త్తర కొరియా నియంత కిమ్ జంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన దేశాన్ని నరకంగా మార్చిన ఘనత అతడికే దక్కుతుంది. ఎందుకంటే.. నరకంలో కూడా ఉండనన్ని శిక్షలను అక్కడే అమలు చేస్తారు. ఆ దేశంలో తనకంటే ఎవరూ రిచ్‌గా ఉండకూడదనేది కిమ్ అభిమతం. అక్కడి ప్రజలు కరువుకాటకాలతో అల్లాడుతూ ఆకలి చావులు చస్తున్నా.. ఆ నియంత మనసు కరగడం లేదు. పైగా.. కొత్త రూల్స్‌తో ప్రజల  స్వే్చ్ఛను మరింత హరిస్తున్నాడు. కిమ్ తాజాగా ప్రవేశపెట్టిన మరో కొత్త రూల్ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


కిమ్ జాంగ్ ఉన్.. స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనని తాను దేవుడగా భావించే కిమ్.. తన ప్రజలు తమకు నచ్చిన విధంగా ఉండేందుకు ఇష్టపడడు. చివరికి హెయిర్ స్టైల్ విషయంలో కూడా ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. అక్కడి స్త్రీ, పురుషులు ప్రభుత్వం ఆమోదించిన 28 రకాల హెయిర్ స్టైల్స్‌లో మాత్రమే జుట్టు కత్తిరించుకోవాలి. తేడా వస్తే.. అరెస్ట్ తప్పదు. తాజాగా కిమ్ మరో కొత్త రూల్ పెట్టాడు. ఇకపై ప్రజలెవరూ తన స్టైల్‌ను కాపీ కొట్టకూడదని ఆదేశించాడు. 


కిమ్ జంగ్ ఉన్‌.. ఎప్పుడూ లేదర్ జాకెట్‌ను ధరిస్తాడు. అది తన వైభోగానికి ప్రతీకగా భావిస్తాడు. కిమ్ స్టైల్‌ను మార్కెట్ చేసుకోవడం కోసం స్థానిక వస్త్ర పరిశ్రమలు చీప్ మెటీరియల్స్‌తో కిమ్ జాకెట్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. తక్కువ ధరలకే వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నాయి. దీంతో పేదలు సైతం వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి.. కిమ్‌ మండిపడ్డాడు. ఇకపై తన స్టైల్‌ను కాపీ కొట్టకూడదని ఆదేశాలు జారీ చేశాడు. తన లెదర్ జాకెట్ తరహా జాకెట్లపై నిషేదం విధించాడు. ఎవరైనా ఆ జాకెట్లలో కనిపిస్తే.. అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు ‘రేడియో ఫ్రీ ఆసియా’ సంస్థ వెల్లడించింది. పేదలు సైతం అలాంటి జాకెట్లు ధరిస్తూ.. కిమ్ జంగ్ ఉన్‌లా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే వాటిని బ్యాన్ చేశారని తెలిపింది. ఇందుకు ఎలాంటి శిక్ష విధిస్తారనేది మాత్రం తెలపలేదు. 


Also Read: పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ ఎందుకివ్వరు? మన చట్టాలు ఏం చెబుతున్నాయ్?


ప్రజల స్వేచ్ఛను హరించడం ఉత్తర కొరియాకు కొత్త కాదు. ఈ ఏడాది మే నెలలో ఆ దేశ ప్రజలు.. ఈ ఏడాది మేలో ముల్లెట్స్, స్కిన్నీ జీన్స్, స్లోగన్ టీ-షర్టులు, ముక్కు పుడకలను నిషేధించాలని కిమ్ జోంగ్-ఉన్ ఆదేశించాడు. ఆ ఫ్యాషన్ పోకడలు పెట్టుబడీదారీ సమాజానికి ప్రతీకగా కిమ్ భావిస్తున్నాడు. అలాంటి ట్రెండ్‌ను ప్రోత్సహించడం కిమ్‌కు అస్సలు ఇష్టం లేదు. అలాగే పాశ్చాత్య దేశాల పత్రికలకు సైతం ఆ దేశంలోకి ప్రవేశం లేదు. చివరికి జుట్టుకు రంగులు వేసుకున్నా శిక్ష తప్పదు. 


Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం


Also Read: కలర్‌ఫుల్ టౌన్.. ప్లాస్టిక్ బొమ్మలు కావు.. ఇవన్నీ ఇళ్లే! ఎక్కడో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి