Krishna Janmashtami Fasting Tips : జన్మాష్టమి(Janmashtami 2026) పండుగను దేశవ్యాప్తంగా కృష్ణుడి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పెద్ద సంఖ్యలో ఉపవాసం చేస్తారు. చాలామంది నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తే.. మరికొందరు పండ్లు తింటూ ఆ రోజు ఉపవాసాన్ని పూర్తి చేస్తారు. ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల నీరసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఉపవాస సమయంలో సరైన ఆహారం తీసుకుంటూ.. ఆచారాలను పాటిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Continues below advertisement

ఉపవాసం ప్రారంభించే ముందు..

కృష్ణాష్టమి ఉపవాసం సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి ఉపవాసం ప్రారంభించే ముందు తేలికపాటి, పోషకమైన భోజనం చేయడం ఉత్తమం. ఇది శరీరానికి ఆ రోజుకు అవసరమైన శక్తిని అందిస్తుంది. బాగా మసాలా ఉన్న, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కడుపులో భారంగా అనిపించేలా చేస్తాయి. 

Also Read : నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్

Continues below advertisement

పండ్లు తినండి..

ఉపవాస సమయంలో పండ్లు తినడం మంచిది. అరటిపండ్లు, ఆపిల్స్, దానిమ్మపండ్లు, బొప్పాయి వంటి పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. వాటిలో సహజ చక్కెరలు కూడా ఉంటాయి. ఇవి శక్తిని నిలుపుకోవడానికి, నీరసాన్ని నివారించడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా పండ్లు తింటే ఆకలి అదుపులో ఉంటుంది.

సగ్గుబియ్యం ఫుడ్స్..

ఉపవాస సమయంలో సగ్గుబియ్యం కిచిడీ, సగ్గుబియ్యం వడ వంటివి కూడా తింటారు. సగ్గుబియ్యం తక్షణ శక్తిని అందిస్తుంది. కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే అధిక నూనె లేదా నెయ్యిలో వేయించకుండా వీటిని చేసుకోవాలి.

Also Read : మహా శివరాత్రి ఉపవాస నియమాలు.. ఉపవాసం అంటే అర్థమదే, దోషం లేకుండా ఎలా చేయాలో తెలుసా?

పెరుగు, మఖానా కూడా..

ఉపవాస సమయంలో పెరుగు తింటే కడుపునకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మఖానాను కూడా తేలికైన, పోషకమైన స్నాక్గా తీసుకోవచ్చు. దీనిని నెయ్యిలో తేలికగా వేయించుకుని తినవచ్చు. మఖానాలో మంచి మోతాదులో కాల్షియం, ప్రోటీన్ ఉంటాయి. ఇవి రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. 

హైడ్రేషన్ ముఖ్యం..

మీరు నీరు తాగుతూ ఉపవాసం చేయాలనుకుంటే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి. నీరసం, తల తిరగడం వంటివి దూరమవుతాయి. 

ఉపవాసం విరమించేటప్పుడు..

సుదీర్ఘ ఉపవాసం తర్వాత.. ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోకూడదు. అలాగే వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. తేలికపాటి పండ్లు లేదా ద్రవ పదార్థాలతో ఉపవాసం విరమించి క్రమంగా సాధారణ ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థపై ఆకస్మిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరం మరింత సులభంగా రొటీన్​కు తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది. 

Also Read : వైకుంఠ ఏకాదశి ఉపవాసం.. ఫాస్టింగ్ చేసేప్పుడు ఇవి ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిదట