Fasting Tips in Karthika Masam : కార్తీక మాసం (Karthika Masam 2024) మొదలైపోయింది. తెలుగు నెలల్లో ఈ మాసాన్ని చాలా విశిష్టమైనదిగా చెప్తారు. ఈ నెలల్లో నదీ స్నానాలు, పూజలు, ఉపవాసాలు ఎక్కువగా చేస్తారు. ఈ నెలలో చేసే ప్రతి పూజ ఈశ్వరుడికి నేరుగా చేరుతుందని భావిస్తూ ఉంటారు. ఈ నెలలో ప్రతి రోజు, ప్రతి సెకన్ కూడా మంగళకరమైనదనే చెప్తుంటారు. ఇలాంటి మంగళకరమైన మాసంలో చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే మీరు కూడా కార్తీకమాసంలో ఉపవాసం ఉంటే కొన్ని అంశాలపై దృష్టి సారించాలి.
ఈశ్వరుడి ఆశీస్సులు.. దీవెనలు పొందేందుకు చాలామంది మహిళలు కార్తీకమాసంలో ఉపవాసం ఉంటారు. హిందూ క్యాలెండర్లో ఈ మాసానికి ఉండే ప్రత్యేకత అలాంటిది మరి. ఉదయాన్నే లేచి.. చలిని కూడా పట్టించుకోకుండా నదీ స్నానాలు లేదా తలస్నానాలు చేసి.. భక్తితో పూజలు చేస్తారు. అలాగే భగవంతుడిని ప్రసన్నం చేసేందుకు ఉపవాసం చేస్తారు. అయితే ఫాస్టింగ్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వారు ఉపవాసం చేయకూడదు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ఉపవాసం చేయాలా? వద్దా?
హెల్తీగా ఉండేవారు మొదలుకొని.. ఆరోగ్య సమస్యలు ఉండేవారు ముందుగా వైద్యుల సూచనలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది సీజన్ మారే సమయం. పైగా చలికాలం. ఈ సమయంలో శరీరంలో వివిధ మార్పులు జరుగుతుంటాయి. అలాంటి వేళ మీరు ఉపవాసం ఉండొచ్చో లేదో వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉంటే కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. మీ లైఫ్ స్టైల్‌కి, హెల్త్‌కి ఇబ్బంది కలిగించని ఉపవాసం చేయాలని చెప్తున్నారు నిపుణులు.
వారు ఉపవాసం చేయకపోవడమే మంచిది..
మీకు మధుమేహముంటే.. ఆ సమయంలో ఉపవాసం చేస్తుంటే.. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని రెగ్యూలర్‌గా చెక్ చేసుకోవాలి. వీరు ఉపవాసం చేయకపోవడమే మంచిది. గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఉపవాసానికి దూరంగా ఉండాలి. కళ్లు తిరిగినా.. నీరసంగా అనిపించినా.. ఉపవాసానికి బ్రేక్ ఇచ్చి.. ఏమైనా ఫుడ్ తీసుకోవాలి.
హైడ్రేషన్..
కొందరు ఉపవాసమున్నప్పుడు పచ్చి మంచి నీరు కూడా తాగను అంటూ ఉంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు కచ్చితంగా హైడ్రేటెడ్‌గా ఉండాలంటున్నారు నిపుణులు. లేదంటే డీహైడ్రేట్ అయి పడిపోయే అవకాశాలుంటాయి. కొందరు ఉపవాసమున్నప్పుడు ఆఫీస్‌లకు వెళ్తారు. అలాంటివారు ఫ్రూట్ జ్యూస్‌లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కళ్లు తిరిగి పడిపోయే అవకాశముందని చెప్తున్నారు.
ఆ పనులు వద్దు..
ఉపవాస సమయంలో శరీరాన్ని కష్టపెట్టే పనులు చేయకపోవడమే మంచిదని చెప్తున్నారు. లేదంటే శరీరం త్వరగా బలహీనపడిపోతూ ఉంటుంది. యాక్టివ్‌గా ఉండలేరు. లేదంటే మీ వర్క్, మీ హెల్త్‌కి తగ్గట్లు ఫాస్టింగ్ని ఎంచుకోవాలి. మీరు హెల్తీగా ఉంటే.. మీరు రోజంతా ఫాస్టింగ్ చేవచ్చు. లేదంటే కొత్తగా ఉపవాసముంటే.. మీరు ఓ పూట భోజనం చేసేలా చూసుకోవచ్చు. ఏకాదశి సమయంలో ఉపవాసం చేస్తే.. మీరు ఫుడ్ తీసుకోకపోయినా నీళ్లు, జ్యూస్‌లు తీసుకుంటే మంచిది. లేదంటే వండిన ఫుడ్ కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫాస్టింగ్ చేయవచ్చు. ఇది హెల్తీ ఆప్షన్.
ఉపవాసంలో ఫాలో అవ్వాల్సిన రూల్స్..
కార్తీక మాసంలో ఉపవాసముండాలనుకుంటే.. తెల్లారుజామునే లేవాలి. బ్రహ్మమూర్తాన లేచి.. తలస్నానం చేయాలి. శివయ్యను లేదా విష్ణువుకు పూజ చేసుకుని రోజును ప్రారంభించాలి. ఉపవాసముంటే సరి. ఈ సమయంలో కొందరు అస్సలు నాన్‌వెజ్ అస్సలు తినరు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా ఉపయోగించరు. లైట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. పాలు, నెయ్యి, ఫ్రూట్స్, నట్స్‌ను ఎక్కువగా వినియోగిస్తారు.
ఉపవాసమనేది కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. అందరూ చేయాలనే రూల్ ఏమి ఉండదు. అలా అని కేవలం కార్తీక మాసంలోనే ఉపవాసం చేయాలని రూల్ లేదు. వైద్యులు కూడా అప్పుడప్పుడు శరీరాన్ని ఫాస్టింగ్‌లో ఉంచాలని చెప్తారు. ఆరోగ్యప్రయోజనాల కోసం కూడా ఈ ఉపవాసాన్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు. కాబట్టి మీరు చేయాలనుకుంటే వైద్యుల సలహాలతో చేయొచ్చు. లేదంటే ఫాస్టింగ్ మానేయొచ్చు.
Also Read : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు