Kitchen Sink Drain Blocked : వంటగదిలో సింక్ డ్రెయిన్ మూసుకుపోవడం, నీరు సరిగ్గా వెళ్లకపోవడం అనేది చాలామంది ఎదుర్కొనే రోజువారీ సమస్య. గిన్నెలు కడిగేటప్పుడు సింక్‌లో నీరు నిలిచిపోయినా.. దుర్వాసన వచ్చినా.. లేదా నీరు అస్సలు పోకపోయినా.. దానికి కారణం లోపల ఫుడ్, నూనె, జిడ్డు పేరుకుపోవడమే. అలాంటప్పుడు నీరు కిందకిపోకుండా వాసనతో ఇబ్బంది పడుతుంది. క్లీన్ చేసేందుకు చాలామంది వెంటనే ప్లంబర్​ని పిలుస్తారు. కానీ దానికంటే ముందు మీరు కొన్ని ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు. 

Continues below advertisement

గోరువెచ్చని నీరు, డిష్‌వాషింగ్ లిక్విడ్​తో..

నూనె లేదా గ్రీజు పేరుకుపోవడం వల్ల సింక్ డ్రెయిన్ నుంచి నీరు నెమ్మదిగా పోతుంటే.. ముందుగా వీలైనంత నీటిని బయటకు తీసేయండి. ఆ తర్వాత.. కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను డ్రెయిన్‌లో పోసి కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత నెమ్మదిగా వేడి నీటిని పోయండి. బాగా వేడిగా ఉండే నీరు వేస్తే కొన్ని పైపులు పాడైపోతాయి. కాబట్టి మరుగుతున్న నీటిని ఉపయోగించకండి. ఈ పద్ధతి చిన్నపాటి అడ్డంకులను, గ్రీజును వదులు చేయడానికి హెల్ప్ చేయవచ్చు. 

Also Read : ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్​ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే

Continues below advertisement

సింక్ ప్లంజర్‌తో..

నీరు బయటకు వెళ్లకపోతే.. మీరు సింక్ ప్లంజర్‌ను ఉపయోగించవచ్చు. ప్లంజర్ రబ్బరు భాగం మునిగేంత నీటితో సింక్‌ను నింపండి. ప్లంజర్‌ను డ్రెయిన్‌కు గట్టిగా ఆనించి, దానిని చాలాసార్లు పైకి కిందకి నొక్కండి. ఇది పైపు లోపల ప్రెజర్ పెంచుతుంది. అడ్డుపడిన చెత్తను వదులు చేయడానికి సహాయపడుతుంది. సింక్‌కు రెండు డ్రెయిన్‌లు ఉంటే.. రెండవ డ్రెయిన్‌ను మూసివేసి ప్లంజర్‌ను ఉపయోగించడం మరింత ఎఫెక్టివ్​గా ఉంటుంది.  కొన్ని ప్రయత్నాల తర్వాత నీరు ప్రవహించడం మొదలైతే.. శుభ్రమైన నీటితో డ్రెయిన్‌ను పూర్తిగా ఫ్లష్ చేయండి.

Also Read : కిచెన్ క్లీనింగ్ టిప్స్.. పండుగల సీజన్లో వంటగదిని మెరిసేలా చేసే 7 చిట్కాలివే

చెత్త పేరుకుపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సింక్ డ్రెయిన్‌లో తరచుగా అడ్డంకులు ఏర్పడకుండా ఉండాలంటే.. పాత్రలు కడగడానికి ముందు వాటిలో మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తబుట్టలో పడేయండి. నూనె, నెయ్యి, గ్రీజును నేరుగా సింక్‌లో వేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి గట్టిపడి పైపులను మూసివేయగలవు. ఆహారం డ్రెయిన్‌లోకి వెళ్లకుండా నిరోధించడానికి, డ్రెయిన్ పైన ఒక చిన్న జల్లెడ లేదా జాలీని అమర్చాలి. 

ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నీరు పోకపోతే.. డ్రెయిన్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తే.. లేదా పైపులో లీక్ కనిపిస్తే.. దానిని మీరే తొలగించడానికి ప్రయత్నించే బదులు ప్లంబర్ సహాయం తీసుకోవడం మంచిది. అడ్డంకి తీవ్రంగా ఉన్నా.. నీరు వెనక్కి వస్తున్నా.. లేదా పైపులో లీక్ ఉంటే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. 

Also Read : ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి చెక్ లిస్ట్ ఇదే.. ఇలా చేస్తే మూలమూలలా మెరిసిపోతుంది