Methi Paratha Recipe : మెంతికూరతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనిని పప్పు, పచ్చడి రూపంలో, ఫ్రై రూపంలో ఎక్కువ తీసుకుంటారు. కానీ దానిని చపాతీల రూపంలో కూడా తీసుకోవచ్చు. టేస్టీగా, హెల్తీగా తినాలనుకునేవారికి మేతి చపాతీలు బెస్ట్ ఆప్షన్. నార్త్​లో ఫేమస్​ అయినా ఈ డిష్​ని చేసుకోవడం చాలా తేలిక. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలా టేస్టీగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - 1 కప్పు

మెంతి కూర - 1 కట్టలు

Continues below advertisement

ఉల్లిపాయ - 1 

పచ్చిమిర్చి - 2

Also Read : పిల్లలకి నచ్చే.. పెద్దలు మెచ్చే.. డ్రై ఫ్రూట్ చాక్లెట్ రెసిపీ, ఇంట్లోనే చేసేయండిలా

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

పసుపు - అర టీస్పూన్

కారం - 1 టీస్పున్

ఉప్పు - రుచికి తగినంత

నూనె - 1 స్పూన్

తయారీ విధానం

ముందుగా మెంతికూరను బాగా కడిగి కట్ చేసుకోవాలి. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నూనె  వేసి బాగా కలపాలి. ఎంతగా అంటే మెంతికూరలోని నీరు బయటకు వచ్చేలా బాగా కలుపుకోవాలి. ఇలా రావాలంటే మెంతికూర ఫ్రెష్​గా ఉండేలా చూసుకోవాలి. ఇలా మెంతికూర నుంచి నీరు వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి. 

Also Read : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న చికెన్ కారం పొడి రెసిపీ.. ఇంట్లోనే, సింపుల్​గా ఇలా చేసుకోండి

గోధుమ పిండిని చపాతీల కలుపుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా నీటిని వేయనవసరం లేదు. మెంతికూరలోని నీరే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంది పిండి అనుకుంటే కాస్త నీళ్లు వేసుకుని.. మెంతికూర పిండిలో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీనిని ఓ గిన్నెలో పెట్టి మూత వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 

పిండిని చపాతీకోసం ఉండలుగా చేసి చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. స్టౌవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కాస్త వేడి అయిన తర్వాత మెంతి చపాతీలు వేసి కాల్చుకోవాలి. నూనెకు బదులుగా బటర్ ఉపయోగించుకుంటే రుచి, వాసన కూడా మరింత పెరుగుతుంది. చపాతీని రెండువైపులా కాల్చుకుని మంచి అరోమా వచ్చి కాలింది అనుకున్నప్పుడు తీసేయడమే. 

ఈ టేస్టీ మేతి చపాతీలను నేరుగా తినేయవచ్చు. లేదా మంచి కర్రీ, పెరుగుతో సహా తీసుకోవచ్చు. వేడి వేడిగా తిన్నా.. లేదా బాక్స్​లో తీసుకెళ్లినా మంచిదే. ఎవరైనా పిల్లలకు మెంతి కూర పెట్టాలనుకుంటే వారికి నేరుగా కాకుండా ఇలా కూడా టేస్టీగా చేసి పెట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి టేస్టీ, హెల్తీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. 

Also Read : చాకో చిప్ కుకీస్ సింపుల్, టేస్టీ రెసిపీ.. ఎగ్ లేకుండా ఎలా చేయవచ్చంటే