Kitchen Cleaning Hacks : పండుగల సమయంలోనే కాదు.. కిచెన్​ను ఎప్పుడైనా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో కిచెన్ మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో వైరస్, బ్యాక్టిరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కేవలం మాన్​సూన్​ అనే కాదు ఏ కాలమైన తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండాలన్నా, ఎలాంటి బ్యాక్టిరియా వ్యాప్తి ఉండొద్దు అనుకున్న వంటగదిని వీలైనంత క్లీన్​గా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మీ కిచెన్​ను క్లీన్​గా ఉంచుకోవడానికి హెల్ప్ చేసే ఏడు స్పెషల్ చిట్కాలు ఇక్కడున్నాయి. ఇవి మీరు ఎఫెక్టివ్​గా, ఆర్గానైజ్ చేసుకుంటూ కిచెన్​ను శుభ్రం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. 

అవసరంలేనివి వద్దు

కిచెన్ క్లీన్ చేసేప్పుడు ముందుగా చేయాల్సిన పని ఏంటి అంటే.. అవసరం లేని వస్తువులు తేసివేయాలి. మిగిలిన వాటిని సర్దిపెట్టుకోవాలి. కాబట్టి వంటిగదిలోని క్యాబినెట్​లు, అల్మారాలోని వస్తుపులను బాగా వెతకండి. ఆరు నెలలకు పైగా ఉపయోగించని పాత్రలు, వస్తువులు తీసేస్తే మంచిది. మరీ అవసరం అనుకున్నవి తప్పా మిగిలినవి పడేస్తే మంచిది. దీనివల్ల వంటింట్లో ప్లేస్ పెరుగుతుంది. చూసేందుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. 

డీప్ క్లీనింగ్

డీప్ క్లీనింగ్​లో భాగంగా దెబ్బతిన్న, పాడైన వస్తువులు, పిండి వంటివి పడేయాలి. వంటగది చిమ్నీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్​లు కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిపై ధూళి, గ్రీజు ఎక్కువగా ఉండిపోతాయి. వీటిని శుభ్రపరిచేటప్పుడు.. ముందుగా కాసేపు నానబెట్టాలి. గోరు వెచ్చని నీరు, బేకింగ్ సోడా, డిష్ క్లీనింగ్ సబ్బుతో మిశ్రమాన్ని తయారు చేసి.. వాటితో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా చిమ్నీపై చల్లి శుభ్రం చేసుకోవచ్చు. 

షెల్ప్​లు, కౌంటర్ టాప్​లు

వంట చేసేప్పుడు పిండి, వంట నూనె వంటి మరకలు కౌంటర్‌టాప్‌పై పేరుకుంటాయి. వాటిపై ధూళి పడితే.. మురికిగా మారి ఎండిపోతాయి. అలాగే షెల్ఫ్‌లు కంటి స్థాయి కంటే ఎత్తులో ఉంటాయి కాబట్టి అరుదుగా శుభ్రపరచడం వల్ల జిడ్డు పేరుకుపోతుంది. కాబట్టి ఈ ప్రాంతాలను వెనిగర్, గోరువెచ్చని నీటి మిశ్రమంతో శుభ్రం చేయవచ్చు. షెల్ఫ్‌ల నుంచి అన్ని వస్తువులను తీసివేసి.. ఆ మిశ్రమాన్ని చల్లి క్లీన్ చేసుకోవచ్చు. 

బొద్దింకలకై..

వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఆహారంపై, స్వీట్లపై వాలిపోతూ ఉంటాయి. కిచెన్ శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. పురుగులు, బొద్దింకలు రాకుండా స్ప్రేలు, వికర్షక జెల్స్ ఉపయోగించవచ్చు. మింట్ ఆయిల్​ను నీటిలో కలిపి.. వంటగది మూలల్లో చల్లితే పురుగులు, బొద్దింకల బెడద తప్పడమేకాకుండా ఫ్రెష్​గా ఉంటుంది. 

సింక్ క్లీనింగ్ 

వంటగదిలో రోజూ ఉపయోగించేవాటిలో సింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దానిని శుభ్రం చేసేందుకు డిష్ సబ్బు లేక లిక్విడ్స్ వాడొచ్చు. అలాగే దానికి సంబంధించిన డ్రైన్​ను శుభ్రపరుచుకోవాలి. బేకింగ్ సోడాను వేడినీటిలో కలిపి పైపులోని గొట్టాలలో వేయవచ్చు. దీనివల్ల దుమ్ము, లోపలి మురికి తగ్గుతుంది. 

ఫ్రిజ్ క్లీనింగ్

ఫ్రిజ్​లో పెట్టిన మిగిలిపోయిన, అవసరం లేని ఆహార పదార్థాలను బయటకు తీసేయాలి. ఫ్రిజ్​ను క్లీన్ చేసుకోవడం కిచెన్ క్లీనింగ్​లో భాగంగానే చూడాలి. గడువు ముగిసిన ఫుడ్స్ పడేయాలి. ఎలాంటి కెమికల్స్​ లేకుండా గోరువెచ్చని నీటితో వాటిని శుభ్రం చేస్తే మంచిది. పైగా ఫ్రిజ్​ని క్లీన్ చేస్తే ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది. 

మేక్​ఓవర్.. 

పండుగల సమయంలో లేదా మీరు కొత్తదనం కోరుకున్నప్పుడు కిచెన్​లో చిన్న మేక్​ఓవర్ చేయండి. రిఫ్రెష్​గా ఉండేందుకు వంటింట్లో కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. లేదంటే కిచెన్ క్లాత్స్, కర్టెన్స్ మార్చుకోవచ్చు. 

ఈ చిట్కాలు, ఉపాయాలను ఫాలో అయితే మీ వంటగది శుభ్రంగా ఉండటమే కాకుండా.. పండుగ సీజన్ సమయంలో ఎక్కువగా సర్దుకునే అవకాశం ఉండదు. 

Also Read : అద్దె ఇంట్లో ఉంటున్నారా? మీ హక్కులు తెలిస్తే ఓనర్స్ వణికిపోతారు.. తప్పక తెలుసుకోండి