సరే దీని గురించిన సరైన డిటైల్స్ లేవట. ఇది అంటార్కిటికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఉంది. ఆ లొకేషన్ని మనం పైనుంచి చూస్తే అది పాము తలలా ఉంటుందట. దాని సైజ్ కూడా పరిగణలోకి తీసుకుంటే లెవియాథాన్ పాము ఊహలను నిజంచేసేలానే ఉంది. ఎందుకంటే ఈ స్కాషియా ప్లేట్స్ వెడల్పు 800 కిలోమీటర్లట. అందుకే కొందరు లెవియాథాన్ పామును 800 అడుగులకు బదులు 8 వందల కిలోమీటర్లు అంటున్నారు.
కల్పితమా? వాస్తవమా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెవియాథన్ని Sea Monsterగా చెప్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్కాషియో ప్లేట్ కూడా దాని రూపాన్ని పోలి ఉండడంతో ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ మ్యాప్ లుక్ నిజమే అయినా.. సముద్ర రాక్షసుడిగా చెప్పే లెవియాథన్ పూర్తిగా కల్పితమని చెప్తున్నారు. కొన్ని గ్రంథాల్లో ప్రస్తావన ఉందనే మాట నిజమే కానీ.. వాటి ప్రజలు నమ్మకపోవడమే మంచిదని చెప్తున్నారు.
మరికొందరు ఇది చైనీస్ డ్రాగన్ లుక్‌ని పోలి ఉందని చెప్తున్నారు. మరికొందరు ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా చూస్తుంటే.. కొందరు మాత్రం తమ మత గ్రంథాలు చెప్తున్నాయని.. ప్రళయం తప్పదని భయపడుతున్నారు. కానీ ఆన్లైన్లో చూసే ప్రతి అంశాన్ని నమ్ముతూ భయపడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. పైగా ఈ మధ్య నిజాన్ని దాచేసే, ప్రజలను భయభ్రాంతులను చేసే ఎన్నో ఏఐ వీడియోలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి.. ఊహాగానాలకు దూరంగా, వాస్తవాలకు దగ్గరగా ఉంటే మంచిది.