Hyderabad to Kanyakumari Budget Trip : The Last Point of View India అదేనండి కన్యాకుమారి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే భారత ద్వీపకల్పానికి దక్షిణ కొన వద్ద ఉంది కన్యాకుమారి. తమిళనాడు రాష్ట్రంలోని ఇది ఒక తీర పట్టణం. దీనిని ఎక్స్ప్లోర్ చేయాలని చాలామందికి ఉంటుంది. మీరు కూడా ఈ ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తూ.. ఎంజాయ్ చేయాలని ఉందా? అయితే తక్కువ బడ్జెట్లో మీరు కన్యాకుమారికి ఎలా వెళ్లొచ్చో.. అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో చూసేద్దాం.
హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. కాబట్టి ముందుగా నాగర్‌కోయిల్‌కి రావాలి. కాచిగూడ
హైదరాబాద్ నుంచి నాగర్‌కోయిల్‌కి స్పెషల్ ట్రైన్ (07435) ఉంటుంది. ఇది కేవలం శుక్రవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ 800 ఉంటుంది. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే 3rd క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.2,035.
నాగర్ కోయిల్ నుంచి కన్యాకుమారికి వెళ్లేందుకు బస్ ఎక్కాలి. దీని ధర రూ. 26. నేరుగా కన్యాకుమారికి వెళ్లాలనుకుంటే విజయవాడనుంచి వెళ్లొచ్చు. విజయవాడ నుంచి కన్యాకుమారికి వెళ్లే ట్రైన్ అందుబాటులో ఉంటుంది. దాని పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్ (22504). స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.620. 3rd క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.1630. నేరుగా కన్యాకుమారి వెళ్లిపోవచ్చు.
స్టేయింగ్
కన్యాకుమారిలో స్టేయింగ్ కోసం మీరు హోమ్ స్టే లేదా హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. హోమ్ స్టే రోజుకు రూ. 700 ఉంటుంది. ఇక్కడ హాస్టల్స్ ఉండవు. ఫుడ్ కోసం రోజుకి రూ. 500 వేసుకోవచ్చు. కన్యాకుమారిలో సీ ఫుడ్ చాలా ఫేమస్. ట్రై చేయవచ్చు.
ఎక్స్ప్లోర్..
క్యనా కుమారిలో చూడాల్సిన ప్రదేశాలు అన్నీ దగ్గర్లోనే ఉంటాయి. మీకు వాకింగ్ ఇష్టమైతే.. హ్యాపీగా నడుస్తూ.. అక్కడి ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇక్కడికి వెళ్తే కచ్చితంగా చూడాల్సినవి సన్‌రైజ్, సన్‌సెట్. కన్యాకుమారిలోని అమ్మన్ టెంపుల్ కూడా బాగా ఫేమస్. వివేకానంద రాక్ మెమోరియల్ కూడా చూడొచ్చు. దీనిని చూడడానికి జనరల్ టికెట్ 70రూపాయాలు, స్పెషల్ టికెట్ రూ.300 ఉంటుంది.
వాక్స్ మ్యూజియాన్ని కచ్చితంగా విజిట్ చేయండి. దీని ఎంట్రీ టికెట్ ధర రూ.120. దీనిలోనే 3డి ఫోటోలు కూడా తీస్తారు. ఇవే కాకుండా అక్కడి బీచ్‌లను బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కన్యాకుమారి బీచ్, సంగుతురాయ్ బీచ్, చోతవిలై బీచ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
అవుట్ ఆఫ్ ద బడ్జెట్
వివికానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహానికి బోట్ రైడ్ చేయొచ్చు. బీచ్‌లలో స్విమ్మింగ్, సన్‌బాత్, వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సమీపంలోని కొండలు, అడవుల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. స్ట్రీట్ షాపింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లోకల్ ఫుడ్‌ని ట్రై చేయవచ్చు. ఇవన్నీ వారి ఇష్టంతో ఉంటాయి కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ దీనికి వర్తించదు. పైన పేర్కొన్న అన్నింటిని మాత్రం మూడువేలలో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
Also Read : మున్నార్ టూ అలెప్పీ రోడ్ ట్రిప్.. పార్టనర్‌తో వెళ్తే జర్నీ అంతా కిక్ ప్రాప్తిరస్తు, డిటైల్స్ ఇవే